Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
చలికాలంలో తాగాల్సిన సూప్ లు ఇవే..జలుబు, దగ్గు మీ దరిచేరవు!
దేశవ్యాప్తంగా చలికాలం ప్రారంభమైంది. ఇప్పటికే చలి గాలులు మొదలయ్యాయి. ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. మారుతున్న ఈ వాతావరణం మన శరీరానికి ఎన్నో సవాళ్లను విసురుతుంది. ఒకవైపు చలి, మరోవైపు జలుబు, దగ్గు, అజీర్ణం, అలసట, రోగనిరోధక శక్తి తగ్గడం వంటి సమస్యలు మనల్ని చుట్టుముడతాయి.
ఇలాంటి సమయంలో ఆయుర్వేదం మనకు కొన్ని అద్భుతమైన పరిష్కారాలను చూపిస్తుంది. అందులో ముఖ్యమైనవి సూప్ లు. ఇవి కేవలం రుచికరమైన వంటకాలు మాత్రమే కాదు, శరీరాన్ని లోపలి నుండి బలోపేతం చేసే సహజ ఔషధాలు. శీతాకాలంలో అనారోగ్యాల బారిన పడకుండా, మీ ఆరోగ్యాన్ని కాపాడే సూప్ లు ఏవో ఇక్కడ చూడండి.

మెంతి,వెల్లుల్లి సూప్
చలికాలంలో కీళ్ల నొప్పులు చాలా మందిని ఇబ్బంది పెడుతుంటాయి. అటువంటి వారికి ఈ సూప్ ఒక వరం. మెంతి ఆకులు, అల్లం, వెల్లుల్లిని నెయ్యిలో తేలికగా వేయించి, నీరు పోసి మరిగించాలి. ఇది ఎముకల దృఢత్వానికి, కీళ్ల నొప్పుల నివారణకు చాలా బాగా పనిచేస్తుంది.
అల్లం-వెల్లుల్లి సూప్
దీనిని శీతాకాలపు ఔషధం అని పిలవవచ్చు. అల్లం, వెల్లుల్లిలోని ఔషధ గుణాలు శరీరాన్ని లోపలి నుండి వెచ్చగా ఉంచుతాయి. గొంతు నొప్పి, గొంతు గరగర వంటి సమస్యలకు ఇది చెక్ పెడుతుంది.
చిటికెడు నల్ల మిరియాలు జోడించడం వల్ల దీని ఘాటు పెరిగి, జలుబు నుండి త్వరగా ఉపశమనం కలిగిస్తుంది. క్యాబేజీ లేదా పాలకూరతో కలిపి తీసుకుంటే ఇంకా మంచిది.
క్యారెట్, బీట్ రూట్ సూప్
మీరు రక్తహీనతతో బాధపడుతున్నా లేదా నిత్యం బలహీనంగా అనిపిస్తున్నా ఈ సూప్ మీకు దివ్యౌషధం. ఇది రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచడమే కాకుండా చలికాలంలో చర్మానికి మంచి మెరుపును ఇస్తుంది.
ఉడికించిన క్యారెట్, బీట్ రూట్ లను పేస్ట్ లా చేసి, అందులో నల్ల మిరియాల పొడి, నిమ్మరసం కలుపుకుని వేడిగా తాగితే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం లభిస్తుంది.
పెసర పప్పు సూప్
ఆయుర్వేదంలో పెసర పప్పుకు ప్రత్యేక స్థానం ఉంది. ఇది చాలా సులభంగా జీర్ణమవుతుంది. ఈ సూప్ తయారు చేయడానికి ఉడికించిన పప్పులో పసుపు, అల్లం, జీలకర్ర, కొద్దిగా స్వచ్ఛమైన నెయ్యిని జోడించండి.
అలసటగా అనిపించినప్పుడు ఈ సూప్ తాగితే తక్షణ ఉపశమనం లభిస్తుంది. ఇది శరీరాన్ని డీటాక్స్ చేయడానికి కూడా అద్భుతంగా పనిచేస్తుంది.
మొక్కజొన్న, వెజిటబుల్ సూప్
చలికాలంలో వేడివేడిగా ఏదైనా తాగాలనిపిస్తే మొక్కజొన్న, మిశ్రమ కూరగాయల సూప్ బెస్ట్ ఆప్షన్. ఇది శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తుంది.
క్యారెట్లు, బీన్స్, మొక్కజొన్న గింజలు జోడించడం వల్ల దీని రుచి అద్భుతంగా ఉంటుంది. ఒక్కసారి రుచి చూస్తే రోజూ తాగాలనిపించేంత కమ్మగా ఉంటుంది.
తులసి, అల్లం సూప్
మీకు విపరీతమైన జలుబు చేసినప్పుడు ఈ సూప్ ప్రయత్నించండి. తులసి ఆకులు, అల్లం, దాల్చిన చెక్కను నీటిలో బాగా మరిగించి వడకట్టాలి.
ఈ సూప్ తాగితే మూసుకుపోయిన ముక్కు, గొంతు నొప్పి నుండి వెంటనే ఉపశమనం లభిస్తుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications