Latest Updates
-
ఢిల్లీలో మండుతున్న ఎండలు! వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి -
రాత్రి పప్పు మిగిలిపోయిందా? అయితే ఉదయం ఇలా కమ్మని పరాఠా చేసుకోండి! -
ఏప్రిల్ 22 పంచాంగం: ఈ పనులు ఈ సమయంలో మొదలుపెడితే తిరుగుండదా? నేటి శుభ ముహూర్తాలివే! -
మిథునం, కన్య, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన ధన యోగం..! - బుధవారం, 22 ఏప్రిల్ 2026 -
ప్రేమ రాశిఫలాలు: ఏప్రిల్ 21న మీ భాగస్వామితో బంధం బలపడాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
ఢిల్లీలో ఎండలు మండిపోతున్నాయా? వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ 7 చిట్కాలు మీకోసమే! -
హై ప్రోటీన్ బ్రేక్ ఫాస్ట్ పెసర ఉత్తప్పం..కొబ్బరి చట్నీతో కలిపి తింటే స్వర్గమే! -
వడగాల్పుల నుంచి ప్రాణాలను కాపాడుకోండి! ఎండ తీవ్రతను తట్టుకోవడానికి ఈ ఆహారపు అలవాట్లు తప్పనిసరి -
ఒక్కసారి చేస్తే నెలల తరబడి నిల్వ ఉండే మామిడికాయ తీపి పచ్చడి..టేస్ట్ అదుర్స్! -
ఆది శంకరాచార్య జయంతి: ఇంట్లో పూజలు చేస్తున్నారా? ఈ శుభ ముహూర్తాలు, నియమాలు మీకు తెలుసా?
Tongue Changes : మీ నాలుకపై ఇలా కనిపిస్తున్నాయా? బీ కేర్ ఫుల్..క్యాన్సర్ సంకేతమే!
మనకు ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చి డాక్టర్ దగ్గరకి వెళ్లాక ఫస్ట్ నాలుక చూపించండి అని డాక్టర్ అడగటం మనకు తెలిసిందే. అయితే వేర్వేరు సమస్యలు ఉన్నాయని మీరు డాక్టర్ దగ్గరకి వెళ్లే నాలుక చూపించమంటారేంటబ్బా అని ఎప్పుడైనా ఆలోచించారా? వాస్తవానికి మీ నాలుక మీ ఆరోగ్యానికి అద్దం లాంటిది. నాలుక రంగు, ఆకారం,ఉపరితలంపై కనిపించే మార్పులు కొన్నిసార్లు మీ శరరం లోపల ఏదో తీవ్రమైన వ్యాధి గురించి హెచ్చరించే సంకేతాలు కావచ్చు. డాక్టర్లు తరచుగా మీ నోరు తెరిచి నాలుకను పరిశీలించడం వెనుక దాగిన కారణం ఇదే. మీ నాలుకలో కనిపించే కొన్ని మార్పులు,అవి ఏ ప్రమాదకర వ్యాధులను సూచిస్తాయో ఇప్పుడు చూద్దాం.
నల్లగా,చిన్న వెంటుక్రల్లా కనబడితే
కొన్నిసార్లు మన నాలుక మీద నల్లగా,చిన్న చిన్న వెంటుకల్లా కనిపిస్తే కొందరు కంగారు పడిపోతారు. వాస్తవానికి దీనికి కారణం ఏంటంటే మన నాలుక మీద చిన్న చిన్న మొగ్గల్లాంటి నిర్మాణాలుంటాయి. వీటినే పాపిల్లే అంటారు. కొన్ని సమయాల్లో ఈ పాపిల్లేలు ఎక్కువగా పెరిగిపోతాయి. అప్పుడు వాటి మధ్యలో బ్యాక్టీరియా, ఈస్ట్ వంటి సూక్ష్మజీవులు పేరుకుపోతుంటాయి. ఇవే ఆ నలుపు రంగు,వెంట్రుకల వంటి రూపాన్ని కలిగిస్తాయి. దీనికి చాలా కారణాలుంటాయి. అయితే ప్రధానంగా నోటి పరిశుభ్రత సరిగ్గా లేకోవడం వల్లనే ఇలా అవుతుందని నిపుణులు చెబుతున్నారు.
అంతేకాకుండా స్మోకింగ్ చేసేవారిలో, ఎక్కువ కాలం యాంటీబయాటిక్స్ వాడిన వారిలో లేదా రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో కూడా ఇది కనిపించవచ్చు. దీని గురించి ఎక్కువగా భయపడాల్సిన అవసరం లేదని..ఇది సాధారణంగా ప్రమాదకరమైన పరిస్థితి కాదని.. కానీ ఇలా ఉంటే మాత్రం మీ నోటిని మరింత శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఒకసారి డెంటిస్ట్ ని సంప్రదించడం బెటర్.

ఎర్రగా,ఉబ్బెత్తుగా మచ్చ కనిపిస్తే
నాలుక మీద చాలా కాలంగా ఒక ఎర్రటి, నునుపైన లేదా కొద్దిగా ఉబ్బెత్తుగా ఉన్న మచ్చ కనిపిస్తే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. దీనిని వైద్య పరిభాషలో 'ఎరిత్రోప్లాకియా' అంటారు. ఇది అంత ప్రమాదకరమైనది కాకపోయినా.. కొన్నిసార్లు ఇది క్యాన్సర్ ప్రారంభ లక్షణం అవొచ్చు. కాబట్టి దీన్ని తేలికగా తీసుకోకూడదు. వెంటనే డాక్టర్‌ను కలవడం చాలా ముఖ్యం. సకాలంలో సరైన ట్రీట్మెంట్ తీసుకుంటే భవిష్యత్తులో వచ్చే పెద్ద ప్రమాదాలను తప్పించుకోవచ్చు.
నునుపుగా,మెరిసేలా కనబడుతుంటే
నాలుక మీద నునుపుగా,మెరిసేలా అనిపించవచ్చు. నాలుపై ఉండే చిన్న గరుకుదనం తగ్గిపోయి ఒక విధమైన మెరుపు వస్తుంది. మీ శరీరంలో ఐరన్, ఫోలేట్, విటమిన్ B12 వంటి ముఖ్యమైన పోషకాల కొరత ఉండొచ్చు. మెడికల్ బాషలో ఈ పరిస్థితిని 'ఆట్రోఫిక్ గ్లోసిటిస్' అంటారు. ఇలా మారిన నాలుక ఎర్రగా, కొద్దిగా బాధాకరంగా కూడా ఉండొచ్చు. అంతేకాకుండా ఇది మీ శరీరంలో అలసట, నాడీ సంబంధిత సమస్యలు లేదా రక్తహీనత వంటి ఇతర ఇబ్బందులు కూడా ఉన్నాయని తెలియజేస్తుంది. కాబట్టి వెంటనే ఇలా కనిపిస్తే డాక్టర్ ని సంప్రదించాలి.
లోతుగా గీతలు కనిపిస్తే
మన నాలుకపై చిన్న చిన్న గీతలు ఉండటం సహజమే కానీ ఆ గీతలు మామూలు కంటే లోతుగా ఉన్నాయా? లేదా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయా? అయితే ఇది ఆలోచించాల్సిన విషయమే. లోతైన పగుళ్లు లేదా గాట్లు ఉంటే దానిని 'నాలుక పగుళ్లు' అంటారు. కొన్నిసార్లు ఇది 'స్జోగ్రెన్స్ సిండ్రోమ్'వంటి వ్యాధుల వల్ల కూడా రావచ్చు. ఈ పరిస్థితిలో మీ నాలుక కొంచెం మంటగా లేదా నొప్పిగా కూడా అనిపించవచ్చు. ఈ సమస్య అలా చాలా కాలం పాటు కొనసాగితే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.
తెల్లటి పొరలా,అక్కడక్కడా మచ్చల్లా కనిపిస్తే
మీ నాలుకపై తెల్లటి పొరలాగా లేదా అక్కడక్కడ మచ్చల్లాగా కనిపిస్తోందా?ఇలా కనిపించడానికి చాలా కారణాలు ఉండొచ్చు. కొన్నిసార్లు ఇది 'ఓరల్ థ్రష్' అనే ఒక రకమైన ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. అంటే నోటిలో ఒక రకమైన శిలీంధ్రం పెరగడం వల్ల ఇలా జరుగుతుంది. మరికొన్నిసార్లు ఇది 'ల్యూకోప్లాకియా' అనే పరిస్థితి వల్ల కూడా రావచ్చు. ఇది క్యాన్సర్ వచ్చే ముందు కనిపించే లక్షణం కావచ్చు కాబట్టి అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. అంతేకాకుండా సరిగ్గా నోటిని శుభ్రం చేసుకోకపోవడం వల్ల కూడా ఇలాంటి తెల్లటి పొర ఏర్పడవచ్చు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications











