Latest Updates
-
బ్రేకప్ అయినా జ్ఞాపకాలతో తీరని వేదన.. మాజీ లవర్‌ను మరిచిపోవడం ఎలా.? -
ప్రొటీన్స్, ఫైబర్ గని..మీ పొట్టను కరిగించే గ్రీన్ దోశ..ఎలా చేసుకోవాలంటే -
ఎదిగే పిల్లల కోసం చింతాకు పప్పు.. రాయలసీమ స్టైల్లో ఇలా చేస్తే వావ్ అవ్వాల్సిందే.! -
ఈ ఆయిల్‌తో మసాజ్ చేస్తే నెల రోజుల్లోనే చిక్కటి కనుబొమ్మలు మీ సొంతం.! -
ఫ్యాట్ తక్కువ, ఎనర్జీ ఎక్కువ.. గుంటూరు స్పెషల్ వంకాయ ఇగురు పప్పు.! -
ఎండలో ఫేస్ ట్యాన్ అవుతుందా?.. ఈ నాలుగు పప్పులతో మెరిసే చర్మం మీ సొంతం.! -
శని గ్రహంశాపమా, వరమా? -
ఎలాంటి సాస్‌లు లేకుండా గోబీ 65.. ఇలా చేస్తే ఇక స్ట్రీట్ ఫుడ్ జోలికే వెళ్లరు.! -
చిన్న అబద్ధాలు నమ్మకాన్ని ఎలా నెమ్మదిగా కూల్చేస్తున్నాయి -
రామ్ చరణ్ ఫేవరెట్ ఇదే..చేపల పులుసు ఇలా చేస్తే తిరుగులేని టేస్ట్!
సైలైంట్ హార్ట్ ఎటాక్..నొప్పి లేకుండానే చంపేస్తది..మీ గుండె భద్రమో కాదో ఇలా తెలుసుకోండి
ఈ మధ్య కాలంలో గుండెపోటుతో చనిపోతున్న వాళ్ల గురించి తరుచుగా వింటున్నాం. జస్ట్ కొద్దిసేపటి క్రితం దాకా హ్యాపీగా ఉన్నోళ్లు సడెన్ గా గుండెపోటు వచ్చి చనిపోయారు అని విని మన గుండె జారిపోతుంది. సాధారణంగా గుండె జబ్బులు తరచుగా తీవ్రమైన ఛాతీ నొప్పి, అసౌకర్యంతో మనల్ని హెచ్చరిస్తాయి. కానీ కొన్నిసార్లు గుండెపోటు ఎటువంటి స్పష్టమైన సంకేతాలు లేకుండా నిశ్శబ్దంగా సంభవిస్తుంది. దీన్నే మనం సైలెంట్ హార్ట్ ఎటాక్ అని పిలుస్తాం.. తీవ్రమైన నొప్పి లేదా అసౌకర్యం ఉండకపోవడంతో చాలా మంది దీన్ని సాధారణ అలసట, గ్యాస్ లేదా బలహీనతగా పొరబడతారు.
అయితే ఇది నిశ్శబ్దంగా మన గుండెను దెబ్బతీసి ప్రాణాంతకంగా కూడా మారవచ్చు. ఇటీవలే రాజస్థాన్ మంత్రి గజేంద్ర సింగ్ భార్య ప్రీతి కుమారి మరణానికి సైలెంట్ హార్ట్ ఎటాకే కారణమని చెబుతున్నారు. ఈ తీవ్రమైన వ్యాధి లక్షణాలు, కారణాలు,నివారణ మార్గాలను వివరంగా తెలుసుకుందాం.

సైలెంట్ హార్ట్ ఎటాక్ అంటే ఏంటీ?
సైలెంట్ హార్ట్ ఎటాక్ అంటే..ఎలాంటి స్పష్టమైన లక్షణాలు లేకుండా సంభవించే గుండెపోటు. సాధారణ గుండెపోటులో కనిపించే ఛాతీ నొప్పి, భయాందోళన, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు ఇందులో ఉండవు. ఒక్కోసారి ఇది పేషెంట్ ఇతర ఆరోగ్య సమస్యల కోసం పరీక్షలు చేయించుకున్నప్పుడు మాత్రమే తెలుస్తుంది. సాధారణ గుండెపోటు ఎంత ప్రమాదకరమో, సైలెంట్ హార్ట్ ఎటాక్ కూడా అంతే ప్రమాదకరమైనది.
సైలెంట్ హార్ట్ ఎటాక్ లక్షణాలు
హార్ట్ ఫౌండేషన్ ప్రకారం.. సైలెంట్ హార్ట్ ఎటాక్ లక్షణాలు చాలా సూక్ష్మంగా ఉంటాయి, అందువల్లే ప్రజలు తరచుగా వాటిని విస్మరిస్తారు. ఈ లక్షణాలు కొన్నిసార్లు గ్యాస్ లేదా అసిడిటీతో కూడా పొరబడవచ్చు.

ప్రధాన లక్షణాలు
అకస్మాత్తుగా అలసిపోవడం,శ్రమ లేకుండా చెమటలు పట్టడం, తరచుగా తలతిరుగుతున్నట్లు అనిపించడం, చిన్నపాటి పనులు చేసినా లేదా విశ్రాంతిగా ఉన్నా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, మెడ, వీపు, దవడ లేదా కడుపులో తేలికపాటి నొప్పి. ఈ లక్షణాలు పదే పదే కనిపిస్తే వాటిని అస్సలు తేలికగా తీసుకోకండి. వెంటనే హాస్పిటల్ కి వెళ్లి చెక్ చేయించుకోవాలి.
ఏ వ్యక్తులు ఎక్కువ ప్రమాదంలో ఉన్నారు?
ఇప్పటికే ఏదో ఒక ఆరోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి సైలెంట్ హార్ట్ ఎటాక్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. డయాబెటిస్ ఉన్నవారికి నరాల దెబ్బతినడం వల్ల నొప్పిని తక్కువగా గ్రహిస్తారు. అందువల్ల గుండెపోటు నొప్పి వారికి అంతగా తెలియకపోవచ్చు..ఇది సైలెంట్ హార్ట్ ఎటాక్‌కు దారితీస్తుంది. వృద్ధులలో కూడా గుండెపోటు లక్షణాలు తక్కువగా కనిపించవచ్చు. అధిక రక్తపోటు గుండెపై తీవ్ర ప్రభావం చూపుతుంది. రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువగా ఉండటం గుండె ధమనులలో అడ్డుపడటానికి కారణమవుతుంది. అధిక బరువు గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. ధూమపానం గుండెకు తీవ్రమైన హానిని కలిగిస్తుంది. దీర్ఘకాలిక ఒత్తిడి,క్రమం తప్పకుండా వ్యాయామం చేయని, సరైన ఆహారం తీసుకోని వారికి ఈ వ్యాధి వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
సైలెంట్ హార్ట్ ఎటాక్‌ను ఎలా నివారించవచ్చు?
ఈ ప్రమాదకరమైన వ్యాధిని నివారించడానికి అత్యంత ముఖ్యమైన విషయం అవగాహన, అప్రమత్తత. సంవత్సరానికి ఒకసారి మీ ECG, రక్తంలో చక్కెర, కొలెస్ట్రాల్ ను తప్పకుండా తనిఖీ చేయించుకోండి. సమతుల్యమైన, తక్కువ కొవ్వు, తక్కువ సోడియం కలిగిన ఆహారాన్ని తీసుకోండి. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు ఎక్కువగా తీసుకోండి. ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలు నడవండి లేదా ఏదైనా శారీరక శ్రమ చేయండి. యోగా, ధ్యానం చేయండి. రోజుకు 7-8 గంటలు నాణ్యమైన నిద్ర చాలా అవసరం. ధూమపానం, అధిక మద్యపానం గుండెకు హానికరం. ఈ నివారణ చర్యలను పాటించడం ద్వారా మన గుండెను రక్షించుకోవచ్చు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications