Latest Updates
-
మగవారూ అలర్ట్ : మూత్రం పోశాక కూడా చుక్కలు కారుతున్నాయా? ఈ 3 వ్యాధులకు సంకేతం కావచ్చు! -
ఈ కృష్ణాష్టమికి ఇంట్లోనే.. 100% పవిత్రమైన పంచామృత కేక్ తయారు చేయండిలా! -
రోడ్ సైడ్ స్టైల్ ఎగ్ శార్వా..చపాతీ, దోశ, పరోటాల్లోకి అమృతంలా! -
గ్యాస్, అజీర్తి అని ట్యాబ్లెట్లు వేసుకుంటున్నారా? ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ముప్పు కావచ్చు, జాగ్రత్త! -
ఆడవారైనా, మగవారైనా అస్సలు తాగకూడని డ్రింక్ ఏంటో తెలుసా.. డాక్టర్ సలహా ఇదే.! -
ఇడ్లీ, దోశలతో విసిగిపోయారా? ప్రొటీన్ల నిధి,బలాన్నిచ్చే ఎగ్ పరాఠా ట్రై చేయండి! -
సైలెంట్ కిల్లర్స్: పైకి ముక్కుసూటి.. వెనుక మహా కిలాడీలు!..ఈ 3 రాశులు ఎవరో తెలుసా? -
వినాయక చవితి స్పెషల్..ఇంట్లోనే ఈజీగా నోరూరించే చాక్లెట్ మోదక్ ఎలా చేసుకోవాలంటే.. -
ఫోన్ పక్కనపెట్టి ఇది ట్రై చేయండి.. హృతిక్ చెబుతున్న హెల్త్ టిప్స్! -
నార్త్ స్టైల్ చోలే మసాలా.. పూరీ, చపాతీలోకి వేళ్లు చప్పరిస్తూ లాగించేస్తారు.!
కండల వీరుడికి ఏమైంది? సల్మాన్ ఖాన్ ఇలా అయిపోడానికి కారణం అదేనా?
ముఖంలో తీవ్రమైన అలసట.. లోపలికి కుంగిపోయిన కళ్ళు.. కాంతివిహీనంగా, పొడిబారిన చర్మం.. మాట్లాడుతూనే మధ్యలో ఆయాసపడుతూ, దగ్గుతున్న వైనం.. ఇదీ బాలీవుడ్ కండల వీరుడు, అభిమానుల ముద్దుల భాయిజాన్ సల్మాన్ ఖాన్ తాజా పరిస్థితి. సల్లూభాయ్ ని ఎప్పుడూ ఎంతో ఉత్సాహంగా, ఫిట్ గా చూసిన అభిమానులకు ఈ తాజా దృశ్యాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.

తాజాగా ముంబైలోని స్లమ్ రిహాబిలిటేషన్ అథారిటీ (SRA) కార్యాలయంలో జరిగిన ఒక ఈవెంట్‌లో సల్మాన్ ఖాన్ పాల్గొన్నారు. ఆ కార్యక్రమానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో, ఆయన ఆరోగ్యంపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆయనకు ఏదైనా తీవ్రమైన జబ్బు చేసిందా? ఆహారం మానేశారా? నిద్రలేమితో బాధపడుతున్నారా? వయసు మీద పడుతోందా? లేక మానసిక ప్రశాంతతను కోల్పోయారా? అంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు.
గుర్తుకొస్తున్న పాత ఇంటర్వ్యూ..
సల్మాన్ తాజా పరిస్థితిని చూసిన తర్వాత, గతేడాది 2025 ఫిబ్రవరిలో ఆయన తన వ్యక్తిగత జీవితం గురించి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ ఇప్పుడు అందరికీ గుర్తుకు వస్తోంది. ఆ ఇంటర్వ్యూలో సల్మాన్ మాట్లాడుతూ.. తాను రాత్రిపూట కేవలం రెండు గంటలు మాత్రమే నిద్రపోతానని చెప్పి ఆశ్చర్యపరిచారు. రోజుకు 7-8 గంటలు నిద్రపోవడమా? అది బహుశా నెలకు ఒక్కసారే జరుగుతుందేమో..పని మధ్యలో ఎప్పుడైనా కాస్త సమయం దొరికితే అప్పుడు కునుకు తీస్తాను అని ఆయన స్వయంగా చెప్పుకొచ్చారు. దీన్నిబట్టి ఆయన కంటి నిండా నిద్రకు, విశ్రాంతికి ఎంత తక్కువ ప్రాధాన్యత ఇస్తారో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం సల్మాన్ రెండు భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు.
❤️ #Salmankhan @BeingSalmanKhan SALMAN KHAN pic.twitter.com/TkUFrdBf5f
— 👑 (@neelikhan786Skf) July 18, 2026
కారణం ఇదేనా..
వైద్య నిపుణుల ప్రకారం..ప్రతి ఒక్కరికీ వయసు పైబడటం సహజం. అయితే కొందరిలో ఆ లక్షణాలు చాలా త్వరగా కనిపిస్తాయి. సల్మాన్ ముఖాన్ని నిశితంగా గమనిస్తే, ఆయన చాలా త్వరగా వృద్ధాప్యానికి గురైనట్లు అనిపిస్తుంది. దీని వెనుక రెండు ప్రధాన కారణాలు ఉండొచ్చు.. ఒకటి జన్యుపరమైనది కాగా, మరొకటి జీవనశైలి.
సక్రమంగా లేని జీవనశైలి వల్ల శరీరంలో ఫ్రీ రాడికల్స్ పెరిగిపోతాయి. ఇవి కణాలపై ఆక్సీకరణ ఒత్తిడిని పెంచి, నేరుగా మన DNAను దెబ్బతీస్తాయి. అంతేకాకుండా, కణాలకు శక్తినిచ్చే మైటోకాండ్రియా పనితీరును మందగించేలా చేస్తాయి. ఫలితంగా కణాలు త్వరగా వృద్ధాప్యానికి గురవుతాయి. మెదడు కణాల మితిమీరిన, అసాధారణ పనితీరు వల్ల భవిష్యత్తులో మతిమరుపు లాంటి ప్రమాదకర వ్యాధులు వచ్చే ముప్పు కూడా ఉంది. శరీరానికి తగినంత విశ్రాంతి లేనప్పుడు శారీరక, మానసిక ఒత్తిడి పెరిగి వివిధ అవయవాల్లో వాపు వస్తుంది. దీంతో అవయవాల పనితీరు క్షీణించి, వృద్ధాప్య లక్షణాలు బయటపడతాయి.
మనం గాఢ నిద్రలో ఉన్నప్పుడే శరీరం తనను తాను బాగు చేసుకుంటుంది. దెబ్బతిన్న కణాలను సరిచేయడం, కండరాల పునర్నిర్మాణం, మెదడును చురుకుగా ఉంచడం, హార్మోన్ల సమతుల్యత వంటి అద్భుతమైన ప్రక్రియలన్నీ నిద్రలోనే జరుగుతాయి. నిద్ర కరువైతే ఈ సహజ ప్రక్రియకు ఆటంకం ఏర్పడి, ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గిపోయి జీవక్రియలు దెబ్బతింటాయి. దీర్ఘకాలంలో ఇది చర్మం, గుండె, మెదడు వంటి కీలక అవయవాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది.
సల్మాన్ ఖాన్ ఏదైనా నిర్దిష్టమైన వ్యాధితో బాధపడుతున్నారా? లేదా కేవలం నిద్రలేమి వల్లనే ఆయన కళ్లలో ఆ అలసట కనిపిస్తోందా? అనే దానిపై ఇంకా స్పష్టత లేదు. అయితే ఇలాంటి జీవనశైలి మాత్రం కచ్చితంగా ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. కాబట్ట, రోజూ ఒక నిర్దిష్ట సమయానికి పడుకుంటూ 7 నుంచి 9 గంటల పాటు కంటినిండా నిద్రపోవడం, సమతుల్య ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ ఒత్తిడిని జయించడం వల్ల వయసు పెరిగినా ఎక్కువ కాలం యవ్వనంగా, ఆరోగ్యంగా ఉండొచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications