Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
చలికాలంలో స్నానం చేయకపోతే ఆయుష్షు పెరుగుతుందట!
విదేశాల్లో అయితే నీళ్లకు కరువు ఉంటుంది కాబట్టి రోజుకి రెండు సార్లు స్నానం చేసే వాళ్లు ఎక్కువమంది ఉండరు. అయితే మనదేశంలో నీరు పుష్కలంగా లభిస్తుంది.. రోజుకి రెండు పూటల స్నానం చేసేవాళ్లు చాలామందే ఉంటారు. శీతాకాలంలో లేదా చలికాలంలో ఒకపూట స్నానం చేయడానికి కూడా కొంతమంది బద్దకిస్తుంటారు. అంతేకాకుండా శీతాకాలంలో స్నానం చేయకపోవడం ఆరోగ్యానికి మంచిదని, శీతాకాలంలో స్నానం చేయని వారి ఆయుర్దాయం పెరుగుతుందనే వాదనకు సంబంధించి ఇన్ స్టాగ్రామ్ లో ఒక వీడియో చాలా పెద్ద చర్చకు దారి తీసింది.
సోషల్ మీడియాను ఓ వీడియో షేక్ చేస్తోంది. డాక్టర్ రెబెక్కా పింటో అనే నిపుణురాలు చేసిన ఓ ప్రకటన నెట్టింట సంచలనంగా మారింది. చలికాలంలో స్నానం మానేస్తే మీ ఆయుష్షు ఏకంగా 34 శాతం పెరుగుతుంది అనే ఆమె మాటలకు ఇన్ స్టాగ్రామ్ లో కోట్లాది వ్యూస్ వచ్చాయి. చలికాలంలో మీ శరీరాన్ని వెచ్చగా ఉంచడం కోసం మీ రోగనిరోధక వ్యవస్థ చాలా గట్టిగా పనిచేస్తుంది. ఈ క్రమంలో మీరు తరచుగా స్నానం చేయడం వల్ల శరీరంపై ఉన్న నేచురల్ ఆయిల్స్ అన్నీ పోతాయని, దీంతో పొడి బారడం, వాపు వంటివి వస్తుంటాయని చెప్పారు. ఈ బోల్డ్ క్లెయిమ్ వినడానికి ఆసక్తికరంగా ఉన్నా, దీని వెనుక ఉన్న నిజానిజాలపై పెద్ద చర్చే జరుగుతోంది.

డాక్టర్ రెబెక్కా తన వాదనలో బాడీ స్క్రబ్బింగ్ ప్రయోజనాల గురించి మాట్లాడారు కానీ,తన మాటలకు శాస్త్రీయ ఆధారాలు ఎక్కడా చూపించలేదు. దీంతో నెటిజన్లు ఇంత పెద్ద ప్రకటన చేసే ముందు పరిశోధన పత్రాలు చూపించాల్సింది కదా? అని ప్రశ్నిస్తున్నారు. ఇతర ఆరోగ్య నిపుణులు ఈ వాదనను తోసిపుచ్చుతున్నారు. చలికాలంలో రోజూ స్నానం చేయడం వల్ల చర్మం పొడిబారే అవకాశం ఉన్నా, స్నానాన్ని పూర్తిగా మానేయడం మాత్రం అత్యంత ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. ఆయుష్షు 34 శాతం పెరుగుతుందనడం అతిశయోక్తి అని, స్నానం మానేస్తే శరీరంలో క్రిములు పెరిగిపోయి ఇన్ఫెక్షన్లకు దారితీస్తుందని స్పష్టం చేస్తున్నారు.
నిజానికి రోజూ స్నానం చేయాలనే నియమం సంస్కృతిని, వాతావరణాన్ని బట్టి మారుతుంది. చలి ప్రదేశాలలో రోజూ స్నానం చేయకపోవడం సాధారణమే. అయితే,పరిశుభ్రత, ఆరోగ్యం మధ్య సమతుల్యత పాటించడం ముఖ్యం. అతిగా స్నానం చేయడం మంచిది కాదు, అలా అని పూర్తిగా మానేయడం అంతకన్నా మంచిది కాదు. కాబట్టి ఇలాంటి వైరల్ వాదనలను గుడ్డిగా నమ్మకుండా మీ శరీర తత్వానికి, పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వడం ఉత్తమం.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications