Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
రోజూ చెవుల్లో కాటన్ బడ్స్ పెట్టి గెలికేస్తున్నారా.. అయితే మీరు ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే!
చాలా మంది ప్రతిరోజూ చెవుల్లో కాటన్ బడ్స్ పెట్టి క్లీన్ చేసుకుంటూ ఉంటారు. స్నానం చేయగానే వచ్చి చెవుల్లో ఉన్న తడితో పాటు చెవిలో ఏర్పడే గులిమిని బయటకు తీసే ప్రయత్నం చేస్తుంటారు. అయితే చాలా హానికరమైనదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. చెవుల్లో కాటపన్ బడ్స్ పెట్టి శుభ్రం చేసుకోవడం వల్ల శాశ్వతంగా వినికిడి శక్తి కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉందని హెచ్చరిస్తున్నారు.
కాటన్ బడ్స్ వాడడం వల్ల వచ్చే సమస్యలు:
కాటన్ బడ్స్ తరచుగా ఉపయోగించడం వల్ల గులిమి బయటకు రాకుండా మరింత లోపలికి వెళ్తుంది. జిగటగా మొత్తగా ఉండే ఈ పదార్థం గట్టిగా మారిపోయి అడ్డంకిగా మారవచ్చు. దీని వల్ల వినికిడి లోపం లేదంటే శాశ్వతంగా వనిపించకపోవడం వంటి సమస్యలు తలెత్తే అవకాశం అధికంగా ఉంటుంది. ఈ గులిమి వల్లే చెవిపోటు, విపరీతమైన నొప్పి, ఇన్ఫెక్షన్ వస్తుంది. సున్నితమైన ఈ ప్రాంతంలో గట్టి వస్తువులు పెట్టడం వల్ల రక్తస్రావం కూడా జరిగే ఛాన్స్ ఉంది. అంతేకాదండోయ్ అంతర్గత గాయాలు కూడా అవుతుంటాయి.

గులిమి చెత్త కాదు.. చాలా మంచిది!:
గులిమి తీసేసి చెవులు శుభ్రం చేసుకోవాలని చాలా మంది అనుకుంటారు. కానీ దాన్ని వల్ల చాలా మంచి జరుగుతుంది. దుమ్ము, బ్యాక్టీరియా, ఇతర సూక్ష్మక్రిములు, చిన్న వస్తువులు లోపలికి పోకుండా ఉండేందుకు ఈ గులిమి ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే స్నానం చేసేటప్పుడు నీళ్లు లోపలికి పోకుండా గోడలా రక్షిస్తుంది. అందుకే చెవిలో ఉండే వ్యాక్స్ వదిలించుకోవాల్సిన అవరం లేదని నిపుణులు సూచిస్తున్నారు. ఇయర్ వాక్స్ దాన్ని అదే సహజంగా శుభ్రం చేసుకుంటుంది. సో మనం ఏమీ చేయాల్సిన అవసరం లేదు.
ఇలా శుభ్రం చేసుకోవడం మేలు..!
చెవిలో దురదగా ఉన్నట్లు అనిపించి చెవులు క్లీన్ చేసుకోవాలనిపిస్తే తడి లేదా వెచ్చని వస్త్రంతో తుడుచుకోవడం మంచిది. అలాగే చెవులను క్లీన్ చేసేందుకు మార్కెట్లో ఓవర్ ది కౌంటర్ క్లీనింగ్ డ్రాప్స్ అందుబాటులో ఉంటాయి. సహజమైన ఉత్పత్తులతో వీటిని తయారు చేస్తారు. వీటిని చెవులో వేసుకుంటే చాలు క్లీన్ అయిపోతాయి. అలాగే బల్బ్ సిరంజ్ ద్వారా చెవిలోకి నీటిని పంపి కూడా చెవులను శుభ్రం చేసుకోవచ్చు. లేదంటే నేరుగా వైద్యులను సంప్రదించడం మరింత మంచిది.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications