Latest Updates
-
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.!
రోడ్ సైడ్ టిఫిన్ తింటున్నారా.. అయితే మీ ప్రాణాలు ఇక పోయినట్లే.. ఎందుకంటే?
ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఇంట్లోనే టిఫిన్ చేసుకునే తినే సమయం కూడా ఎవరికీ దొరకడం లేదు. పొద్దున్న లేవగానే టిఫిన్ సెంటర్‌కు వెళ్లడం బోండా, పూరి, దోశ అంటూ ఆయిల్ ఫుడ్ తింటూ ఉంటాము. అలాగే సాయంత్రం స్నాక్ వంటి ఆయిల్ ఫుడ్ తింటూ ఉంటాము. ఇలా తినడం అనేది ఆరోగ్యానికి ప్రమాదకరమని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. వీటిపై అధికంగా ఆధారపడే వ్యక్తులు వెంటనే అలెర్ట్ అవ్వాలని లేకపోతే మూల్యం చెల్లించక తప్పదని చెబుతున్నారు. ఎందుకంటే..
రోడ్ సైడ్ టిఫిన్ ఎందుకు చేయకూడదంటే?
నేటి కల్తీ ప్రపంచంలో ప్రతీది కల్తీ అవుతుంది. అందులో నూనె కూడా ఎక్కువగానే కల్తీగా వస్తుంది. పైగా తక్కువ ధరకే నూనె లభిస్తుందని ఈ టిఫిన్ సెంటర్ నడిపించే వ్యక్తులు క్వాలిటీ లేని, కల్తీ నూనె తీసుకొస్తున్నారు. అలాంటి కల్తీ నూనెలో నాలుగైదు సార్లు నూనెను మరిగించడం, అందులోనే టిఫిన్ వండడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందట.

ఇందులో ప్రమాదకరమైన క్యాన్సర్ కారకాలు ఉంటాయని అవి తినడం వల్ల క్యాన్సర్ ఖాయమని పేర్కొంటున్నారు. కాబట్టి వీలైనంతవరకు బయటి ఆయిల్ ఫుడ్‌ను తినకపోవడమే మంచిది.
FSSAI నిబంధనలు ఏం చెబుతున్నాయంటే?
ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా.. ప్రకారం నూనెను ఎక్కువసార్లు వినియోగించడం వల్ల ఎక్కువగా అనారోగ్య సమస్యలు వస్తాయి. ఒక నూనెను ఎక్కువ సార్లు మరిగించడం వల్ల అందులోని టిటోలర్ పోలార్ కంపౌండ్స్(TPC) ఫ్రీరాడికల్స్‌లాగా మారుతాయి. సాధారణంగా నూనెలో 25% మాత్రమే ఈ ఫ్రీ రాడికల్స్ ఉండాలి. కానీ వాటిని ఎక్కువసార్లు మరిగించడం వల్ల అందులో ఫ్రీరాడికల్స్ శాతం 25% కి మించి ఉంటుంది. దాదాపు అన్ని హోటళ్లలో ఇదే పరిస్థితి నెలకొంది.
ఇలాంటి ఫుడ్ తినడం వల్ల కేవలం క్యాన్సర్ సమస్యలు మాత్రమే కాదు, గుండె సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. పైగా పలు వ్యాధులు కూడా ఉద్భవించే సూచనలు కనిపిస్తున్నాయి. అందుకే వీలైనంతవరకు రోడ్ సైడ్ దొరికే కొన్ని ఆహారాలను తినకపోవడమే మంచిది. అలాంటప్పుడే మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుంది.
ఆరోగ్య సమస్యలను ఆహ్వానించినట్లే..
ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా నిబంధనలు మాత్రమే కాదు, వైద్య నిపుణులు కూడా రోడ్ సైడ్ ఆహరం తినకూడదని సూచిస్తున్నారు. మరీ ముఖ్యంగా నూనెను నాలుగైదుసార్లు వేడి చేసి, అందులో సిద్ధం చేసిన కల్తీ ఆహరం తినడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు పుట్టుకొస్తాయట. వాటిలో రక్తనానాలు గడ్డకట్టుకుపోవడం, అల్జీమర్స్, కాలేయ, హృదయ సంబంధిత రోగాలు, స్థూలకాయం, హైపర్ టెన్షన్, కొవ్వు పెరిగిపోవడం వంటి సమస్యలు వస్తాయట.
రోడ్ సైడ్ దొరికే కొన్ని ఆహారాలు మాత్రమే కాదు, పలు ప్రముఖ హోటళ్లలో లభించే ఆహారంలో కూడా ఇలాంటి సమస్యలు ఉంటాయంటున్నారు. నూనెను డీప్ ఫ్రై చేసి మరీ దానినే వినియోగించడం, అలాగే పలు ఆహారాన్ని డీప్ ఫ్రై చేయడం వంటివి వల్ల ఈ సమస్యలు వస్తాయని చెబుతున్నారు. అందుకే నూనెలో దొరికే ఆహరం విషయంలో కొంత జాగ్రత్త తీసుకుంటే చాలా మంచిది.
గమనిక: ఈ కథనంలో మేము పొందుపరిచిన అంశాలు పలు అధ్యయనాలు, ఇంటర్నెట్‌లో మాకు దొరికిన సమాచారం ఆధారంగా అందించబడింది. వీటి శాస్త్రీయతను మేము నిర్ధారించడం లేదు. వీటిని పాటించే ముందు తప్పనిసరిగా నిపుణుల సలహాలు తీసుకుంటే మంచిది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications