Latest Updates
-
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.!
విపరీతమైన త్రేన్పులు ఇబ్బంది పెడుతున్నాయా? ఈ చిట్కాలు మీకోసమే
త్రేన్పులు.. చాలా మందిని ఇబ్బంది పెట్టే సమస్య. ఏదైనా తాగినప్పుడు, తిన్నప్పుడు వెంటనే త్రేన్పులు పెద్ద శబ్దంతో వస్తుంటే పక్కన ఉన్న వారికి ఇబ్బందిగా అనిపిస్తుంది. చాలా మందిలో ఇది చాలా సాధారణంగా, సహజంగా జరిగే ప్రక్రియ. ఇబ్బంది పెట్టనంత వరకు దీంతో ఎలాంటి సమస్య లేదు. పెద్ద శబ్దంతో వచ్చినప్పుడు ఎదుటివారు ఏమనుకుంటారోనని వీరు అనుకుంటూ ఇబ్బంది పడిపోతుంటారు.
సాధారణంగా నోటితో గాలిని పీల్చుకోవడం, ఆహారం జీర్ణమయ్యే సందర్భాల్లో కడుపులో గ్యాస్ పేరుకుపోతుంది. ఇది బయటకు రావడానికి ప్రయత్నించడంతోనే త్రేన్పులు వస్తుంటాయి. ఈ గ్యాస్ కొన్ని సార్లు జీర్ణాశయం, పేగుల్లోనే ఉండిపోయి కడుపు ఉబ్బరంగా అనిపిస్తుంది. తరచుగా త్రేన్పులు, ఆవలింతలతో చికాకు కలిగిస్తుంది.

త్రేన్పులు ఇబ్బంది పెట్టవద్దంటే ఏం చేయాలంటే?
1. కార్బొనేటెడ్ డ్రింక్స్ తాగొద్దు:
సోడా, స్పార్క్‌లింగ్ వాటర్ వంటి కార్బొనేటెడ్ డ్రింక్స్‌లో కార్బన్ డయాక్సైడ్ ఉంటుంది. ఇది త్రేన్పులకు కారణం అవుతుంది. అందుకే కార్బొనేటెడ్ డ్రింక్స్ బదులు మంచినీళ్లు తాగడం మంచిది. లేదంటే కార్బొనేటెడ్ డ్రింక్స్ ను నెమ్మదిగా, తక్కువ మొత్తంలో తాగినా త్రేన్పులు అంతగా ఇబ్బంది పెట్టవు.
2. నెమ్మదిగా తినాలి, తాగాలి:
త్వరత్వరగా తింటున్నప్పుడు, తాగుతున్నప్పుడు గాలిని లోపలికి వెళ్లే అవకాశం ఉంటుంది. ఇది త్రేన్పులకు కారణం అవుతుంది. గాలి కడుపు లోపలికి వెళ్లకూడదంటే నెమ్మదిగా తినడం మంచి మార్గం. అలాగే నోరు మూసుకుని నమలడం అలవాటు చేసుకోవాలి. ఆహారాన్ని బాగా నమిలి మింగాలి. ఇలా చేయడం ద్వారా జీర్ణక్రియ సజావుగా సాగడంతో పాటు గాలి లోపలికి వెళ్లే అవకాశాన్ని తగ్గిస్తుంది.
3. త్రేన్పులకు కారణమయ్యే పదార్థాలు తినొద్దు:
కొన్ని ఆహారాలు తింటే జీర్ణవ్యవస్థలో గ్యాస్ ఉత్పత్తి అవుతుంది. దీని వల్ల త్రేన్పులు వస్తయి. బీన్స్, కాయధాన్యాలు, క్యాబేజీ, ఉల్లిపాయలు సహా మరికొన్ని గ్యాస్ ను ఉత్పత్తి చేస్తాయి. ఇలాంటి ఆహార పదార్థాలను పరిమితంగా తినడం మంచిది. అలాగే బీన్స్ సహా ఇతర కాయధాన్యాలను ఉడికించే ముందు నీటిలో నానబెట్టాలి.
4. తినేటప్పుడు సరిగ్గా కూర్చోవాలి:
తినేటప్పుడు కూర్చునే విధానం వల్ల కూడా గాలి కడుపులోపలికి వెళ్లే అవకాశాలు పెరుగుతాయి. నిల్చొని తింటుంటే వెన్నును నిటారుగా ఉంచాలి. కూర్చున్న సమయంలో కూడా వెన్ను ను నిటారుంగా ఉండేలా కూర్చోవాలి. ఇలా కూర్చొని తినడం వల్ల కడుపుపై ఒత్తిడి, ఉబ్బరం వచ్చే అవకాశం ఉండదు.
5. అతిగా తినొద్దు:
పొట్ట నిండుగా తింటే అజీర్ణం, ఉబ్బరం, గ్యాస్ సమస్యలు వేధిస్తాయి. జీర్ణాశయంలో జీర్ణ రసాలు విడుదలై ఆహారాన్ని జీర్ణం చేయడానికి కావాల్సినంత స్థలం ఉండేలా చూసుకోవాలి. అతిగా తినొద్దు. కొద్ది కొద్దిగా రోజులో ఎక్కువ సార్లు తినడం మంచిది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications