Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.!
జుట్టు తెల్లబడిన వారు తెల్ల వెంట్రుకలు కనబడకుండా వివిధ రకాల హెయిర్ కలర్ ఉత్పత్తులు వాడుతుంటారు. దీని వల్ల ఫలితం కనిపించినా ఆ తర్వాత దుష్ప్రభావాలు చోటుచేసుకుంటున్నాయి. ఇలాంటి సమస్య రాకుండా వంటగదిలో దొరికే వస్తువులతోనే సహజ నిగారింపును సొంతం చేసుకోవచ్చు.

ఈ రోజుల్లో చాలా మందికి చిన్న వయసులోనే జుట్టు పలచబడటం, తెల్ల వెంట్రుకలు రావడం జరుగుతోంది. ఈ కారణంగా తెల్ల జుట్టుని కనబడనీయకుండా చేసేందుకు హెయిర్ డైలను ఎక్కువగా ఆశ్రయిస్తున్నారు. అయితే వీటిలో ఎక్కువగా కెమికల్స్‌ను వాడుతుంటారు. దీని వల్ల జుట్టు నల్లగా మారినా.. తర్వాత పరిణామాలు తీవ్రంగా ఉంటున్నాయి. తలనొప్పి, సైడ్ ఎఫెక్ట్స్, జుట్టు రాలడం, ఇంకా తెల్లబడటం వంటివి జరుగుతున్నాయి. వీటికి చెక్ పెట్టేందుకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇంట్లోనే ఈ సులభమైన పద్ధతులను పాటించవచ్చు.
కాఫీలో హెన్నా
మీరు జుట్టుకి రంగు వేయకుండా సహజ రంగు ఇవ్వాలనుకుంటే ఇంట్లోని దొరికే కాఫీ పౌడర్, హెన్నా పొడర్ ఉత్తమంగా పనిచేస్తుంది. కాఫీ పొడిని హెన్నాతో కలిపి మీ కురులకు అప్లై చేయవచ్చు. దీని ద్వారా జుట్టుకి సహజ రంగు లభిస్తుంది.
ఒక కప్పు హెన్నా పొడి తీసుకుని అందులో మూడు టీస్పూన్ల కాఫీ పౌడర్ కలపాలి. గోరు వెచ్చని నీటితో పేస్ట్‌లా తయారు చేసుకోవాలి. పది నిమిషాల తర్వాత తలకు జుట్టుకి అప్లై చేసుకోవాలి. మూడు గంటల తర్వాత ఆరిపోతుంది. తర్వాత కడిగేయాలి. ఇలా చేయడం ద్వారా జుట్టు గోధుమ రంగులోకి మారి ఆకర్షణీయంగా ఉంటుంది.

బీట్‌రూట్ రసం- హెన్నా
బీట్‌రూట్ రసం మీ జుట్టుకి ముదురు ఎరుపు రంగు వస్తుంది. ఈ రసాన్ని హెన్నాని కలిపి రెండు గంటల పాటు నాననివ్వాలి. తర్వాత జుట్టుకి అప్లై చేసుకోవాలి. ఆరిన తర్వాత తల స్నానం చేయాలి. ఇలా చేయడం ద్వారా జుట్టుకి సహజ రంగుని సొంతం చేసుకోవచ్చు.
వాల్‌నట్ తొక్క కషాయం
వాల్‌నట్‌లోని ఒమేగా- 3 ఫ్యాటీ యాసిడ్లు శరీర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే దీని తొక్కను పడేయడం కామన్. కానీ ఇందులోనే జుట్టుకి అవసరమైన సహజ రంగు లభిస్తుంది. వాల్‌నట్ పెంకులను 30 నిమిషాల పాటు నీటిలో ఉడికించాలి. తర్వాత ఈ నీటిని కాస్త గోరువెచ్చగా అయిన తర్వాత జుట్టుకి పట్టించాలి. తర్వాత కడిగేయాలి. ఇది మీ కురులకి లేత గోధుమ రంగుని ఇస్తుంది.
బ్లాక్ టీ
బ్లాక్ టీలో టానిన్‌లు ఉంటాయి. ఇది జుట్టుని తేలికపరుస్తుంది. రెండు కప్పుల నీటిలో 4 టీ బ్యాగులను వేసి నీటిని చిక్కబడనివ్వాలి. లేదా రెండు కప్పు నీటిని స్టవ్‌పైన పెట్టి రెండు స్పూన్ల టీ పౌడర్ వేసి చిక్కగా అయ్యేవరకు మరగనివ్వాలి. తర్వాత దీనిని జుట్టుకి అప్లై చేసుకోవాలి. 30 నిమిషాల తర్వాత మామూలు నీటితో కడిగేసుకున్నట్లయితే మీ జుట్టుకి తాత్కాలికంగా నలుపు రంగు వస్తుంది. అయితే ఈ బ్లాక్‌టీలో హెన్నాను కలిపి తలకు పట్టించినా ప్రయోజనం ఉంటుంది.

సేజ్ ఆకులు
అద్భుతమైన ఔషధ గుణాలు కలిగిన సేజ్ ఆకులు జుట్టుకి ముదురు రంగుని ఇస్తాయి. రెండు కప్పుల నీటిలో సేజ్ ఆకులను ఉడకబెట్టాలి. నీళ్ల రంగు ముదురుగా అయిన తర్వాత జుట్టుకి అప్లై చేసుకోవాలి. రెండు గంటల తర్వాత కడిగేసుకోవాలి. ఇలా చేయడం ద్వారా జుట్టు మరింత నల్లగా మారి ఆకర్షణీయంగా ఉంటుంది.
ఈ సహజ పద్ధతులను పొడి జుట్టుపై మాత్రమే ఉపయోగించాలి. వాడే ముందు తలకి నూనె అప్లై చేసుకోకూడదు. తలస్నానం సమయంలో షాంపూ వాడకూడదు. మామూలుగా జుట్టు కడిగేయాలి. షాంపూ వాడినట్లయితే త్వరగా రంగు వెలిసిపోతుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications