Latest Updates
-
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది -
మైదా లేదు, భయం లేదు.. ఇంట్లోనే సులభంగా హెల్దీ బ్రెడ్-రవ్వ పిజ్జా.. -
మీ మొబైల్ ఫోన్లో ఈ వాల్ పేపర్ ఉంటే.. రోజూ అదృష్టం మీ వెంటే.! -
కలలో బొద్దింకలు కనిపిస్తే.. మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా.? -
జేబులో రూ.200 ఉంటే చాలు.. హైదరాబాద్ లో మీ ఫ్రెండ్స్ తో గడిపే సూపర్ ప్లాన్స్ ఇవే! -
చేసిన పనికి గుర్తింపు లేకపోతే ప్రేమ ఎలా తగ్గిపోతుంది -
బరువు తగ్గాలనుకునే వారు మామిడి పండ్లు తినొచ్చా? ఫిట్నెస్ నిపుణులు ఏమంటున్నారంటే!
బీర్ ప్రియులకు గుండె పగిలే వార్త.. ఏంటంటే?
మన దేశంలో మద్యం సేవించే వారి సంఖ్య రోజురోజూకు పెరిగిపోతుంది. మద్యం తాగే వారు ముందుగా బీర్‌ను ఎంపిక చేసుకుంటారు. ఇందులో విస్కీతో పోలిస్తే కొంచెం తక్కువ మొత్తం ఆల్కహాల్ ఉంటుంది. అలాగే తాగడానికి కొంచెం సులువుగా అనిపిస్తుంటుంది. దేశంలో అనేక రకాల బీర్లు అందుబాటులో ఉన్నాయి. ఈ బీర్‌లో 4 శాతం నుంచి 6 శాతం వరకు ఆల్కహాల్ ఉంటుంది. అయితే ఈ బీర్‌ను లిమిట్‌లో తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఇప్పటికే పలువురు ఆరోగ్య నిపుణులు తెలిపారు. అదే శృతిమించి తాగితే అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని చెబుతున్నారు. ఇంతకీ వారానికి ఎన్ని బీర్లు తాగాలి? అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
14 యూనిట్లు మాత్రమే..
నేషనల్ హెల్త్ సర్వీసెస్ ప్రకారం పురుషులు లేదా మహిళలు వారానికి కేవలం 14 యూనిట్ల కంటే ఎక్కువ మద్యం తీసుకోకూడదు. 14 యూనిట్లు లేదా 10 మిల్లి లీటర్లు, లేదా 8 గ్రాముల మధ్య మాత్రమే తీసుకోవాలి. అప్పుడే అనేక ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయి. ఉదాహరణకు ఒక బీర్‌లో 5 శాతం ఆల్కహాల్ ఉంటుంది. అంటే అందులో 3 యూనిట్ల ఆల్కహాల్ ఉంటుంది. అంటే మీరు వారానికి ఆరు బాటిళ్ల సాధారణ బీర్ తాగితే మీరు 14 యూనిట్ల పరిమితిలో ఉంటారు.

అంతకు మించి తాగితే కచ్చితంగా ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒకవేళ ప్రతిరోజూ ఆల్కహాల్ తాగాలనుకునే వారు.. వారంలో కనీసం రెండు రోజులు ఆపేయాలి. ఇలా చేయడం వల్ల ఆల్కహాల్ నుంచి శరీరం కోలుకోవడానికి కొంత సమయం దొరుకుతుంది. అలాగే అనారోగ్య సమస్యల బారిన పడకుండా రక్షించుకోవచ్చు.
గుండె సమస్యలు..
సాధారణంగా బీర్‌లో చిన్న మొత్తంలో విటమిన్లు, యాంటీ యాక్సిడెంట్లు, ఖనిజాలు ఉంటాయి. అవి ఎముకలను దృఢపరుస్తాయి. దీని కారణంగా ఎముకలకు సంబంధించిన వ్యాధులు తగ్గిపోతాయి. అలాగే ఈ బీర్‌లో పాలిఫెనాల్స్ అనే పదార్ధం ఉంటుంది. ఇవి గుండెకు సంబంధించిన సమస్యలు దూరమైపోతాయి. అలాగే ఇతర రోగాలు కూడా నయమవుతాయి. సాధారణంగా రోజుకు ఒక బీరు తాగే మహిళలు, రోజుకు రెండు బీర్లు తాగే పురుషుల్లో గుండె సంబంధిత సమస్యలు రావని ఓ అధ్యయనంలో వెల్లడైంది.
పరిమితులకు మించి..
అధికంగా తాగితే అమృతం కూడా విషంగా మారుతుందన్న సామెత మనందరికి తెలిసిందే. ఇది కూడా అంతే. బీర్ పరిమితులకు మించి తాగితే అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. పరిమితికి మించి బీర్ తాగితే, కాలేయం, గుండె సమస్యలు, కాలేయం పాడైపోవడం వంటి సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. శరీరం డీహైడ్రేటెడ్‌గా మారుతుంది. తలనొప్పి, నోరు పొడిబారడం, నీరసం వంటి సమస్యలు మనిషిని ఆరోగ్యంగా కుంగించేస్తాయి. అందుకే మద్యం తాగకపోవడమే మంచిది. అయితే అలవాటు ఉన్న వారు పరిమితులకు లోబడి, మితంగా తాగితే ఎలాంటి సమస్యలు రావు.
గమనిక: ఈ స్టోరీలో అంశాలు ఇంటర్నెట్‌లో దొరికిన సమాచారం ఆధారంగా.. పాఠకుల అవగాహన కోసం అందించబడింది. తెలుగు బోల్డ్ స్కై దీనిని ధ్రువీకరించడం లేదు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications