Latest Updates
-
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.?
కేవలం 2 పదార్థాలు..చుండ్రు మాయం! ఒత్తైన జుట్టు మీ సొంతం
మగవాళ్లయినా, ఆడవాళ్లయినా ప్రతి ఓక్కరూ అందమైన,ఒత్తైన జుట్టు ఉండాలనే కోరుకుంటారు. అయితే చాలామందిని వేధించే పెద్ద సమస్యల్లో చుండ్రు ఒకటి. చుండ్రు కారణంగా జుట్టు అందం మొత్తం పాడవ్వడమే కాకుండా అనేక ఇతర సమస్యలు పుట్టుకొస్తాయి.
నలుగురిలో ఉన్నప్పుడు తల దురదగా అనిపించడం, జుట్టును తాకగానే భుజాల మీద తెల్లటి పొరలు రాలడం వంటివి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి. దీనివల్ల చాలామంది నలుగురిలోకి రావడానికి కూడా సిగ్గుపడుతుంటారు. అయితే మన వంటింట్లో లభించే కొన్ని సహజమైన పదార్థాలతో చుండ్రు సమస్యను ఈజీగా నివారించవచ్చు. అదెలాగో ఇక్కడ చూడండి.

అసలు చుండ్రు ఎందుకు వస్తుంది?
కేవలం తలస్నానం చేయకపోవడం వల్లే చుండ్రు వస్తుందనుకోవడం పొరపాటు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి.
-తలపై చర్మం మరీ పొడిగా మారడం లేదా అధికంగా జిడ్డు పేరుకుపోవడం.
-ఫంగల్ ఇన్ఫెక్షన్లు (మలాసెజియా వంటివి).
-కాలుష్యం, ధూళి జుట్టు కుదుళ్లలో చేరడం.
-రసాయనాలు ఎక్కువగా ఉండే హెయిర్ స్టైలింగ్ ప్రొడక్టులను వాడటం.
-తీవ్రమైన ఒత్తిడి, పోషకాహార లోపం.
ఈ సమస్యను వదిలించుకోవడానికి మార్కెట్లో దొరికే ఖరీదైన షాంపూలు, రసాయనాలతో కూడిన ప్రొడక్ట్స్ వాడాల్సిన పనిలేదు. తక్కువ ఖర్చుతో, ఎటువంటి దుష్ప్రభావాలు లేని ఈ రెండు అద్భుతమైన చిట్కాలను ప్రయత్నించండి.
టీ ట్రీ ఆయిల్
టీ ట్రీ ఆయిల్ చుండ్రు నివారణలో ఒక సంజీవనిలా పనిచేస్తుంది. ఇందులో ఉండే సహజసిద్ధమైన యాంటీ ఫంగల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు చుండ్రుకు కారణమయ్యే ఫంగస్ ను నాశనం చేయడమే కాకుండా, తల దురదను కూడా తగ్గిస్తాయి.
వాడే విధానం: టీ ట్రీ ఆయిల్ ను నేరుగా తలకు రాయకూడదు. కొబ్బరి నూనె లేదా ఆలివ్ నూనె ఆయిల్ లో 2-3 చుక్కల టీ ట్రీ ఆయిల్ కలపాలి. ఈ మిశ్రమాన్ని తల మాడుకు పట్టించి మసాజ్ చేయాలి. కాసేపటి తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
పెరుగు మాస్క్
పెరుగు చుండ్రును తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. పెరుగులో ఉండే ప్రోబయోటిక్స్ తలపై ఉండే సూక్ష్మజీవులను బ్యాలెన్స్ చేస్తాయి. ఇది చెడు బ్యాక్టీరియా, ఫంగస్ ను తగ్గించి, మంచి బ్యాక్టీరియాను పెంచుతుంది.
వాడే విధానం: 2-3 టేబుల్ స్పూన్ల తాజా పెరుగును తీసుకోండి. అందులో కాస్త తేనె కలిపితే జుట్టుకు అదనపు తేమ, పోషణ అందుతుంది. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుండి చివర్ల వరకు బాగా పట్టించండి. సుమారు 20-25 నిమిషాల పాటు ఆరనివ్వండి. ఆ తర్వాత చల్లటి నీటితో లేదా మైల్డ్ షాంపూతో శుభ్రం చేసుకోండి.
ఈ చిట్కాలను వారానికి ఒకటి లేదా రెండు సార్లు క్రమం తప్పకుండా పాటిస్తే కొద్ది రోజుల్లోనే మీరు మార్పును గమనించవచ్చు. అదే సమయంలో మంచి నీరు త్రాగడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, ఒత్తిడిని తగ్గించుకోవడం ద్వారా మీ జుట్టును మరింత ఆరోగ్యంగా, చుండ్రు రహితంగా మార్చుకోవచ్చు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications