Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
శీతాకాలంలో గురక ఎందుకు పెరుగుతుంది? దీనికి చెక్ పెట్టే మార్గాలివే!
మనలో చాలామందికి నిద్రించే సమయంలో గురక వస్తుంది. కొందరు అయితే ఎక్కువగా గురకపెడుతుంటారు,మరికొందరు తక్కువగా గురకపెడుతుంటారు. అయితే గురక అనేది పైకి చూడటానికి ఒక చిన్న అలవాటులా అనిపించవచ్చు కానీ వాస్తవానికి ఇది నిద్ర, ఆరోగ్యం రెండింటికీ సంబంధించిన ఒక తీవ్రమైన సమస్య.
రాత్రిపూట వచ్చే ఈ శబ్దం గురక పెట్టే వ్యక్తిని మేల్కొల్పకపోయినా పక్కన పడుకున్న వారి నిద్రను మాత్రం ఖచ్చితంగా భంగపరుస్తుంది. నిరంతర గురక కేవలం రాత్రి నిద్రనే కాకుండా పగటిపూట అలసట, చిరాకు, ఏకాగ్రత లోపానికి కూడా దారితీస్తుంది.

గురకకు అసలైన సీజన్?
మిగిలిన కాలాలతో పోలిస్తే చలికాలంలో గురక సమస్య చాలా ఎక్కువగా పెరుగుతుంది. చల్లని రాత్రులు, గాలిలో తేమ తగ్గడం వంటివి ఈ సమస్యను మరింత తీవ్రతరం చేస్తాయి. సాధారణంగా పురుషులలో గురక ఎక్కువగా కనిపిస్తుంది కానీ వయసు పెరిగే కొద్దీ స్త్రీలలో కూడా ఇది తీవ్రమయ్యే అవకాశం ఉంది. అసలు చలికాలంలోనే గురక ఎందుకు పెరుగుతుందో తెలుసుకోవడం చాలా ముఖ్యం.
అసలు గురక ఎందుకు వస్తుంది?
నిపుణుల ప్రకారం మనం గాఢ నిద్రలో ఉన్నప్పుడు గొంతు, నాలుక, అంగిలి కండరాలు విశ్రాంతి పొందుతాయి. ఈ కండరాలు మరీ ఎక్కువగా సడలించినప్పుడు మన వాయుమార్గం ఇరుకుగా మారుతుంది. మనం శ్వాస తీసుకున్నప్పుడు ఈ ఇరుకైన మార్గం గుండా గాలి వెళుతున్నప్పుడు గొంతు లోపలి కణజాలం కంపిస్తుంది. ఈ కంపనమే భయంకరమైన గురక శబ్దంగా బయటకు వస్తుంది.
చలికాలంలో ఈ సమస్య ఎందుకు ఎక్కువవుతుంది?
శీతాకాలపు గాలి చాలా చల్లగా,పొడిగా ఉంటుంది. మనం ఈ పొడి గాలిని పీల్చినప్పుడు మన ముక్కు,గొంతు లోపలి పొరలు ఎండిపోవడం ప్రారంభిస్తాయి. ఈ పొడితనం వల్ల గొంతులో వాపు వచ్చి వాయుమార్గాలు మరింత ఇరుకుగా మారతాయి. ఫలితంగా శ్వాస తీసుకోవడం కష్టమై గురక శబ్దం బిగ్గరగా మారుతుంది.
ఈ సీజన్ లో జలుబు, అలెర్జీలు, సైనస్ సమస్యలు సాధారణం. ముక్కు మూసుకుపోవడం వల్ల చాలామంది నోటి ద్వారా శ్వాస తీసుకుంటారు. నోటి ద్వారా గాలి పీల్చడం వల్ల గొంతు కండరాలు మరింత సడలిపోయి గురక వచ్చే అవకాశం పెరుగుతుంది.

ఎవరికి ఎక్కువ ప్రమాదం?
గురకకు కారణాలు వ్యక్తిని బట్టి మారుతుంటాయి. కొందరిలో ముక్కు లేదా గొంతు నిర్మాణం సహజంగానే గురకకు కారణం కావచ్చు. కానీ ఊబకాయం ఒక ప్రధాన కారణం. మెడ చుట్టూ అధికంగా కొవ్వు పేరుకుపోవడం వల్ల వాయుమార్గాలపై ఒత్తిడి పెరుగుతుంది.
అలాగే వయసు పెరిగే కొద్దీ కండరాల పట్టు తగ్గుతుంది కాబట్టి వృద్ధులలో ఈ సమస్య ఎక్కువ. ఇక మద్యపానం చేసేవారిలో, నిద్ర మాత్రలు వాడేవారిలో గొంతు కండరాలు అతిగా రిలాక్స్ అవ్వడం వల్ల గురక సమస్య తీవ్రంగా ఉంటుంది.
గురకకు చెక్ పెట్టే సులభమైన మార్గాలు
-వెల్లకిలా పడుకోకుండా, ఒక పక్కకు తిరిగి పడుకోవడం మంచిది. ఇది వాయుమార్గాలను తెరిచి ఉంచడానికి సహాయపడుతుంది.
-పడుకునే ముందు భారీగా భోజనం చేయడం లేదా వేయించిన పదార్థాలు తినడం తగ్గించండి.
-శీతాకాలంలో గది గాలి మరీ పొడిగా ఉండకుండా చూసుకోండి. గదిలో ఒక గిన్నెలో నీళ్లు ఉంచడం లేదా హ్యూమిడిఫైయర్ వాడటం వల్ల గాలిలో తేమ ఉండి, గొంతు పొడిబారదు.
-పడుకునే ముందు వేడి నీటి ఆవిరిని పీల్చడం వల్ల ముక్కు రంధ్రాలు తెరుచుకుంటాయి, శ్వాస సాఫీగా సాగుతుంది.
-గురక మరీ ఎక్కువగా ఉండి నిద్రకు తీవ్ర ఆటంకం కలిగిస్తుంటే దానిని నిర్లక్ష్యం చేయవద్దు. ఇది స్లీప్ ఆప్నియా వంటి సమస్యలకు సంకేతం కావచ్చు. సకాలంలో డాక్టర్ ని సంప్రదించాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications