Latest Updates
-
ఇంట్లోనే హోటల్ స్టైల్ దోశ పిండి..ఎలా తయారుచేసుకోవాలో చూడండి -
రచితో పాటే ఆరోగ్యం కూడా..గోధుమ రవ్వ పొంగల్ ఇలా చేస్తే..తింటుంటే మర్చిపోలేని మజా.. -
డ్రమ్ లో శవమవడం కంటే ఇదే బెస్ట్.. భార్యకు ఆమె ప్రియుడితో పెళ్లి జరిపించిన భర్త.. నెటిజన్ల ప్రశంసలు -
చుక్క నూనె లేకుండానే బెస్ట్ స్నాక్..ఒక్కటితో ఆగరు,అంత రుచిగా ఉంటుంది! -
పెళ్లి కాని ప్రసాద్ లు చూస్తే ఏడ్చేస్తారు.. కుక్కను పెళ్లి చేసుకొని అందరికీ షాకిచ్చిన బ్యూటీ! -
నాన్ వెజ్ ని మించిన రుచి, ఆరోగ్యం కూడా..చపాతీ, రైస్ లోకి కిర్రాక్ అనిపించే గోంగూర సోయా చేసుకోండిలా.. -
రాజస్థాన్ ఫేమస్ కార్న్ ఢోక్లా..బరువు తగ్గాలనుకునేవాళ్లకి ఇది బెస్ట్! -
గుడ్డు పచ్చసొన తింటే కొలెస్ట్రాల్ పెరిగి హార్ట్ ఎటాక్ వస్తుందా? డాక్టర్ విక్రాంత్ సింగ్ ఏమంటున్నారంటే.. -
ఈ ఒక్క పొడి ఉంటే చాలు..జీవితంలో హాస్పిటల్ కి వెళ్లాల్సిన పనే ఉండదు..అన్నం, టిఫిన్స్ లోకి సూపర్ -
అబ్బాయి వర్జిన్ కాదని పెళ్లి రద్దు చేసుకున్న యువతి..అసలు నువ్వు వర్జినేనా అంటూ..
వీకెండ్లో పార్టీలంటూ అతిగా తాగేవారికి ఒక హెచ్చరిక!
శని,ఆదివారం అనగానే చాలామందికి మనసు తేలిక పడుతుంది. వారమంతా పని ఓత్తిడితో సతమతమయ్యే చాలామంది ఉద్యోగులు, కార్మికులు..వీకెండ్ లో మనసును తేలికపర్చుకోడానికి మద్యం తాగుతుంటారు. ఫ్రెండ్స్ తో వీకెండ్ పార్టీలు చేసుకుంటూ ఫుల్ గా తాగి రిలాక్స్ అవుతుంటారు. అయితే చాలామంది వీకెండ్ లో విపరీతంగా తాగుతుంటారు. అయితే ఈ అలవాటు వల్ల అటు పనికి,ఇటు వ్యక్తిగత జీవితానికి కూడా హాని కలుగుతుంది.
వీకెండ్ లో ఫుల్ గా మందే తాగే అలవాటును స్టార్టింగ్ నుంచే కంట్రోల్ చేయకుంటే శరీరానికి చాలా పెద్ద ప్రమాదాన్ని కొన్ని తెచ్చుకున్నట్లేనని నిపుణులు అంటున్నారు. వారాంతాల్లో ఫుల్ గా మందు తాగే అలవాటుని తగ్గించడానికి అనేక పద్ధతులు సహాయపడతాయి.

-వీకెండ్ లో మీరు ఎంత తాగాలో ముందే నిర్ణయించుకోవాలి. ఎలాంటి పరిస్థితుల్లో అయానా సరే దానిని మించి తాగకూడదు. అవసరమైతే నెలలోని నాలుగు వారాల్లో మీరు ఎంత తాగుతారో మీ ఫోన్ లో ఓ లెక్క చేసి పెట్టుకోండి. దీనివల్ల మీరు ఎంత మద్యం తాగుతారో మీకు స్పష్టమైన అవగాహన వస్తుంది.
-వీకెండ్స్ లో మందు తాగేదానికి బదులుగా మీ సమయాన్ని గడపడానికి ఇతర మార్గాలను వెతకాలి. ఫ్యామిలీతో కలిసి సినిమాలు చూడటం లేదా పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోవచ్చు. ఇది మీ మనస్సులో మద్యం తాగాలనే కోరికను సృష్టించదు.
-ఒక గ్లాసు ఆల్కహాల్ తాగిన తర్వాత, ఒక గ్లాసు నీరు తాగవచ్చు. ఇది కడుపు నిండుగా ఉంచుతుంది. తదుపరి బాటిల్ తాగిన తర్వాత కూడా ఇదే విధానాన్ని అనుసరించాలి. మొత్తంమీద మద్యం సేవించే పరిమాణం తగ్గినట్లు కనిపిస్తుంది.
-ఇంట్లో ఒంటరిగా తాగడానికి ఇష్టపడేవారు మద్యం బాటిళ్లు కొని ఉంచుకునే అలవాటు మానేయాలి. ఇంట్లో మద్యం లేకపోతే వీకెండ్స్ లో తాగే ధోరణి కూడా తగ్గుతుంది.
-ఖాళీ కడుపుతో మద్యం తాగకూడదు. మద్యం తాగే ముందు తేలికపాటి భోజనం తినాలి. ఇది మీ కడుపు నిండుగా ఉంచుతుంది. ఫలితంగా మీరు ఎక్కువగా మందు తాగే ధోరణిని కలిగి ఉండరు.
-మీ ఫ్రెండ్స్ పట్టుబట్టినా సరే మీరు లిమిట్ కి మించి లిక్కర్ తాగకూడదు. మీ నిర్ణయాన్ని వారికి ముందుగానే తెలియజేయాలి. ఫలితంగా మీరు వారితో సమయం గడిపినప్పటికీ, మీ తాగుడు పరిమితిని మించదు. అవసరమైతే మీరు నెమ్మదిగా మద్యం తాగవచ్చు. మద్యం అందించని రెస్టారెంట్ లేదా కేఫ్ కు కూడా వెళ్లాలి.
-వారాంతాల్లో మద్యం సేవించిన తర్వాత మీరు టీ లేదా కాఫీ తాగడం అలవాటు చేసుకోవచ్చు. తాగాలనే కోరిక పెరిగిన సమయాల్లో టీ లేదా కాఫీ తాగడం వల్ల మద్యం తాగాలనే కోరిక తగ్గుతుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
