Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
స్మోకింగ్ చేసేవాళ్లు పచ్చిమిర్చి తింటే..లంగ్ క్యాన్సర్ నుంచి సేఫ్!..డాక్టర్ల సలహా ఇదే
లంగ్ క్యాన్సర్ లేదా ఊపిరితిత్తుల క్యాన్సర్ అనేది చాలా సాధారణమైన, తీవ్రమైన క్యాన్సర్ రకం. ఊపిరితిత్తుల కణాలు విపరీతంగా పెరిగిపోవడం వల్ల వచ్చే క్యాన్సర్ ను ఊపిరితిత్తుల క్యాన్సర్ అంటారు. ఊపిరితిత్తుల క్యాన్సర్ ఏ వ్యక్తిలోనైనా సంభవించవచ్చు,దాని వెనుక వివిధ కారణాలు ఉండవచ్చు. కానీ ధూమపానం చేసేవారికి ఈ వ్యాధి వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. లంగ్ క్యాన్సర్ ఒక్కసారి వచ్చిందంటే ఇక చాలామంది ఇక భయాందోళనకు గురవుతుంటారు. ఈ వ్యాధికి ట్రీట్మెంట్ కూడా దీర్ఘకాలికమైనది, ఇందులో మందుల నుండి కీమోథెరపీ వరకు ఉంటుంది. అయితే కొంతమంది హోమ్ టిప్స్ సహాయంతో దానిని నయం చేసి క్యాన్సర్ ను దూరంగా ఉంచుతామని చెబుతారు.
ఇటీవల ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లలో కూడా ఇలాంటి వాదనలు వచ్చాయి. ఆ పోస్ట్ లలో ధూమపానం చేసేవారు పచ్చి మిరపకాయలు తినాలని,ఇది ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రమాదాన్ని కొంతవరకు తగ్గిస్తుందని,దీనిని రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలి చెప్పారు. అయితే డాక్టర్ల అభిప్రాయం ప్రకారం పచ్చి మిరపకాయలు తినడం వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే ప్రమాదం తగ్గుతుందనే వాదన పూర్తిగా అబద్ధం. ధూమపానం చేసేవారు ఊపిరితిత్తుల క్యాన్సర్ ను నివారించడానికి ఏకైక మార్గం ధూమపానం మానేయడమేనని డాక్టర్లు తెలిపారు.

అధ్యయనాల్లో ఏమి తేలింది?
డాక్టర్ల అభిప్రాయం ప్రకారం పచ్చి మిరపకాయలలో క్యాప్సైసిన్ అనే క్రియాశీల సమ్మేళనం ఉంటుంది. కొన్ని పరిశోధనల ప్రకారం క్యాప్సైసిన్ యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటుంది, ఇవి ఊపిరితిత్తుల క్యాన్సర్ ను కొంతవరకు నివారించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. కానీ ఇది అధ్యయనాలలో పూర్తిగా నిరూపించబడలేదు, దీనిపై ఇంకా మరిన్ని పరిశోధనలు అవసరం. కొన్ని అధ్యయనాల ప్రకారం క్యాప్సైసిన్ అనేక రకాల క్యాన్సర్ సంభవం పెంచింది. అందువల్ల క్యాప్సైసిన్ ఊపిరితిత్తుల క్యాన్సర్ ను నివారించడంలో సహాయపడుతుందని నిరూపించబడలేదు.
డాక్టర్ల సలహా ఇదే
నిపుణుల అభిప్రాయం ప్రకారం మీరు పచ్చి మిరపకాయలు తిన్నా, తినకపోయినా అది ఊపిరితిత్తుల క్యాన్సర్ పై ఎటువంటి ప్రభావం చూపదు. ఊపిరితిత్తుల క్యాన్సర్‌ను నయం చేస్తుందనే వాదన తప్పుదారి పట్టించేదిగా నిరూపించింది. నిపుణుల బృందం ప్రకారం ధూమపానం మానేయడం ద్వారా మాత్రమే ఊపిరితిత్తుల క్యాన్సర్‌ను నివారించవచ్చు. పచ్చి మిరపకాయలు దీనికి స్పష్టమైన పరిష్కారం లేదు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications