Latest Updates
-
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.? -
గుడిలో పెట్టే ప్రసాదం రుచితో.. ఈ జన్మాష్టమికి ఇంట్లోనే కమ్మని పంచామృతం చేసుకోండిలా.. -
చుక్క నూనె లేకుండా లంచ్ బాక్స్‌లోకి ఈజీగా చేసెయొచ్చు.. రక్తహీనతని సైతం తరిమికొట్టేస్తుంది.! -
Powerful Krishna Mantras: కృష్ణాష్టమి నాడు ఈ మంత్రాలు జపిస్తే.. మీ కోరికలన్నీ ఇట్టే నెరవేరుతాయి! -
యదా యదా హి ధర్మస్య.. శ్రీకృష్ణుడి స్ఫూర్తితో మీ బంధుమిత్రులకు జన్మాష్టమి శుభాకాంక్షలు చెప్పండిలా! -
బుధ గ్రహ గోచారం: అదృష్టం అంటే వీరిదే.. సెప్టెంబర్ 7 నుంచి ఈ నాలుగు రాశుల వారికి గోల్డెన్ డేస్.!
షాకింగ్ రిపోర్ట్.. మద్యం తాగడం ఇన్ని రకాల క్యాన్సర్లు వస్తాయా ?!
'మద్యం తాగొద్దు ఆరోగ్యానికి హానికరం, ప్రాణాంతకం' ఇలా ఎంత చెప్పినా కొందరు మారరు. సంతోషమొచ్చినా, దుఃఖమొచ్చినా.. మందు కొట్టాల్సిందే. చిన్న పార్టీ నుంచి పెద్ద పెద్ద ఫంక్షన్ల వరకు మందులో మునిగి తేలాల్సిందే. అయితే అలాంటి మందుబాబులకు అమెరికన్ అసోసియేషన్ ఫర్ క్యాన్సర్ రీసెర్చ్ గుండెబద్దలయ్యే వార్త చెప్పింది. మద్యపానం ఎక్కువగా సేవించే వారికి ఆరు రకాల క్యాన్సర్లు వచ్చే అవకాశముందని తమ తాజా నివేదికలో వెల్లడించింది. ఆ క్యాన్సర్ల రకాలు ఏమిటి? ఎంత వరకు ప్రమాదకరమో ఇప్పుడు తెలుసుకుందాం.
రిపోర్ట్ ఏం చెబుతుందంటే:
ప్రపంచంలో నమోదవుతున్న మొత్తం క్యాన్సర్ కేసుల్లో 5% కేసులో మద్యం వల్లే వస్తుందని ఈ రిపోర్టులో తేలింది. అయితే మద్యం అతిగా సేవించడం వల్ల.. నెక్ ,ఈసోఫేగల్ స్కామోస్ సెల్ కర్సినోమా, బ్రెస్ట్ , కొలొరెక్టల్ లివర్, స్టమక్ క్యాన్సర్ వంటి ఆరు రకాల క్యాన్సర్ల బారిన పడే అవకాశముందని అమెరికన్ అసోసియేషన్ ఫర్ క్యాన్సర్ రీసెర్చ్ రచయిత రాజర్షి సేన్‌గుప్తా తన అధ్యయనంలో చెప్పుకొచ్చారు.

ఎవరికి ఎక్కువ ప్రమాదం?:
అడ్డు అదుపు లేకుండా రోజుకు రెండు లేదా మూడు సార్లు మద్యం సేవించే వారిలో అధికంగా ఈ క్యాన్సర్లు వచ్చే అవకాశముందని ఆ రిపోర్టులో తేలింది. రోజుకు మూడు లేదా ఎక్కువ సార్లు మద్యం తాగడం వల్ల కడుపు, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌ల ప్రమాదాన్ని పెంచుతుందని, ప్రొస్టేట్ క్యాన్సర్ కూడా వచ్చే అవకాశముందని ఆ అధ్యయనంలో వెల్లడైంది. అన్ని రకాల మద్యంతో పాటు బీర్లు, ఇతర ఆల్కహాల్ పానీయాలతో ఈ ముప్పు ఉంటుందని చెబుతున్నారు. అందుకే ఆరోగ్యంగా ఉండాలంటే తప్పనిసరిగా మద్యపానానికి దూరంగా ఉండాల్సిందేనని సూచిస్తున్నారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications