Latest Updates
-
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్‌లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.!
మండే ఎండలో కూడా చల్లగా ఉండాలంటే ఈ గింజలు తినాలి, ఎక్కడ దొరుకుతాయంటే?
ఎండలు మండిపోతున్నాయి. రోజు రోజుకూ ఎండలు దంచికొడుతున్నాయి. ఈ కాలంలో శరీరం ఎక్కువగా డీహైడ్రేట్ అవుతుంది. దీంతో నీరసం, అలసట వంటి సమస్యలు ఏర్పడతాయి. వేసవిలో సరిపడా నీరు, పండ్లు, రసాలు తీసుకోవడం ఎంతో ముఖ్యం. అయితే, ఇవి కాకుండా, పోషకాలు కలిగిన ఆహారం తీసుకోవడం వల్ల కూడా మీరు ఆరోగ్యంగా ఉండగలుగుతారు. వేసవిలో శరీరాన్ని హైడ్రేట్ చేసి, ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు కొన్ని రకాల గింజలు డైట్‌లో చేర్చుకోవడం మంచిది. వాటితో మీరు రోగనిరోధక శక్తిని పెంచుకుని, ఆరోగ్యంగా ఉంటారు. ఆ గింజలు ఏవంటే?
చియా సీడ్స్
చియా సీడ్స్‌ను వేసవిలో తీసుకోవడం వల్ల శరీరం చల్లగా మారుతుంది. ఇందులో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, ఫైబర్, ప్రోటీన్, కాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. బాడీ డీహైడ్రేట్ కాకుండా ఉంచుతాయి. ఈ సీడ్స్‌ను ఓట్స్‌లో కూడా కలిపి తినవచ్చు.

అలసంద గింజలు
అలసంద గింజలు చాలా ఔషధ గుణాలు కలిగి ఉంటాయి. ఈ గింజలను ఆహారంలో చేర్చుకోవడం వల్ల శరీరంలో కొవ్వు తగ్గుతుంది. ఇందులోని కొవ్వు ఆమ్లాలు, ఫైబర్, ప్రోటీన్ శరీరాన్ని డీహైడ్రేట్ కాకుండా కాపాడతాయి. వాటిలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు కూడా అందాన్ని పెంచుతాయి.
పొద్దుతిరుగుడు గింజలు
ఈ గింజలు జింక్ మరియు ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు సమృద్ధిగా కలిగి ఉంటాయి. ఇవి శరీరంలో చలవను పెంచడంతో పాటు నీరసం, అలసట నుంచి తప్పించుకోవడంలో సహాయపడతాయి. ఈ గింజలను సలాడ్‌లో కలిపి లేదా నేరుగా కూడా తీసుకోవచ్చు.
గుమ్మడికాయ గింజలు
గుమ్మడికాయ గింజల్లో ఉన్న పోషకాలు కండరాలను బలపరుస్తాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. వీటిని ఆహారంలో చేర్చడం వల్ల వేసవిలో శరీరానికి శక్తి వస్తుంది. ఈ గింజలను డైట్‌లో చేర్చడం ద్వారా మీరు వేసవిలో ఆరోగ్యంగా ఉంటారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications