Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
కుక్క కరిస్తే వెంటనే ఏం చేయాలి? నాకినా కూడా ప్రాణంతకమేనా!
ఇటీవల కాలంలో వీధి కుక్కల దాడులు పెరిగిపోయాయి,గ్రామాల్లోనే కాకుండా ఢిల్లీ,హైదరాబాద్ వంటి మహానగరాల్లో కూడా కుక్కల దాడులు పెరిగిపోయాయి. అయితే చాలా వీధి కుక్కలకు రేబిస్ వ్యాక్సిన్ వేయకపోవడం వల్ల వాటి కాటు ప్రాణాంతకంగా మారుతోంది. అయితే కుక్క కాటు మాత్రమే కాదు దాని లాలాజలం కూడా మన ప్రాణాలకు ముప్పు తలపెట్టగలదని మీకు తెలుసా?
కుక్క లాలాజలం ప్రాణం తీస్తుందా?
సాధారణంగా కుక్క కరిస్తేనే ప్రమాదం అనుకుంటాం. కానీ ఉత్తరప్రదేశ్‌లోని బదౌన్‌లో రెండేళ్ల పాపను ఒక కుక్క నాకడం వల్ల రేబిస్ సోకి చనిపోయిన ఘటన అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. కుక్క లాలాజలంలో కూడా రేబిస్ వైరస్ తో పాటు పాశ్చురెల్లా, కాప్నోసైటోఫాగా కానిమోర్సస్, స్టెఫిలోకాకస్ వంటి అనేక ప్రమాదకరమైన బ్యాక్టీరియాలు ఉంటాయి. మన శరీరంలో ఏదైనా చిన్న గాయం, గీరుకుపోయిన చర్మం, కళ్ళు, ముక్కు లేదా నోటి ద్వారా ఈ లాలాజలం ప్రవేశిస్తే వైరస్ నేరుగా రక్తంలో కలిసి విషంలా వ్యాపిస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని దెబ్బతీసి ప్రాణాంతక ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది.

సబ్బు, నీటితో గాయాన్ని కడిగితే సరిపోతుందా?
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం కుక్క కరిచిన వెంటనే ఆ గాయాన్ని సబ్బు, నీటితో కనీసం 15 నిమిషాల పాటు శుభ్రంగా కడగాలి. ఇది ప్రాథమిక ట్రీట్మెంట్ లో చాలా ముఖ్యమైన దశ. సబ్బులోని క్షార గుణం వైరస్ ను కొంతవరకు బలహీనపరుస్తుంది. సబ్బు నీటితో శుభ్రం చేయడం వల్ల దాని ప్రభావం తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.
అయితే ఇది మాత్రమే సరిపోతుందని భావిస్తే పొరపాటే. ఇది కేవలం తక్షణ ఉపశమన చర్య మాత్రమే. గాయాన్ని శుభ్రం చేయడం వల్ల వైరస్ వ్యాప్తిని కొంతవరకు అడ్డుకోవచ్చు కానీ, రేబిస్‌ను పూర్తిగా నివారించలేదు. నిర్లక్ష్యం చేస్తే ఈ వైరస్ నెమ్మదిగా నరాల ద్వారా మెదడుకు చేరి ప్రాణానికే ముప్పు తెస్తుంది.
రేబిస్ లక్షణాలు ఎలా ఉంటాయి?
వైరస్ శరీరంలోకి ప్రవేశించాక జ్వరం, తలనొప్పి, ఆందోళన వంటి లక్షణాలు కనిపిస్తాయి. వ్యాధి ముదిరేకొద్దీ నీళ్లంటే భయం (హైడ్రోఫోబియా), కండరాల నొప్పులు, మానసిక గందరగోళం, తీవ్రమైన దూకుడు ప్రవర్తన వంటి భయంకరమైన లక్షణాలు బయటపడతాయి.
కుక్క కరిస్తే తక్షణమే చేయాల్సిన పనులు
-గాయాన్ని సబ్బు,ప్రవహించే నీటితో కనీసం 15 నిమిషాల పాటు ధారగా కడుక్కోవాలి.
-గాయంపై ఎలాంటి కట్లు, పసర్లు, కారప్పొడి వంటివి పెట్టకూడదు.
-ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే దగ్గర్లోని గవర్నమెంట్ లేదా ప్రైవేట్ హాస్పిటల్ కి వెళ్లాలి.
-డాక్టర్ సలహా మేరకు యాంటీ రేబిస్ వ్యాక్సిన్, అవసరమైతే ఇమ్యునోగ్లోబులిన్ ఇంజెక్షన్ తప్పనిసరిగా తీసుకోవాలి. రేబిస్ 100శాతం ప్రాణాంతకమైన వ్యాధి, కానీ సరైన సమయంలో చికిత్స తీసుకుంటే 100శాతం నివారించవచ్చు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications