Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
2025లో మరో 6 వైరస్‌లు.. శాస్త్రవేత్తల సంచలన ప్రకటన! ప్రపంచ అంతం ఖాయం?
కరోనా తరువాత చైనాలో ఇప్పుడు HMPV వైరస్ ఉద్భవించిన విషయం తెలిసిందే. మన దేశంలో కూడా దీనికి సంబంధించిన నాలుగు కేసులు కూడా నమోదయ్యాయి. దీంతో మన దేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఈ వైరస్ గురించి భయాందోళనలు నెలకొన్నాయి. ఎక్కడ ఈ వైరస్ మరో కరోనా లాగా మారుతుందోనని కంగారు పడుతున్నారు. ఇప్పటి నుంచే దానికి సంబంధించిన జాగ్రత్తలు పాటిస్తున్నారు. అయితే ఈ HMPV వైరస్‌తో పాటు మరో ఆరు వైరస్‌లు ప్రపంచాన్ని ఇబ్బందులకు గురి చేయబోతున్నాయి. ఆ వైరస్‌లు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
హ్యూమన్ మెటాప్న్యూమోవైరస్(HMPV)
చైనాలో కొత్తగా విస్తరిస్తున్నట్లు చెబుతున్న ఈ HMPV వైరస్ ప్రస్తుతం నిద్రలేకుండా చేస్తుంది. చైనా నుంచి ప్రపంచం మొత్తానికి ఈ వ్యాధి వ్యాపించే ప్రమాదం ఉంది. దీనివల్ల చలికాలంలో శ్వాసకోశ సంబంధిత సమస్యలు ఎక్కువ అవుతాయని, కొన్ని కొన్ని సందర్భాల్లో అది మరణానికి కూడా కారణమవుతాయని చెబుతున్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, నవజాత శిశువుల్లో ఈ వైరస్ ఎక్కువగా వ్యాపిస్తోందని, కాబట్టి 2025లో ఈ వైరస్ వ్యాప్తి మరింత ఎక్కువయ్యే ప్రమాదం ఉందని తెలుస్తోంది.

తట్టు
ప్రపంచ ఆరోగ్య సంస్థ 2024లో ప్రపంచవ్యాప్తంగా 260,000 మీజిల్స్ కేసులు నమోదైనట్లు వెల్లడించింది. టీకా రేట్లు తగ్గిన ప్రాంతాలలో మీజిల్స్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. కాబట్టి, 2025లో మీజిల్స్ కూడా ప్రమాదకరమైన సమస్యగా మారవచ్చు.
డెంగ్యూ
2024లో ప్రపంచవ్యాప్తంగా 6 మిలియన్లకు పైగా డెంగ్యూ కేసులు నమోదయ్యాయని WHO అంచనా వేసింది. ఈడెస్ దోమల ద్వారా ఈ వ్యాధి వ్యాపిస్తుంది. అలాగే వాతావరణ మార్పు ఈ వెక్టర్స్ పరిధిని విస్తరిస్తోంది. భారతదేశంలో కూడా దీని ప్రమాదం ఎక్కువగానే ఉంది. అలాగే, 2025లో కూడా ఇది పెద్ద ముప్పుగా మారనుంది.
బర్డ్ ఫ్లూ
2024లో దీనికి సంబంధించిన కేసులు ప్రపంచ వ్యాప్తంగా భారీగానే నమోదయ్యాయి. 2025లో కూడా ఈ కేసులు నమోదవుతున్నాయి. H5N6 అనే ఈ వైరస్.. అనేక రకాల జంతువుల ద్వారా వ్యాపిస్తుంది. ప్రస్తుతం జంతువులకు సోకుతున్న ఈ వ్యాధి.. మ్యుటేట్ చెందితే మనుషులకు కూడా సోకె ప్రమాదం ఉంది.
నోరోవైరస్
2024లో, ప్రపంచవ్యాప్తంగా 500,000 కంటే ఎక్కువ నోరోవైరస్ కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది ఈ కేసుల సంఖ్య రెట్టింపు అవుతుందని చెబుతున్నారు. చలికాలంలో ఈ కేసు ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి ఐరోపా దేశాల్లో ఈ రేటు ఎక్కువ.
వెస్ట్ నైల్ వైరస్
యూరోపియన్ సెంటర్ ఫర్ డిసీజ్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్(ECDC) 2024లో 1,015 వెస్ట్ నైల్ వైరస్ కేసులను నివేదించింది. 2025 నాటికి యూరప్ మరియు ఉత్తర అమెరికాలో దోమల ద్వారా సంక్రమించే వైరస్ సమస్యగా మారవచ్చని అంటున్నారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications