Latest Updates
-
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్! -
ప్రపంచ మెదడు దినోత్సవం.. బ్రెయిన్ హెల్త్‌కి, విటమిన్ బి1కి సంబంధం ఉందా.. ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.!
31st రోజు మందు ఎక్కకూడదంటే తెలుసుకోవాల్సన ఆరు విషయాలు
ఈరోజు డిసెంబర్ 31st. దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈరోజు మందు చిందు ఇలా ఎన్నో రకాల పార్టీలు చేసుకుంటారు. ప్రత్యేకమైన పార్టీ ఈవెంట్లు, డీజే నైట్స్, ఇలా ఎన్నో రకాలుగా ఎంజాయ్ చేస్తూ కొత్త సంవత్సరాన్ని స్వాగతిస్తుంటారు. ఈ వేడుకల్లో కచ్చితంగా ప్రతి ఒక్కరూ మందు తాగాల్సిందే. కొందరికి ఆ మందు ఎక్కువ అవడం వల్ల కక్కేస్తుంటారు. మరుసటి రోజు హ్యాంగోవర్‌తో ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వ్యక్తులు ఈరోజు మందు తాగేముందు తప్పకుండా తెలుసుకోవాల్సిన ఆరు విషయాల గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం.
బీర్ తాగడం వల్ల ప్రయోజనాలు
చాలా మంది ఈరోజు ఎక్కువగా బీర్ తాగుతుంటారు. అతికొద్ది మంది వ్యక్తులు మాత్రమే విస్కీ, బ్రాందీలు తాగుతుంటారు. సాధారణంగా బీర్లు పరిమితిలో తాగితే గుండెకు చాలా మంచిదని చెబుతుంటారు. అలాగే ఎముకల సాంద్రత కూడా పెరుగుతుందని వైద్యులు సూచిస్తున్నారు. దీంతోపాటు మూత్ర పిండాల్లో రాళ్లు వచ్చే అవకాశం కూడా ఉండదని, బీర్ మోతాదులో తాగడం వల్ల ఇలాంటి ప్రయోజనాలు కలుగుతాయని స్వయంగా కొందరు వైద్యులే చెప్పడం గమనార్హం.

అలాగే బీర్ మితంగా తాగితే ఇంకా కొన్ని ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. బీర్‌లో పాలి ఫెనల్స్, విటమిన్స్, అమైనో ఆమ్లాలు ఉంటాయి. ఇవి మన శరీరంలో ఉండే లిపిడ్ ప్రొఫైల్‌తో జతకట్టి గుండెకు మేలు చేస్తుంది. దాని కారణంగా గుండె సంబంధిత సమస్యలు రాకుండా చేస్తాయి. అలాగే కొంచెమే బీర్ తాగే వ్యక్తులకు యాంటీ యాక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు లభిస్తాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ పెరగకుండా చేయడంతో పాటు, ఆక్సీకరణ ఒత్తిడి తగ్గుతుంది. అలాగే గుండె సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి.
బీర్ తాగడం వల్ల దుష్ప్రయోజనాలు
మందు తాగడం వల్ల ఎంత ప్రయోజనాలు దొరుకుతాయో అంతే మొత్తంలో దుష్ప్రయోజనాలు కలుగుతాయి. బీర్లు ఎక్కువగా తాగడం వల్ల ఆరోగ్యం చాలా వరకు నాశనమైపోతుంది. అధికంగా బీర్లు తాగే వారి కాలేయం చాలా వరకు దెబ్బ తింటుంది. అలాగే భారీగా బరువు పెరిగిపోతారు. దీంతో పాటు శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది. చెడు కొలెస్ట్రాల్ పెరిగిపోవడం వల్ల.. గుండె సంబంధిత సమస్యలు ఎక్కువ అవుతాయి. గుండె జబ్బులు కూడా వచ్చే ఛాన్సుంటుంది. అలాగే బీర్ అతిగా తాగడం వల్ల వ్యసనంగా మారిపోతుంది. దీంతో జీవితం ప్రమాదంలో పడిపోతుంది. బీర్‌ను ఒక ఔషధంగా తాగితే మాత్రం మంచి ప్రయోజనాలు పొందవచ్చు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications