Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
కృత్రిమ స్వీటెనర్లు వాడుతున్నారా? ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్.. అవేంటంటే?
చక్కెరలో కంటే ఆర్టిఫీషియల్ స్వీటెనర్లలో తక్కువ కేలరీలు ఉంటాయి. అలా వీటి వాడకం చాలా పెరిగింది. డయాబెటిస్ ఉన్న వారు, బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్న వారు కేలరీలు తక్కువగా ఉండే ఈ ఆర్టిఫీషియల్ స్వీటెనర్లను ఎక్కువగా ఉపయోగిస్తారు. వీటిని చక్కెరకు ప్రత్యామ్నాయంగా చూస్తారు.e
అయితే ఆ కృత్రిమ స్వీటెనర్లతో కొన్ని దుష్ప్రభావాలు ఉన్నట్లు పలు అధ్యయనాల్లో వెల్లడైంది. వాటి వాడకం వల్ల కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నట్లు తేలింది. ఆర్టిఫీషియల్ స్వీటెనర్లు తినడం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

జీవక్రియకు అంతరాయం:
ఆర్టిఫీషియల్ స్వీటెనర్లతో జీవక్రియ సమస్యలు వస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించే శరీర సామర్థ్యానికి అవి అంతరాయం కలిగిస్తాయని, గ్లూకౌజ్ ఇంటోలెరెన్స్, ఇన్సులిన్ రెసిస్టెన్స్‌కు దారితీస్తుందని పరిశోధలు స్పష్టం చేస్తున్నాయి. టైప్-2 డయాబెటిస్ వంటి జీవక్రియ రుగ్మతలను అభివృద్ధి చేస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి.
బరువు నిర్వహణలో సవాళ్లు:
చక్కెరకు ఈ కృత్రిమ స్వీటెనర్లు ప్రత్యామ్నాయంగా చూసినప్పటికీ, ఆర్టిఫీషియల్ స్వీటెనర్లతో బరువును తగ్గించుకోవాలని చూస్తే కొంత భంగపాటు తప్పదు. చక్కెరలో కంటే ఈ కృత్రిమ స్వీటెనర్లలో కేలరీలు తక్కువ ఉంటాయని చెబుతున్నా.. వాటి వల్ల కూడా బరువు పెరిగే అవకాశం ఉండటం గమనార్హం. ఈ ఆర్టిఫీషియల్ స్వీటెనర్లకు అలవాటు పడితే చక్కెర ఆహారాలు తినాలన్న కోరిక పెరుగుతుంది. దీని వల్ల అతిగా తినేస్తుంటారు.
జీర్ణ సమస్యలు:
కృత్రిమ స్వీటెనర్లను తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థపై ప్రభావం పడుతుంది. కొంతమంది ఉబ్బరం, గ్యాస్, డయేరియా వంటి జీర్ణశయాంతర సమస్యలను ఎదుర్కొంటారు. ఈ స్వీటెనర్లు గట్ మైక్రోబయోటాను కూడా మార్చగలదు. ఇది ఆరోగ్యకరమైన జీర్ణ వ్యవస్థను నిర్వహించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
కార్డియోవాస్కులర్ వ్యాధి ప్రమాదం పెరుగుతుంది:
కృత్రిమ స్వీటెనర్ల వాడకం పెరిగితే గుండె సంబంధిత సమస్యలు వస్తున్నట్లు ఇటీవలి అధ్యయనాలు సూచిస్తున్నారు. రక్తపోటు అధికం కావడం, గుండె జబ్బులు, స్ట్రోక్ వంటి సమస్యలు తలెత్తవచ్చు.
మానసన ప్రభావం:
కృత్రిమ స్వీటెనర్లు ఆహార వినియోగానికి సంబంధించిన మానసిక అంశాలను ప్రభావితం చేస్తుంది. తీపి పదార్థాలు తినాలన్న కోరిక కలిగేలా చేస్తుంది. దీని వల్ల మరింతగా తీపి పదార్థాలు తినాలనిపిస్తుంది.
కృత్రిమ స్వీటెనర్లు చక్కెరకు ప్రత్యామ్నాయంగా చూస్తున్నప్పటికీ.. ఆర్టిఫీషియల్ స్వీటెనర్లు వాడటం వల్ల ఆరోగ్య దుష్ప్రభావాలు లేకపోలేదు. జీవక్రియ, జీర్ణక్రియ, గుండె, నాడీ, మానసిక సమస్యలను తెచ్చిపెడుతుంది. కృత్రిమ స్వీటెనర్లను తక్కువ మొత్తంలోనే తీసుకోవాలి. హద్దుల్లోనే తింటే వీటి వల్ల పెద్దగా దుష్ప్రభావాలు ఉండవు. అతి ఎందులోనూ మంచిది కాదు. దాని వల్ల చాలా రకాలుగా ఇబ్బంది పడాల్సి వస్తుంది.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications