Latest Updates
-
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు! -
అంతర్జాతీయ యోగా దినోత్సవం స్పెషల్.. ఈ యోగాసనాలతో సంతానలేమి సమస్యలకు చెక్.! -
రిలేషన్ షిప్ పై త్రిప్తి డిమ్రి ఆసక్తికర వ్యాఖ్యలు..అది ఉంటే తప్ప వర్కౌట్ కాదంట..! -
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 10 నిమిషాల ఎగ్ కుర్మా..ఎలా చేయాలో చూడండి.. -
మైగ్రేన్‌తో గుండెకి ప్రమాదం.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.! -
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం!
రోజూ షాంపూతో తలస్నానం చేయాలా? వారానికోసారి చేయాలా? ఏది మంచిదో చూడండి
కొన్నేళ్ల క్రితం వరకు తలస్నానం చేయాలంటే కుంకుడుకాయ, శీకాయ,ఉసిరికాయ వంటివి ఉపయోగించేవాళ్లు. అయితే క్రమంగా రకరకాల షాంపూలూ మార్కెట్లోకి వచ్చేస్తాయి. అందరికీ అందుబాటు ధరల్లోనే షాంపులూ లభిస్తుండటంతో క్రమంగా పల్లెటూర్లలోని ప్రజలు కుంకుడుకాయలు పక్కనపెట్టి షాంపూలు వాడటం స్టార్ట్ చేశారు. ప్రతిరోజూ షాంపూతో తలస్నానం చేయడం కొందరికి అలవాటు ఉంటుంది..దీంతో హెయిర్ ఫ్రెష్ గా,శుభ్రంగా ఉంటుందని వాళ్లు నమ్ముతారు. అయితే మరికొందరు వారానికొకసారి షాంపుతో తలస్నానం చేస్తుంటారు..దీనివల్ల జుట్టులోని నేచురల్ ఆయిల్స్ భద్రంగా ఉండి, నెత్తి ఆరోగ్యం బాగుంటుందని చెబుతుంటారు.
వాస్తవానికి జుట్టు సంరక్షణ కోసం..రోజూ తలస్నానం మంచిదా లేక వారానికొకసారి చేయడం మంచిదా? ఏ విధానం మన జుట్టుకి మంచిది? ఎన్నిసార్లు షాంపుతో తలస్నానం చేయాలి అనేది..మీ జుట్టు రకం, మీ లైఫ్ స్టైయిల్, మీ వ్యక్తిగత ఇష్టాయిష్టాలు వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. మీ జుట్టుకి సరైన దినచర్య ఎంచుకోడానికి రోజూ తలస్నానం చేయడం వల్ల కలిగే లాభాలు,నష్టాలు..వారానికొకసారి తలస్నానం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు,నష్టాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

రోజూ షాంపుతో తలస్నానం చేయడం వల్ల లాభాలు
ఫ్రెష్ గా,శుభ్రంగా జుట్టు
ప్రతిరోజూ వ్యాయామం చేసేవాళ్లు, కాలుష్య వాతావరణంలో ఉండేవాళ్లు లేదా తేమతో కూడిన వాతావరణంలో నివసించేవాళ్లు ప్రతిరోజూ తలస్నానం చేయడం మంచిది.
అదనపు ఆయిల్,మురికికి చెక్
మన నెత్తి కుదుళ్ల నుంచి సెబమ్ అనే నేచురల్ ఆయిల్ ఉత్పత్తి అవుతుంది. ఇది జుట్టుు తేమగా ఉంచడానికి సహాయపడుతుంది. అయితే కొన్నిసార్లు ఈ ఆయిల్ ఎక్కువగా ఉత్పత్తి అయ్యి జుట్టు జిడ్డుగా,నిస్తేజంగా కనబుడుతుంది. రోజూ తలస్నానం చేయడం వల్ల ఈ అదనపు ఆయిల్స్ తొలగిపోయి జుట్టు ప్రెష్ గా ఉంటుంది. ముఖ్యంగా జిడ్డుగల జుట్టు ఉన్నోళ్లకి ఇది చాలా ఉపయోగకరం.
చుండ్రు,దురద వంటి సమస్యలకు గుడ్ బై
తరుచుగా తలస్నాం చేయడం వల్ల నెత్తి శుభ్రంగా ఉంటుంది. అధిక ఆయిల్, చెమట పేరుకుపోవడం వల్ల వచ్చే చుండ్రు,దురద, ఫంగల్ ఇన్ఫెక్షన్ల వంటి సమస్యలు తగ్గుతాయి.
సులభమైన స్టైలింగ్
శుభ్రమైన జుట్టును దువ్వుకోవడం, స్టైల్ చేయడం చాలా సులభం. జెల్, మౌస్, స్ప్రే వంటి స్టైలింగ్ ప్రొడక్టులు వాడేవాళ్లకి ఇది మరింత ప్రయోజనంగా ఉంటుంది.
రోజూ తలస్నానం వల్ల వచ్చే నష్టాలు
నేచురల్ ఆయిల్స్ తొలగింపు
ఎక్కువగా షాంపూతో తలస్నానం చేయడం వల్ల జుట్టులోని సహజ ఆయిల్స్ తగ్గిపోతాయి. దీంతో జుట్టు పొడిగా,చిక్కులుగా మారుతుంది. అంతేకాకుండా తేమ లేకపోవడం వలంల జుట్టు దెబ్బతినే ఛాన్స్ కూడా ఉంటది.
జుట్టు బలహీనత
తరుచుగా కడగడవ,ముఖ్యంగా వేడినీళ్లతొ కడగడం వల్ల జుట్టు కుదుళ్లు బలహీనపడతాయి. దీంతో జుట్టు చిట్లడం,విరిగిపోవడం వంటి సమస్యలు వస్తాయి.
సహజ నూనెల తొలగింపు
మరీ ఎక్కువగా షాంపూ చేయడం వల్ల జుట్టులోని సహజ నూనెలు పోతాయి. దీనివల్ల జుట్టు పొడిగా, చిక్కులుగా మారుతుంది, అంతేకాదు తేమ లేకపోవడం వల్ల జుట్టు దెబ్బతినే అవకాశం కూడా ఉంది.
నెత్తికి చికాకు
కొన్ని షాంపూలలో ఉండే కఠినమైన రసాయనాలు, సల్ఫేట్లు నెత్తికి చికాకు కలిగిస్తాయి. దీనివల్ల నెత్తి ఎర్రగా మారడం, పొలుసులు రావడం లేదా కోల్పోయిన తేమను తిరిగి పొందేందుకు మరింత ఆయిల్ ఉత్పత్తి కావడం వంటి సమస్యలు వస్తాయి.
వారానికి ఒకసారి షాంపూ చేస్తే వచ్చే లాభాలు
సహజ తేమ భద్రం
తక్కువసార్లు షాంపూ చేయడం వల్ల జుట్టులోని సహజ నూనెలు కుదుళ్ల నుంచి జుట్టు చివరి వరకు వ్యాపిస్తాయి. ఇది జుట్టును తేమగా ఉంచుతుంది..చిక్కులు పడకుండా చేస్తుంది.
ఆరోగ్యకరమైన బ్యాలెన్స్
తక్కువగా కడగడం వల్ల నెత్తిపై నూనె ఉత్పత్తి సమతుల్యంగా ఉంటుంది. అధిక నూనె ఉత్పత్తి తగ్గి, తరచుగా కడగాల్సిన అవసరం ఉండదు.
కఠిన రసాయనాలకు దూరం
చాలా షాంపూలలో సల్ఫేట్లు, పారాబెన్లు వంటి హానికరమైన రసాయనాలు ఉంటాయి. తక్కువసార్లు షాంపూ చేయడం వల్ల ఈ రసాయనాలకు జుట్టు తక్కువగా గురవుతుంది.
బలమైన,ఆరోగ్యకరమైన జుట్టు
కడగడం వల్ల జుట్టు బలహీనపడుతుంది. కాబట్టి షాంపూ చేసే ఫ్రీక్వెన్సీని తగ్గిస్తే జుట్టు చిట్లడం తగ్గి, బలమైన, ఆరోగ్యకరమైన జుట్టు మీ సొంతమవుతుంది.
వారానికి ఒకసారి షాంపూ చేస్తే వచ్చే నష్టాలు
జిడ్డుగా, అసౌకర్యంగా
జిడ్డుగల జుట్టు ఉన్నోళ్లకి వారంలో ఒకసారి కడగడం వల్ల జుట్టు జిడ్డుగా, బరువుగా అనిపించవచ్చు.
నెత్తిపై పేరుకుపోయే మలినాలు
చెమట, చనిపోయిన చర్మ కణాలు,స్టైలింగ్ ప్రొడక్టుల అవశేషాలు నెత్తిపై పేరుకుపోతాయి. దీనివల్ల నెత్తికి చికాకు, దురద లేదా చుండ్రు వచ్చే అవకాశం ఉంది.
అసహ్యకరమైన వాసనలు
జుట్టు పొగ, ఆహారం లేదా చెమట వంటి వాటి వల్ల వచ్చే వాసనలను గ్రహిస్తుంది. తక్కువసార్లు కడగడం వల్ల జుట్టు ఫ్రెష్ గా ఉండదు.
ఏ రకం జుట్టు ఉన్నోళ్లు ఎన్నాసార్లు షాంపూ చేయాలి
జిడ్డుగల జుట్టు
సహజంగా జిడ్డుగల నెత్తి ఉన్నవారు ప్రతి 1-2 రోజులకు ఒకసారి షాంపూ చేయడం మంచిది. ఇది అధిక జిడ్డును నివారిస్తుంది.
పొడి లేదా కర్లీ జుట్టు
పొడి, కర్లీ లేదా ముతక జుట్టు ఉన్నవారు తేమను నిలుపుకోవడానికి, చిక్కులు తగ్గించడానికి వారానికి ఒకటి లేదా రెండుసార్లు మాత్రమే షాంపూ చేయాలి.
సన్నని జుట్టు
సన్నని జుట్టు త్వరగా జిడ్డుగా మారుతుంది. కాబట్టి రోజూ కడగడం మంచిది.
మందపాటి జుట్టు
మందపాటి జుట్టు తేమను బాగా నిలుపుకోగలదు. కాబట్టి వారానికి ఒకసారి షాంపూ చేయడం సరిపోతుంది. ఒకవేళ మీరు తక్కువసార్లు షాంపూ చేయాలనుకుంటే కానీ మీ జుట్టు తాజాగా ఉండాలని కోరుకుంటే, డ్రై షాంపూ ఒక మంచి ఎంపిక. ఇది జుట్టులోని అదనపు ఆయిల్ ని పీల్చుకుంటుంది, సహజ తేమను తొలగించకుండా జుట్టును ఫ్రెష్ గా ఉంచుతుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications