Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
పురుషుల్లో సంతాన సమస్యలా? స్పెర్మ్ కౌంట్, క్వాలిటీకి పరిష్కారం మీ వంటగదిలోనే!
ఏ పురుషుడికి అయినా తండ్రి అవడమనేది ఓ మధురమైన అనుభూతి,ఒక అపురూపమైన వరం. పితృత్వ ఆనందం పొందాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే మారిన లైఫ్ స్టైయిల్, ఉరుకుల పరుగుల జీవితం, ఒత్తిడి, పోషకాలు లేని ఫుడ్, చెడు అలవాట్లు చాలామంది పురుషుల పాలిట శాపంగా మారుతున్నాయి. తండ్రి కావాలనే వారి కలను దూరం చేస్తున్నాయి. ఈ రోజుల్లో పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ తగ్గడం, స్పెర్మ్ క్వాలిటీ తగ్గడం అనేది చాలా సాధారణ సమస్య అయిపోయింది.
దీంతో వైవాహిక జీవితంలొ ఇబ్బందులు, శీఘ్ర స్కలనం, లైంగిక కోరికలు తగ్గిపోవడం వంటి అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. చాలా మంది పురుషులు ఈ సమస్య గురించి బయటకు చెప్పుకోలేక, తమలో తామే మదనపడుతూ ఉంటారు. అయితే ఇది అధిగమించలేని సమస్య కాదు. మన వంటింట్లో రెగ్యులర్ గా వాడే కొన్ని సాధారణ పప్పు దినుసులతో, మన జీవనశైలిలో చిన్న చిన్న మార్పులతో ఈ సమస్యను అధిగమించి ఆరోగ్యాన్ని, సంతానోత్పత్తి సామర్థ్యాన్ని అద్భుతంగా మెరుగుపరుచుకోవచ్చు.

వీర్య వృద్ధికి తోడ్పడే అద్భుతమైన పప్పు దినుసులు
మినుములు: ఆయుర్వేదంలో మినుములను వీర్య వృద్ధికి పెట్టింది పేరుగా వర్ణించారు. ఇది కేవలం రుచికే కాకుండా పురుషుల ఆరోగ్యానికి ఒక వరం. ఇందులో ఉండే అధిక ప్రోటీన్, ఐరన్ వంటి పోషకాలు వీర్యకణాల సంఖ్యను, వాటి చలనాన్ని పెంచడంలో అద్భుతంగా సహాయపడతాయి.
ఎర్ర కందిపప్పు : ఇందులో సమృద్ధిగా లభించే ఫోలిక్ యాసిడ్, ఆరోగ్యకరమైన వీర్యకణాల ఉత్పత్తికి అత్యంత కీలకం. ఇది వీర్యం నాణ్యతను మెరుగుపరిచి, పురుషులలో సంతాన సామర్థ్యాన్ని పెంచుతుంది.
పెసర పప్పు: తేలికగా జీర్ణమవడమే పెసర పప్పు ప్రత్యేకత. ఇందులోని జింక్, పురుషులలో లైంగిక ఆరోగ్యానికి ముఖ్యమైన టెస్టోస్టెరాన్ హార్మోన్ లెవల్స్ ను బ్యాలెన్స్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
శనగ పప్పు : ఈ పప్పు శరీరానికి బలాన్ని, నూతనోత్తేజాన్ని అందిస్తుంది. దీనిలోని ప్రోటీన్, ఫైబర్ వీర్యం నాణ్యతను మెరుగుపరచడమే కాకుండా మొత్తం ఆరోగ్యాన్ని కాపాడతాయి.
ఈ జీవనశైలి మార్పులు తప్పనిసరి
పోషకాహారం: పచ్చని కూరగాయలు, తాజా పండ్లు, పాలు, ఎండు ఫలాలు వంటి పోషకాహారానికి పెద్ద పీట వేయండి.
జంక్ ఫుడ్ కు దూరం: నూనెలో వేయించిన పదార్థాలు, అధిక చక్కెర ఉన్న ఆహారాలకు దూరంగా ఉండండి.
వ్యాయామం: శారీరకంగా చురుకుగా ఉండండి. రోజూ కనీసం అరగంట సేపు వ్యాయామం మీ ఆరోగ్యాన్ని అద్భుతంగా మెరుగుపరుస్తుంది.
చెడు అలవాట్లకు స్వస్తి: మద్యపానం, ధూమపానం వంటి అలవాట్లు మీ సంతాన సామర్థ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తాయి. వాటిని వెంటనే మానేయండి.
నిద్ర: ప్రతిరోజూ 7 నుండి 8 గంటల ప్రశాంతమైన నిద్ర చాలా అవసరం.
ఒత్తిడికి చెక్: ఒత్తిడి మీ పాలిట శత్రువు. యోగా, ధ్యానం వంటివి మీ మనసును ప్రశాంతంగా ఉంచడంలో సహాయపడతాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications