Latest Updates
-
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.!
పీరియడ్స్ వేళ అమ్మాయిలు తెలియకుండా చేసే తప్పులు! వెంటనే ఆపకపోతే సమస్యలు తప్పవు
ప్రతి అమ్మాయి జీవితంలో సాధారణమైన అంశం పీరియడ్స్. ప్రతి నెలా వచ్చే రుతుక్రమం ప్రతి మహిళ జీవితంలో ఓ భాగం అయినప్పటికీ.. ఇప్పటికీ దాని చుట్టూ ఎన్నో అనుమానాలు, అపోహలు ఉన్నాయి. రుతుక్రమం చుట్టూ అల్లుకున్న ఆచారాల వల్ల దాని గురించి బహిరంగంగా చర్చించలేని పరిస్థితి. రుతుక్రమం సమయంలో పరిశుభ్రంగా ఉండటం చాలా అవసరం. కానీ కొందరు మహిళలు వారికి తెలియకుండానే కొన్ని పొరపాట్లు చేస్తుంటారు.

పీరియడ్స్ సమయంలో చేసే కొన్ని పొరపాట్ల వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి. పరిశుభ్రంగా ఉండాల్సిన ఈ సమయంలో లేనిపోని అనుమానాలు, అపోహలతో సమస్యలు కొనితెచ్చుకుంటారు. పీరియడ్స్ సమయంలో సాధారణంగా జరిగే పొరపాట్లు ఏమిటి వాటిని ఎలా నివారించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
1. సెంటెడ్ శానిటరీ ప్యాడ్స్ ఉపయోగించడం:
సెంటెడ్ శానిటరీ ప్యాడ్స్ వల్ల లాభాల కంటే సమస్యలే ఎక్కువ. పీరియడ్స్ వేళ సాధారణ ప్యాడ్స్ వాడటమే మేలు. పీరియడ్ బ్లీడింగ్ చికాకుగా ఉందని కొందరు సెంటెడ్ ప్యాడ్స్ వాడటం వల్ల ఇతర సమస్యలు వస్తాయి. సెంటెడ్ శానిటరీ ప్యాడ్లను వాడటం వల్ల యోని ప్రాంతంలో ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఇందులోని రసాయనాలు చికాకును, దురదను, వాపును కలిగిస్తాయి. ఈస్ట్ ఇన్ఫెక్షన్ కు కారణం అవుతాయి.
2. టాంపోన్ ధరించి నిద్రపోవడం:
శానిటరీ ప్యాడ్స్ కు బదులు కొంత మంది టాంపోన్ వాడుతుంటారు. యోనిలోపల టాంపోన్ పెట్టుకోవడం వల్ల బ్లీడింగ్ ను అది శోషించుకుంటుంది. అయితే టాంపోన్ ను ఎక్కువ సేపు అలాగే ఉంచుకోవడం మంచిది కాదని చెబుతున్నారు వైద్యులు. కొంత మంది యోనిలో టాంపోన్ ఉంచుకుని రాత్రి నిద్రపోతుంటారు. దీని వల్ల రాత్రి బ్లీడింగ్ అవ్వకుండా ఉంటుందనుకుంటారు. అయితే ప్రతి 4-6 గంటలకు ఒకసారి టాంపోన్ మార్చుకోవాలని వైద్యులు చెబుతున్నారు. ఎక్కువ సేపు టాంపోన్ ను ఉంచుకోవడంవల్ల బ్యాక్టీరియా చేరే అవకాశం ఉందని చెబుతున్నారు.
3. పీరియడ్స్ సమయంలో స్నానం చేయకపోవడం:
కొంత మంది స్త్రీలు పీరియడ్స్ సమయంలో స్నానం చేయకుండా ఉంటారు. అలసట, నొప్పి లాంటి కారణాల వల్ల కొంత మంది స్నానం చేయరు. పీరియడ్స్ వేళ వచ్చే బ్లీడింగ్ ను శుభ్రం చేసుకోవడం చాలా ముఖ్యం. స్నానం చేయకపోతే యోని ప్రాంతంలో మరింత చికాకుగా ఉంటుంది. అందుకే రోజుకొకసారి తప్పకుండా వీలైతే రెండు సార్లు స్నానం చేయాలి.
4. ఆరోగ్యకరమైన ఆహారం తినకపోవడం:
పీరియడ్స్ వేళ పౌష్టికాహారాన్ని తినాలని వైద్యులు సూచిస్తుంటారు. రుతుక్రమం వేళ త్వరగా అలసిపోతారు, శక్తి లేక నీరసించపోతారు. కాబట్టి శక్తి కోసం మంచి సమతుల్య ఆహారం తినాలని వైద్యులు సూచిస్తున్నారు. కెఫిన్, శీతలపానీయాలు, జంక్ ఫుడ్స్, ప్రాసెస్డ్, ప్యాకేజ్డ్ ఫుడ్స్ కు దూరంగా ఉండాలి. అదే సమయంలో సీజనల్ ఫ్రూట్స్, కూరయగాలు పుష్కలంగా తినాలి.
5. పీరియడ్స్ సమయంలో సెక్స్:
పీరియడ్స్ సమయంలో సెక్స్ చేస్తే గర్భం ధరించరని కొంత మందిలో అపోహ ఉంటుంది. కానీ రుతుక్రమంలో సెక్స్ చేయడం వల్ల కూడా ప్రెగ్నెన్సీ రావొచ్చు. ఇది చాలా అరుదుగా జరుగుతుంది. అలాగే బ్లీడింగ్ అవుతున్నప్పుడు సెక్స్ అసౌకర్యంగా అనిపిస్తుంది. అందుకే సెక్స్ కు ముందు యోని ప్రాంతాన్ని శుభ్రం చేసుకోవాలి. అలాగే సెక్స్ తర్వాత కూడా శుభ్రం చేసుకోవాలి. దీని వల్ల చికాకుగా అనిపించదు. అలాగే కండోమ్ లాంటివి ధరించడం మంచిదని వైద్యుల సూచన.
6. పీరియడ్స్ వేళ సోపులు, క్లెన్సర్ తో శుభ్రం చేసుకోవడం:
యోని ప్రాంతాన్ని శుభ్రం చేసుకోవడానికి నీటి కంటే ఉత్తమమైనది మరొకటి లేదు. స్వచ్ఛమైన నీటితో శుభ్రం చేసుకుంటే చాలు. ఒకవేళ సోపులు, క్లెన్సర్లు వాడాలనిపిస్తే తక్కువ pH ఉన్నవాటిని మాత్రమే ఎంచుకోవాలి. అలాగే ఫంగల్ లేదా ఈస్ట్ ఇన్ఫెక్షన్లు ఉంటే సోపులు, క్లెన్సర్లు వాడకపోవడమే మంచిది.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications