Latest Updates
-
హై ప్రోటీన్ బ్రేక్ ఫాస్ట్ పెసర ఉత్తప్పం..కొబ్బరి చట్నీతో కలిపి తింటే స్వర్గమే! -
వడగాల్పుల నుంచి ప్రాణాలను కాపాడుకోండి! ఎండ తీవ్రతను తట్టుకోవడానికి ఈ ఆహారపు అలవాట్లు తప్పనిసరి -
ఒక్కసారి చేస్తే నెలల తరబడి నిల్వ ఉండే మామిడికాయ తీపి పచ్చడి..టేస్ట్ అదుర్స్! -
ఆది శంకరాచార్య జయంతి: ఇంట్లో పూజలు చేస్తున్నారా? ఈ శుభ ముహూర్తాలు, నియమాలు మీకు తెలుసా? -
మిథున, తుల, కుంభ రాశుల వారికి అద్భుత యోగం.. మీ జాతకం ఎలా ఉంది? - మంగళవారం, 21 ఏప్రిల్ 2026 -
దగ్గు తగ్గట్లేదా? మీ ఊపిరితిత్తుల్లో బూజు ఉండొచ్చు? ఆస్తమా పేషెంట్లకు డాక్టర్ బిగ్ అలర్ట్ -
ఎండలు మండిపోతున్నాయి.. పెళ్లిళ్లపై ఎఫెక్ట్! వేడుకలను మార్చుకోకపోతే కష్టమేనా? -
ఇంట్లో కొబ్బరి లేదా? అయితే ఇడ్లీ, దోసెల్లోకి ఈ కొబ్బరి లేని కొబ్బరి చట్నీ చేసేయండి! -
వడగాల్పుల ఎండలు భయపెడుతున్నాయా? ఈ చిన్న చిట్కాలతో ప్రాణాలు కాపాడుకోండి -
చీఫ్ గెస్ట్ గా పిలవలేదని.. క్రికెట్ పిచ్ ను ట్రాక్టర్‌తో దున్నేసిన పొలిటికల్ లీడర్..వీడియో చూడండి
మందులోకి సోడా మంచిదా? వాటర్ మంచిదా?
మనదేశంలో లిక్కరు లేదా మందుకు ఉన్నంత క్రేజ్ మరే ఇతర డ్రింక్ కు ఉండదు. మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని ఎవరు చెప్పినా,బాటిల్ మీద రాసినా కూడా దీన్ని ఎవ్వడూ పట్టించుకోరు. కొందరు అయితే లిమిట్ గా తాగుతుంటారు..మరికొందరు అన్ లిమిటెడ్ గా తాగుతుంటారు. మందు తాగి తాగి కిడ్నీలు,లివర్ పాడై చనిపోతున్నవాళ్ల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటోంది. మనదేశంలో గుజరాత్,బీహార్ వంటి కొన్ని రాష్ట్రాల్లో మద్యపాన నిషేధం కూడా ఉంది. ఇక, ఏపీ,తెలంగాణ వంటి కొన్ని రాష్ట్రాలకు ఇదే ప్రధాన ఆయన వనరుగా ఉంది.
ఆల్కహాల్ తీసుకునేటప్పుడు చాలామంది సోడా లేదా ఇతర కూల్ డ్రింక్స్ కూడా కలుపుకొని తాగడానికి ఇష్టపడతారు. మరికొందరు మాత్రం నీటిని కలుపుకుంటారు. మందుని డైరెక్ట్ గా రా తాగలేరు కాబట్టి ఈ కాంబినేషన్ ను వాడుతుంటారు. అయితే మందులోకి సోడా కలుపుకోవడం మేలు చేస్తుందా లేకుంటే సోడా కలుపుకోవడం మేలు చేస్తుందా..రెండింటిలో ఏది ఆరోగ్యానికి మంచిది? ఈ ప్రశ్నకు సమాధానం చాలామందికి తెలియదు. మందులలోకి సోడా మంచిదా,నీళ్లు కలుపుకోవడం మంచిదా అనే ప్రశ్నకు సరైన సమాధానం ఇక్కడ చూడండి.

సోడా Vs వాటర్..ఇదే బెటర్?
ఆరోగ్య కోణం నుంచి చూస్తే ఆల్కహాల్ లేదా లిక్కర్ తీసుకునేటప్పుడు అందులోకి నీటిని కలుపుకోవడమే ఉత్తమమైన, సురక్షితమైన మార్గం. దీనికి కొన్ని బలమైన కారణాలు ఉన్నాయని కొందరు నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇక్కడ చూడండి.
డీహైడ్రేషన్ తగ్గించడానికి
ఆల్కహాల్ ఒక డయూరెటిక్. అంటే ఇది శరీరంలోంచి నీటిని ఎక్కువగా బయటకు పంపిస్తుంది తద్వారా డీహైడ్రేషన్ కు దారితీస్తుంది. సోడా లేదా ఇతర చక్కెర పానీయాలు కలిపి తాగితే అవి శరీరానికి అవసరమైన నీటిని అందించలేకపోగా డీహైడ్రేషన్ ను మరింత పెంచుతాయి. నీరు మాత్రమే శరీరానికి కోల్పోయిన ద్రవాలను తిరిగి అందించి డీహైడ్రేషన్ ను తగ్గిస్తుంది.
హ్యాంగోవర్ నివారణకు
డీహైడ్రేషన్ హ్యాంగోవర్ కు ప్రధాన కారణాలలో ఒకటి. నీరు తాగడం వల్ల శరీరం డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది, ఇది హ్యాంగోవర్ తీవ్రతను తగ్గించడంలో సహాయపడుతుంది. సోడాలో ఉండే చక్కెర, కృత్రిమ రంగులు, ఫ్లేవర్లు హ్యాంగోవర్ ను మరింత తీవ్రతరం చేయవచ్చు.
కాలేయంపై భారం తగ్గించడానికి
కాలేయం ఆల్కహాల్ ను ప్రాసెస్ చేస్తుంది. సోడాతో కలిపి తాగినప్పుడు కాలేయం ఆల్కహాల్ ను, సోడాలోని చక్కెర, ఇతర రసాయనాలను కూడా ప్రాసెస్ చేయాల్సి వస్తుంది. ఇది కాలేయంపై అదనపు భారాన్ని మోపుతుంది. నీటితో కలిపి తాగినప్పుడు కాలేయం కేవలం ఆల్కహాల్‌పై మాత్రమే దృష్టి సారించగలదు, దాని పని సులభం అవుతుంది.
తక్కువ కేలరీలు
సోడాలో చక్కెర ఎక్కువగా ఉంటుంది కాబట్టి అధిక కేలరీలు ఉంటాయి. ఆల్కహాల్ తో కలిపి సోడా తాగితే, అనవసరంగా ఎక్కువ కేలరీలు శరీరంలోకి చేరతాయి, ఇది బరువు పెరగడానికి దారితీస్తుంది. నీటిలో కేలరీలు సున్నా.
రుచిని పూర్తిగా ఆస్వాదించడానికి
కొంతమంది ఆల్కహాల్ స్వచ్ఛమైన రుచిని ఇష్టపడతారు. సోడా కలపడం వల్ల ఆల్కహాల్ అసలు రుచి మారిపోతుంది. నీరు కలిపితే రుచిని ఎక్కువగా మార్చకుండా ఆల్కహాల్ గాఢతను తగ్గిస్తుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications











