Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
చలికాలంలో తలనొప్పితో బాధపడుతున్నారా? ట్యాబ్లెట్స్ లేకుండా చిటికెలో ఉపశమనం పొందండిలా..
మనం గంటల తరబడి ఫోన్ లేదా కంప్యూటర్ స్క్రీన్ ల వైపు కన్నార్పకుండా చూడటం వల్ల కళ్ళపై విపరీతమైన ఒత్తిడి పడి తలనొప్పి సహజంగానే వస్తుంది. దీనికి తోడు ఇది చలికాలం. చలి గాలుల తీవ్రతకు రక్తనాళాలు సంకోచించి, సాధారణ తలనొప్పి కాస్తా మైగ్రేన్ గా మారే ప్రమాదం కూడా ఉంటుంది. మైగ్రేన్ ఉన్నవారికైతే ఈ నొప్పి సాధారణం కంటే చాలా రెట్లు ఎక్కువగా ఉండి, నరకాన్ని చూపిస్తుంది.
సాధారణంగా తలనొప్పి రాగానే మనకు గుర్తొచ్చేది వేడి వేడి అల్లం టీ లేదా స్ట్రాంగ్ కాఫీ. కెఫిన్ వల్ల కొంత ఉపశమనం లభించినా నొప్పి తగ్గకపోతే చాలామంది వెంటనే పెయిన్ కిల్లర్స్ వేసుకుంటారు. కానీ అతిగా పెయిన్ కిల్లర్స్ వాడటం ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదని.. అవి దీర్ఘకాలంలో కిడ్నీలపై,ఇతర అవయవాలపై దుష్ప్రభావం చూపిస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తుంటారు.

అందుకే మెడిసిన్స్ దాకా వెళ్ళకుండానే, మన ఇంటి చిట్కాలతో లేదా ఆఫీసులోనే పాటించగలిగే కొన్ని సహజ పద్ధతులతో తలనొప్పిని ఎలా తగ్గించుకోవచ్చో ఇక్కడ చూడండి.
స్క్రీన్ నుండి కళ్ళకు విరామం ఇవ్వండి
మీకు కంప్యూటర్ ముందు ఎక్కువసేపు పనిచేసే అలవాటు ఉంటే, మధ్యమధ్యలో బ్రేక్ తీసుకోండి. సీటులోంచి లేచి కాస్త అటు ఇటు నడవండి. ముఖ్యంగా మీ కళ్ళను నిరంతరం మొబైల్ లేదా ల్యాప్ టాప్ స్క్రీన్ పైనే ఉంచవద్దు. ప్రతి 20 నిమిషాలకు ఒకసారి స్క్రీన్ నుండి పక్కకు చూస్తూ కళ్ళకు విశ్రాంతినివ్వడం అలవాటు చేసుకోండి.
ఎసెన్షియల్ ఆయిల్స్ మ్యాజిక్
తలనొప్పిని తగ్గించడంలో సుగంధ తైలాలు అద్భుతంగా పనిచేస్తాయి. ముఖ్యంగా యూకలిప్టస్ ఆయిల్ లేదా పుదీనా ఆయిల్ మైగ్రేన్ నొప్పి నుండి వేగంగా ఉపశమనం కలిగిస్తాయి.
మీరు ఆఫీసుకి వెళ్ళేటప్పుడు మీ బ్యాగులో చిన్న బాటిల్ పుదీనా నూనెను ఉంచుకోవడం మంచిది. తలనొప్పిగా అనిపించినప్పుడు కొద్దిగా నూనెను తలకు, కణతలకు మసాజ్ చేయండి. దీనివల్ల రక్త ప్రసరణ మెరుగుపడి నొప్పి తగ్గుతుంది.
కోల్డ్ కంప్రెస్
తలనొప్పి సమయంలో తలలో నరాలు ఉబ్బినట్లుగా అనిపిస్తుంది. ఈ మంటను తగ్గించడానికి కోల్డ్ కంప్రెస్ లు గొప్పగా పనిచేస్తాయి. మీరు ఇంట్లో ఉంటే శుభ్రమైన కాటన్ వస్త్రంలో ఐస్ ముక్కలను చుట్టి తలపై పెట్టుకోవచ్చు.
ఒకవేళ ఆఫీసులో ఉంటే కూలింగ్ జెల్ నిండిన పర్సును లేదా చల్లని నీటిలో ముంచిన వస్త్రాన్ని ఉపయోగించవచ్చు. మీ తల, నుదిటి, మెడ చుట్టూ ఉన్న ప్రాంతాన్ని నొక్కి చల్లబరచడానికి దీన్ని ఉపయోగించండి. ఆ చల్లదనం వల్ల నరాలు శాంతించి, నొప్పి తీవ్రత తగ్గుతుంది.
లావెండర్ ఆయిల్ సువాసన
కేవలం మసాజ్ మాత్రమే కాకుండా కొన్ని రకాల వాసనలు కూడా తలనొప్పిని తగ్గిస్తాయి. లావెండర్ ఆయిల్ సువాసన ఒత్తిడిని తగ్గించి, మనసును ప్రశాంతంగా మారుస్తుంది.
మీ అరచేతిలో కొన్ని చుక్కల లావెండర్ నూనెను తీసుకొని, రెండు చేతులతో రుద్ది వాసన చూడండి.. లేదా మీ నుదిటి,మెడపై సున్నితంగా మసాజ్ చేయండి. ఇది తలనొప్పిని తగ్గించడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications