Latest Updates
-
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.!
పుట్ట గొడుగుల గురించి ఈ విషయాలు తెలిస్తే షాక్ అవుతారు.. తినే ముందు తెలుసుకుంటే మంచిది!
పుట్ట గొడుగులు తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిదన్న విషయం తెలిసిందే. ఇందులో అనేక పోషకాలు ఉండడంతో అనేక రోగాలను దూరం చేస్తాయనే పేరుంది. అలాగే అనేక వ్యాధుల బారిన పడకుండా మనల్ని రక్షిస్తాయి. మార్కెట్‌లో షిటేక్, బటన్ మష్రూమ్, పోర్టోబెల్లో, రీషి వంటి రకాల పుట్టగొడుగులు దొరుకుతున్నాయి. ఈ విభిన్నమైన రకాల పుట్ట గొడుగుల్లో విభిన్నమైన ప్రయోజనాలు దొరకనున్నాయి. అయితే ఈ పుట్ట గొడుగులు తినడం వల్ల కలిగే కొన్ని ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
రోగ నిరోధక వ్యవస్థను పటిష్టంగా ఉంచుతుంది
పుట్టగొడుగుల్లో యాంటీ యాక్సిడెంట్లు, బీటా-గ్లూకాన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. దీని కారణంగా ఏదైనా వ్యాధిని తట్టుకొని నిలబడే విధంగా రోగ నిరోధక శక్తి పని చేయనుంది. ఇందులో లభించి సెలీనియం అనే శక్తివంతమైన యాంటీ యాక్సిడెంట్.. శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌ను తగ్గిస్తుంది. అలాగే శరీరంలోని మంటను నివారించడంలో సహాయపడుతుంది.

బరువును తగ్గిస్తుంది..
బరువు తగ్గేందుకు ఫైబర్ అనేది ప్రధాన మూలకంగా పని చేస్తుంది. అలాగే తక్కువ కేలరీలు ఉన్న ఆహరం తీసుకుంటే సులువుగా బరువు తగ్గొచ్చు. అయితే ఈ పుట్టగొడుగుల్లో అధిక మొత్తంలో ఫైబర్, చాలా తక్కువ క్యాలరీలు ఉంటాయి. దీని కారణంగా జీర్ణక్రియ సక్రమంగా జరగడంతో పాటు ఆకలిని చాలా సేపు నియంత్రించుకోవచ్చు. క్రమంగా బరువు తగ్గేందుకు కూడా ఇది సహాయపడుతుంది. అలాగే పుట్టగొడుగుల్లో ప్రోటీన్ కంటెంట్ కూడా అధికంగానే ఉంటుంది. ఇది కండరాల బలానికి, వాటి పెరుగుదలకు ఉపయోగపడతాయి.
క్యాన్సర్ నివారణకు..
పుట్టగొడుగుల్లో యాంటీ యాక్సిడెంట్లతో పాటు పాలీశాకరైడ్లు ఉంటాయి. ఇవి శరీరంలో ఉండే క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తుంది. దీని ద్వారా మనం క్యాన్సన్‌ను జయించే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. అలాగే షిటేక్, రీషి వంటి పుట్టగొడుల్లో క్యాన్సర్‌ను అడ్డుకునే పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ మేరకు పలు పరిశోధనల్లో తేలింది కూడా. రొమ్ము, ప్రోస్టేట్, పెద్దప్రేగు క్యాన్సర్ ఉన్నవారు ఈ పొట్టగొడుగులను తినడం ద్వారా మంచి ఫలితాలను పొందొచ్చు.
పుట్టగొడుగులను రోజు వారీగా డైట్‌లో చేర్చుకోవడం వల్ల.. పైన పేర్కొనబడిన ప్రయోజనాలతో పాటు ఇంకా ఎన్నో ప్రయోజనాలు దక్కనున్నాయి. వాటిలో ముఖ్యమైనవి గుండెను ఆరోగ్యంగా ఉంచడంతో పాటు మెదడును చురుగ్గా ఉంచుకోవచ్చు. అలాగే కండరాల బలహీనతను నివారించుకోవచ్చు. అయితే పుట్టగొడుగుల ఎంపిక అనేది చాలా ముఖ్యమైన విషయం. మంచి ప్రయోజనాలు ఉన్న పుట్టగొడుగులు ఎంచుకుంటేనే మంచి ఫలితాలను పొందగలం.
గమనిక: ఈ కథనంలో మేము పొందుపరిచిన విషయాలన్నీ కేవలం అవగాహన కోసమే. పలు పరిశోధనలు, ఇంటర్నెట్‌లో మాకు దొరికిన సమాచారం ఆధారంగా వాటిని అందించబడింది. ఇందులో పేర్కొనబడిన విషయాలను పాటించే ముందు తప్పనిసరిగా నిపుణుల సలహాలు తీసుకుంటే మంచిది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications