Latest Updates
-
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్! -
ప్రపంచ మెదడు దినోత్సవం.. బ్రెయిన్ హెల్త్‌కి, విటమిన్ బి1కి సంబంధం ఉందా.. ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.!
సిగరెట్ కాలుస్తూ టీ తాగుతున్నారా? ఈ డెడ్లీ కాంబినేషన్ వల్ల ఎన్ని ఆరోగ్య సమస్యలో తెలుసుకోండి
Tea with smoking: పని ఒత్తిడి నుంచి సాంత్వన పొందేందుకు, ఇంటికి వచ్చిన అతిథులకు ఇచ్చేందుకు చాలామంది టీ ప్రిఫర్ చేస్తుంటారు. అంతగా భారతీయుల జీవితాల్లో టీ పాతుకుపోయింది. ఈ మధ్య ధూమపానం చేసేటప్పుడు టీ తాగేందుకు మరికొందరు ఆసక్తిని కనబరుస్తున్నారు. ఇది పలు ఆరోగ్య సమస్యలకు దారితీస్తున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. ఇలా చేయడం వల్ల ఎన్ని ఇబ్బందులు ఎదురవుతాయో తెలుసుకుందాం.
సిగరెట్‌లో ఉండే నికోటిన్ గుండెకు చేటు చేస్తుంది. ఇతరులతో పోలిస్తే ధూమపానం చేసేవారికి గుండెనొప్పి వచ్చే అవకాశం 3 రెట్లు ఎక్కువ అని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే గుండెకు రక్తాన్ని సరఫరా చేసే ధమనులలో నికోటిన్ సంకోచాన్ని కలిగిస్తుంది. తద్వారా స్వచ్ఛమైన రక్తం గుండెకు చేరకుండా అడ్డుకుంటుంది. ఇది గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది.

టీ లో ఉండే పాలీఫెనాల్స్ గుండెకు మేలు చేస్తాయి. కానీ టీ లో పాలు కలపడంతో అవికాస్తా ప్రతికూలంగా మారతాయి. పాలలోని ప్రొటీన్ టీ లోని పాలీఫెనాల్ తో రియాక్ట్ అయ్యి దాని ప్రభావాన్ని తగ్గిస్తుంది. అందుకే ఎక్కువగా టీ తాగితే హృదయ స్పందన రేటును పెరగడంతో పాటు అధిక రక్తపోటుకు గురికావచ్చు. అందుకే ధూమపానం మరియు టీ రెండూ గుండె ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తాయి.
సిగరెట్ కాలుస్తూ టీ తాగే అలవాటు ఉంటే రోగాలకు వెల్‌కమ్ చెప్పినట్లే. టీ మరియు సిగరెట్ల కలయిక గుండె జబ్బులు సహా అనేక ఇతర వ్యాధులకు కారణమవుతుంది.
క్యాన్సర్ వచ్చే అవకాశాలు 30 శాతం పెరుగుతాయని తాజా అధ్యయనంలో తేలింది. టీ లోని టాక్సిన్స్ సిగరెట్ పొగతో కలిసి ఈ ప్రమాదకరమైన వ్యాధికి కారణమవుతాయి. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ టీతో పాటు సిగరెట్ తాగకూడదని వైద్యులు సూచిస్తున్నారు.
ఈ రెండు డెడ్లీ కాంబినేషన్ వల్ల ముఖ్యంగా నోరు, ఊపిరితిత్తులు, గొంతు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువ. జీర్ణవ్యవస్థపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది. ప్రేగులు మరియు కడుపుకు చేటు చేయడం వల్ల కడుపునొప్పి, ఎసిడిటీ, గ్యాస్ వంటి జీర్ణ సమస్యలు వస్తాయి. ధూమపానం చేస్తున్నప్పుడు రిలాక్స్‌గా అనిపించినా ఆ తర్వాత మానసిక ఒత్తిడి, ఆందోళన పెరుగుతుంది. మరోవైపు టీ లో ఉండే కెఫిన్ సరిగా నిద్ర రానివ్వదు.
ఇవేకాక దంతాలు మరియు నోటి ఆరోగ్యంపైనా టీ మరియు సిగరెట్ ప్రభావం చూపిస్తాయి. తెల్లటి దంతాలను పసుపు రంగులోకి మార్చడంతో పాటు దంతాల బలాన్ని తగ్గిస్తాయి. దీనికి అదనంగా నోటి దుర్వాసన ఖాయం. నోటి క్యాన్సర్ ప్రమాదం కూడా పెంచుతాయి. టీ ఎక్కువగా తాగడం వల్ల మూత్ర విసర్జన పెరుగి, కిడ్నీలపై పనితీరు మందగించేలా చేస్తుంది. శరీరాన్ని డీహైడ్రేట్ చేయడం వల్ల ఆరోగ్యాన్ని చెడగొడుతుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications