Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
రెండు కండోమ్‌లతో రెట్టింపు రక్షణ, విత్‌డ్రాల్ పద్ధతితో ప్రెగ్నెన్సీ రాదు.. ఇవి అపోహలా? నిజాలా?
శృంగారం ఓ మధురమైన అనుభూతి. ఇద్దరు వ్యక్తులు శారీరకంగా, మానసికంగా పెనవేసుకుని, మైమరిచిపోయి ఆస్వాదించే అద్భుతమైన కార్యం. మెత్తని ఒత్తిళ్లలతో అనుభవించాల్సిన శృంగారం కార్యంపై కొంత మందికి కొన్ని రకాల అనుమానాలు, అపోహలు ఉంటాయి. అయితే వాటి గురించి పెద్దగా ఎవరితోనూ పంచుకోం. అందరి జీవితాల్లోనూ శృంగారం ఉన్నప్పటికీ దాని గురించి బయట పెద్దగా మాట్లాడుకోరు. అలా చాలా మంది అపోహలను నిజాలనుకుంటారు, నిజాలను నిర్లక్ష్యం చేస్తుంటారు. అలాంటి కొన్ని అపోహలు, నిజాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. గర్భనిరోధక పిల్ తీసుకుంటే లైంగిక వ్యాధులు రావు!
గర్భనిరోధక పిల్ కేవలం గర్భం రాకుండా మాత్రమే నిరోధిస్తుంది. లైంగికంగా సంక్రమించే వ్యాధులు రాకుండా గర్భనిరోధక పిల్స్ ఏమాత్రం అడ్డుకోలేవు. STI (సెక్సువల్లీ ట్రాన్స్‌మిటెడ్ ఇన్ఫెక్షన్లు) బారిన పడకుండా ఉండాలంటే కండోమ్ లు వాడటమే ఉత్తమమైన మార్గం.
2. విత్‌డ్రాల్ పద్ధతి ద్వారా ప్రెగ్నెన్సీ రాదు!
విత్‌డ్రాల్ పద్ధతిలో సంభోగం చేస్తే ప్రెగ్నెన్సీ రాదు అని చాలా మంది అనుకుంటారు. అయితే ఈ పద్ధతిలో ప్రెగ్నెన్సీ రాదు అని కచ్చితంగా చెప్పడానికి వీల్లేదు. కొన్ని సార్లు వీర్యం వస్తుందన్న ఫీల్ రాకుండానే తక్కువ స్థాయిలో వీర్యం కారిపోవచ్చు. కాబట్టి ఈ పద్ధతిలో ప్రెగ్నెన్సీ రాదని చెప్పలేం.
విత్‌డ్రాల్ పద్ధతి అంటే శృంగారం సమయంలో సంభోగం చేసేటప్పుడు తీవ్రమైన భావోద్వేగ పరిస్థితికి వస్తారు. అప్పుడు వీర్యం పడబోయే ముందు అంగాన్ని యోని నుంచి బయటకు తీస్తారు. అప్పుడు యోనిలోపల పడాల్సిన వీర్యం కాస్త బయట పడిపోతుంది.
3. విత్‌డ్రాల్ పద్ధతిలో లైంగిక వ్యాధులు రావు!
విత్‌డ్రాల్ పద్ధతిలో లైంగిక వ్యాధులు రావని చాలా మంది అనుకుంటారు. కానీ ఈ పద్ధతి ద్వారా సెక్సువల్లీ ట్రాన్స్‌మిటెడ్ ఇన్ఫెక్షన్లు రావనేది పూర్తిగా అబద్ధం. విత్‌డ్రాల్ పద్ధతి వల్ల కూడా హెచ్ఐవీ, హెర్పెస్, సిఫిలిస్, గొనేరియా, క్లామిడియా వంటి రోగాలు రావొచ్చు.
4. 2 కండోమ్‌లతో రెట్టింపు రక్షణ లభిస్తుంది!
రెండు కండోమ్ లు వేసుకుంటే మరింత ఎక్కువ రక్షణ లభిస్తుందని చాలా మంది అనుకుంటారు. కానీ ఇది కేవలం అపోహ మాత్రమే. ఒక కండోమ్ వేసుకోవడమే మంచిది. అలాగే రెండో కండోమ్ లు వేసుకోవడం వల్ల రాపిడి పెరిగి ఒక కండోమ్ చిరిగిపోయే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు వైద్యులు.
5. సంభోగం వల్ల మాత్రమే లైంగిక వ్యాధులు వస్తాయి!
శృంగారంలో జననేంద్రియాలను తాకడం సర్వసాధారణం. అలాగే శృంగారం అంటే సంభోగం ఉండాల్సిందే. సంభోగం చేస్తే లైంగిక వ్యాధులు వస్తాయని లేకపోతే రావని చాలా మంది అనుకుంటారు. కానీ ఓరల్ సెక్స్, జననేంద్రియాలను తాకడం, సెక్స్ టాయ్‌లను శుభ్రం చేసుకోకుండా మార్చుకుంటూ వాడుకోవడం వల్ల కూడా లైంగిక వ్యాధులు ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తాయి.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications