Latest Updates
-
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు! -
కరలాడే టమాటా మురుకులు.. ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు!
మీ రెండో గుండె పదిలమేనా? ఎక్కువ సేపు కూర్చొని పనిచేసేటోళ్లకు డాక్టర్ హెచ్చరిక!
గుండె ఆరోగ్యం కోసం మనం రకరకాల జాగ్రత్తలు తీసుకుంటాం. ఆహారం, వ్యాయామం ఇలా అన్ని విషయాల్లో చాలా కేరింగ్ తీసుకుంటాం. అయితే మన శరీరంలో ఉండే రెండో గుండె గురించి కూడా మీరు ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నారా? గుండె ఒక్కటే కదా, రెండో గుండె ఎక్కడ ఉంటుంది అని మీరు ఆశ్చర్యపోతున్నారా? కానీ మన శరీరంలో రెండో గుండెలా పనిచేసే ఒక ముఖ్యమైన అవయవం ఉంది. అదే కాఫ్ మజిల్స్ (Calf Muscles) అంటే పిక్క కండరాలు. ఇవి కేవలం నడవడానికి, పరుగెత్తడానికి మాత్రమే ఉపయోగపడవు, శరీరంలో రక్త ప్రసరణకు ఇవి చాలా కీలకం.
మీ శరీరంలో రెండో గుండె పని ఇదే
శరీరంలో రక్తప్రసరణ జరగడానికి గుండె ఒక్కటే పంపింగ్ చేస్తుందని అందరూ అనుకుంటారు. కానీ మన బాడీలో మరో గుండె కూడా ఉంటుంది. అయితే అది ఛెస్ట్ లో ఉండదు..మీ కాళ్ల కండరాల్లో ఉంటుందని సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, పల్స్ హార్ట్ సెంటర్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ముఖర్జీ మదివాడ ఓ వీడియోలో తెలిపారు. గుండె ఎలాగైతే రక్తాన్ని శరీరమంతా పంప్ చేస్తుందో ఈ పిక్క కండరాలు కూడా కాళ్ల నుంచి గుండెకు రక్తాన్ని తిరిగి పంప్ చేయడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. అందుకే వీటిని రెండో గుండె అని పిలుస్తారు.

గుండె పంప్ చేయడం వల్ల రక్తం కాళ్లకు వెళ్తుంది..అయితే మనం నిలబడినప్పుడు కింద కాళ్ల దగ్గర నుంచి రక్తం గుండె దగ్గరకు ఎలా వస్తుంది? కింద కండరాలు సంకోచించిన ప్రతిసారి అక్కడి నుంచి కొంచెం కొంచెం రక్తం పైకి వస్తూ ఉంటుంది. అలా పైకి వచ్చే రక్తం మళ్లీ గుండెకు చేరుతుంది. అయితే ఆ కండరాలు సంకోచించకపోతే రక్తం మన గుండెకు చేరదు. అందుకే కాళ్లను రెండో గుండె లేదా సెకండ్ హార్ట్ అని పిలుస్తారు.
మీరు గంటల తరబడి డెస్క్ జాబ్ చేస్తున్నా, సినిమా చూస్తున్నా లేదా విమానంలో లేదా కార్లో ఎక్కువ సేపు కూర్చున్నా లేదా ఏదైనా సర్జరీ అయ్యి ఎక్కువ సేపు పడుకొని ఉన్నారంటే ఆ పంప్ పనిచేయదు. దీంతో రక్తం అక్కడే ఉండిపోతుంది. ఫలితంగా రక్తం ఉన్నచోటనే గడ్డకడుతుంది. కాళ్లలో రక్తం గడ్డకట్టడాన్ని మెడికల్ బాషలో డీప్ వెయిన్ థ్రంబోసిస్ అని అంటారు. ఇక్కడ రక్తం గడ్డకట్టిందంటే అక్కడే ఉంటే ఫర్వాలేదు కానీ అది చిన్నగా బ్రేక్ అయ్యి లంగ్ప్ కి చేరిందంటే దానిని పల్మొనరీ ఎంబాలిజం అంటారు.ఇది చాలా చాలా ప్రమాదరకర పరిస్థితి అని డాక్టర్ ముఖర్జీ చెప్పారు. మనదేశంలో ప్రతి ఏటా దాదాపు 2.5 లక్షల మందికి పల్మొనరీ ఎంబాలిజం అనే జబ్బు వస్తుందని అంచనా.
ఎవరు జాగ్రత్తగా ఉండాలి
40 ఏళ్లు పైబడి ఉన్నోళ్లకి, అధిక బరువు ఉన్నోళ్లకి, ఇటీవల సర్జరీ అయినోళ్లకి రిస్క్ ఎక్కువగా ఉంటుందని డాక్టర్ ముఖర్జీ చెప్పారు. అలాగే, గర్భిణీ స్త్రీలకు, హర్మోన్ ట్రీట్మెంట్ తీసుకున్నోళ్లకు, మీ కుటుంబంలో గతంలో ఎవరికైనా అలాంటి చరిత్ర ఉంటే మీకు కూడా దీని ప్రమాదం ఎక్కవుగా ఉంటుందని ఆయన తెలిపారు. కాళ్లకు ఫ్రాక్చర్స్ అయితే వాళ్లు యువకులు అయినా కూడా రిస్క్ ఎక్కవగా ఉంటుందని ఆయన సృష్టం చేశారు.
ఏం చేయాలి
ఎక్కువసేపు కూర్చొనే ప్రతి వాళ్లకి ఈ ప్రమాదం ఎక్కువగా ఉంటది కాబట్టి మనం కదులుతూనే ఉండాలి అని డాక్టర్ ముఖర్జీ చెబుతున్నారు. ఫ్లైట్ లో జర్నీ చేస్తున్నా కూడా మధ్యలో లేచి వాష్ రూమ్ దాకా నడవడం లేదా ఒక నిమిషం అటూ ఇటూ తిరగం అయినా చేయాలని..అదే సమయంలో డెస్క్ ఉద్యోగాలు చేసేటోళ్లు పెడల్ ని నొక్కినట్లు మోకాళ్లను బ్రేక్ తొక్కినట్లుగా నొక్కుతూ ఉండాలన్నారు. కాళ్లను ఎప్పుడూ మూవ్ చేస్తూ ఉంచాలని సూచించారు. లేకుంటే కామ్ గా లాగే ఉంచారంటే రక్తం గడ్డలు కడుతుందని చెప్పారు. కాబట్టి గుండె ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకునేటప్పుడు కాళ్లలో ఉండే మీ రెండో గుండె గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉందని డాక్టర్ ముఖర్జీ తెలిపారు.

పిక్క కండరాల ఆరోగ్యం కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు
-రోజూ కనీసం 30 నిమిషాలు నడవడం, జాగింగ్ చేయడం లేదా సైక్లింగ్ చేయడం వంటివి అలవాటు చేసుకోండి. ఇవి రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి.
-నడక లేదా జాగింగ్ తర్వాత పిక్క కండరాలను సాగదీయడం చాలా అవసరం. నిలబడి గోడకు చేతులు ఆనించి, ఒక కాలు వెనుకకు చాపి స్ట్రెచ్ చేయండి. ఇలా చేయడం వల్ల కండరాలు బిగుసుకుపోకుండా ఉంటాయి.
-తగినంత నీరు తాగడం వల్ల రక్తం పలుచగా ఉండి, రక్త ప్రసరణ సులభమవుతుంది. డీహైడ్రేషన్ వల్ల రక్తం చిక్కబడి ప్రసరణకు ఆటంకం కలుగుతుంది.
-ఒకే చోట ఎక్కువ సేపు కూర్చోవడం లేదా నిలబడడం వల్ల కాళ్లలో రక్తం పేరుకుపోయే అవకాశం ఉంది. ఎక్కువ సేపు కూర్చుంటే, ప్రతి గంటకు ఒకసారి లేచి, కొద్దిసేపు అటుఇటు నడవండి. ఆఫీసులో కూర్చున్నప్పుడు కూడా కాళ్లను అప్పుడప్పుడు కదపడం అలవాటు చేసుకోండి.
-చదునైన, సౌకర్యవంతమైన పాదరక్షలు ధరించడం వల్ల పిక్క కండరాలపై ఒత్తిడి తగ్గుతుంది. హై హీల్స్ ఎక్కువసేపు వాడకపోవడం మంచిది.
-మీకు కాళ్ల వాపు సమస్య ఉంటే పడుకున్నప్పుడు కాళ్ల కింద ఒక దిండు పెట్టుకుని కొద్దిగా పైకి ఉంచండి. ఇది రక్తాన్ని గుండె వైపు తిరిగి ప్రవహించేలా ప్రోత్సహిస్తుంది.
-శరీర బరువు ఎక్కువగా ఉన్నప్పుడు కాళ్ల మీద అదనపు ఒత్తిడి పడుతుంది. ఇది రక్త ప్రసరణను దెబ్బతీస్తుంది. సరైన బరువును నియంత్రించుకోవడం ద్వారా ఈ సమస్యను నివారించవచ్చు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications











