Latest Updates
-
షుగర్, బీపీకి చెక్ పెట్టే కొర్రల కిచిడీ..వారంలో 2 రోజులు తింటే బరువు తగ్గడమే కాకుండా రోజంతా సూపర్ ఎనర్జీ! -
చికెన్, మటన్ బిర్యానీలను మరిపించే స్పైసీ టమాటా బిర్యానీ..కుక్కర్ లో ఈజీగా చేసేయండిలా.. -
తులసి తీర్థం మహిమ? చనిపోయిన మహిళ బతికింది! -
రెస్టారెంట్ రుచిని మించేలా ఇంట్లోనే బిసిబేలే బాత్.. సులభంగా ఎలా చేయాలంటే? -
కరివేపాకు vs వేప ఆకు..పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాల్లో ఏది బెస్ట్ అంటే..! -
నవరాత్రి స్పెషల్: రుచితో పాటు ఆరోగ్యం.. జీర్ణశక్తిని పెంచే అద్భుతమైన తమలపాకు కేసరి ప్రసాదం -
నోరూరించే ఆమ్లెట్ పులుసు.. పుల్లపుల్లగా, కారంకారంగా రుచి అదరహో! -
దీపావళికి ముందే ధ్వజ యోగం.. ఈ 4 రాశుల జాతకులు కోటీశ్వరులు కావడం ఖాయమా? -
నల్ల పాలు తాగుతున్న తెలుగు హీరోయిన్..ప్రయోజనాలేంటో,ఎలా చేసుకోవాలో తెలుసా? -
మటన్ సాంబార్ వండేటప్పుడు ఈ మసాలా పడితే ఆ రుచే వేరు..రాగి సంగటి, చపాతీ,అన్నంలోకి కేక
సమంత సీక్రెట్ ఇదే..రోజూ ఉదయం అలా చేస్తే లైఫ్ జిల్ జిల్ జిగా జిగా..
సాధారణంగా సెలబ్రిటీలు అనగానే వారి ఉదయపు దినచర్యలో ఖరీదైన పానీయాలు, కఠినమైన వ్యాయామాలు ఉంటాయని మనం భావిస్తాం. కానీ స్టార్ హీరోయిన్ సమంత మాత్రం వీటన్నింటికీ భిన్నంగా ఒక ప్రత్యేకమైన అలవాటును క్రమం తప్పకుండా పాటిస్తారు. అదే కృతజ్ఞతా డైరీ(Gratitude Journal) రాయడం.
ఆమె ఎంత బిజీగా ఉన్నప్పటికీ, రోజూ ఉదయాన్నే అరగంట నుండి గంట సమయం కేటాయించి తన డైరీలో ఆ రోజు తాను కృతజ్ఞతతో ఉన్న విషయాలను రాసుకుంటారు. ఆ తర్వాతే లేత సూర్యరశ్మిని ఆస్వాదిస్తూ ధ్యానం చేస్తారు. తన కష్టకాలంలో ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేసిన అద్భుతమైన అలవాటు ఇదేనని ఆమె చెబుతున్నారు.

నిజానికి మన భారతీయ సంప్రదాయంలో ఉదయం నిద్రలేవగానే దేవుడికి కృతజ్ఞతలు చెప్పడం శతాబ్దాలుగా వస్తున్న ఆచారమే. కానీ నేటి ఆధునిక తరం ఈ అద్భుతమైన సంప్రదాయాన్ని దాదాపుగా మరచిపోయింది. కళ్ళు తెరవగానే స్మార్ట్ ఫోన్ పట్టుకోవడం, సోషల్ మీడియాలో గంటల తరబడి మునిగిపోవడం నేటి దినచర్యగా మారింది. బహుశా ఈ ఫోన్ల వల్లేనేమో, నేడు ఎంతో మంది తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. అందుకే రోజును కృతజ్ఞతతో ప్రారంభించడం వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలను మనం మళ్లీ గుర్తుచేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
" title="షుగర్, బీపీకి చెక్ పెట్టే కొర్రల కిచిడీ..వారంలో 2 రోజులు తింటే బరువు తగ్గడమే కాకుండా రోజంతా సూపర్ ఎనర్జీ!
చెన్నైలో జరిగిన ఒక కార్యక్రమంలో సమంత తన ఉదయపు దినచర్య గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. తన జీవితంలో అత్యంత గడ్డుకాలాన్ని ఎదుర్కొంటున్నప్పుడు, ఒకరు ఆమెకు ఈ కృతజ్ఞతా డైరీ రాయమని సలహా ఇచ్చారట. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆ సమయంలో, సానుకూల విషయాలు ఆలోచించి రాయడం ఆమెకు మొదట్లో చాలా కష్టంగా అనిపించింది. అయినా సరే పట్టువదలకుండా ప్రతిరోజూ రాస్తూనే ఉన్నారు. కొంతకాలానికి తన పరిస్థితుల్లో వెంటనే పెద్దగా మార్పు రాకపోయినా, తన ఆలోచనా విధానంలో మాత్రం గొప్ప మార్పు వచ్చిందని సమంత గ్రహించారు. ఈ చిన్న అలవాటు ఆమె మానసిక ధైర్యాన్ని అమాంతం పెంచేసింది.
మానసిక ఆరోగ్య నిపుణులు కూడా ఈ గ్రాటిట్యూడ్ జర్నలింగ్ వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు. ఇది మన జీవితంలోని సానుకూల అంశాలపై దృష్టి పెట్టేలా చేస్తుంది. కుటుంబ సభ్యులతో గడిపిన క్షణాలు, కడుపునిండా తిన్న మంచి భోజనం లేదా ఒక కష్టమైన రోజును ధైర్యంగా ఎదుర్కోవడం... ఇలా ఏ చిన్న విషయానికైనా మనం డైరీలో కృతజ్ఞతలు తెలుపుకోవచ్చు. అలాగని బాధను అణచుకుని, బలవంతంగా నవ్వుతూ ఉండాల్సిన అవసరం లేదు. బాధగా అనిపించినప్పుడు ఆ భావాలను కూడా అంగీకరిస్తూనే, జీవితంలో ఉన్న మంచిని గుర్తించడమే ఈ డైరీ ప్రధాన ఉద్దేశం.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
