చర్మ అలెర్జీలకు గుడ్ బై!.. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని బెస్ట్ న్యాచురల్ రెమెడీస్ ఇవే!

వాతావరణంలో తరచుగా వచ్చే మార్పుల వల్లనో లేదా దుమ్ము, ధూళి వల్లనో అకస్మాత్తుగా చర్మం ఎర్రబడటం, పొడిబారిపోవడం, విపరీతమైన దురద పెట్టడం వంటి సమస్యలు తరచుగా మనల్ని వేధిస్తుంటాయి. ఇవన్నీ చర్మ అలెర్జీకి సంకేతాలు. మన రోగనిరోధక వ్యవస్థ బలహీనపడినప్పుడు, అలెర్జీ కారకాలకు గురైనప్పుడు చర్మం ఈ విధంగా ప్రతిస్పందిస్తుంది. ఎరుపుదనం, వాపు, దద్దుర్లు, చర్మం పొలుసులుగా రాలడం వంటివి దీని ప్రధాన లక్షణాలు.

అలెర్జీలకు కారణమయ్యే వాటికి దూరంగా ఉండటం ఎంత ముఖ్యమో, వచ్చినప్పుడు వాటిని తగ్గించుకోవడం కూడా అంతే ముఖ్యం. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చర్మ అలెర్జీల నుండి తక్షణ ఉపశమనం కలిగించే కొన్ని అద్భుతమైన న్యాచురల్ రెమెడీస్ ఇక్కడ చూడండి.

Struggling with Sudden Skin Allergies Cure Them Naturally with Zero Side Effects

కలబంద

చర్మానికి చల్లదనాన్ని ఇవ్వడంలో కలబందకు లేదా అలోవెరాకు సాటిలేదు. దద్దుర్లు, దురద ఉన్న చోట తాజా కలబంద గుజ్జును రాస్తే తక్షణ ఉపశమనం లభిస్తుంది.

ఓట్స్ ప్యాక్

ఓట్స్‌ లో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు మెండుగా ఉన్నాయి. కొద్దిగా ఓట్స్ పొడిలో పెరుగు, తేనె కలిపి ముఖంపై దద్దుర్లు ఉన్నచోట ప్యాక్‌ లా వేసుకోండి. ఫేస్ అలెర్జీలకు ఇది దివ్యౌషధం.

బేకింగ్ సోడా

చర్మం pH స్థాయిలలో అసమతుల్యత ఏర్పడినప్పుడు అలెర్జీలు వస్తాయి. కొద్దిగా బేకింగ్ సోడాను నీటిలో కలిపి పేస్ట్‌ లా చేసి ప్రభావిత ప్రాంతంలో రాస్తే అలెర్జీలు ఇట్టే మాయమవుతాయి.

చికెన్ బిర్యానీ తిన్నా షుగర్, బరువు పెరగకుండా ఉండాలంటే ఇలా చేయండి!చికెన్ బిర్యానీ తిన్నా షుగర్, బరువు పెరగకుండా ఉండాలంటే ఇలా చేయండి!

తులసి

మన ఇంట్లో ఉండే తులసి ఎగ్జిమా వంటి పొడి చర్మ సమస్యలను అద్భుతంగా నివారిస్తుంది. తులసి ఆకుల రసాన్ని పూయడం వల్ల చర్మంపై ఎరుపుదనం, వాపు, చికాకు తగ్గుముఖం పడతాయి.

అవిసె గింజల కాపడం

అవిసె గింజలను కొద్దిగా వేడి చేసి, ఒక శుభ్రమైన వస్త్రంలో మూటగట్టి దద్దుర్లు ఉన్నచోట మెల్లగా కాపడం పెట్టాలి. ఇందులోని వాపు నిరోధక గుణాలు అన్నిరకాల చర్మ సమస్యలను దూరం చేస్తాయి.

మెంతుల స్నానం

మెంతులు ఎగ్జిమా, తేలికపాటి వాపులను తగ్గించడంలో సహాయపడతాయి. మెంతులను నీటిలో బాగా ఉడకబెట్టి, ఆ నీటితో స్నానం చేస్తే శరీరమంతా ఉన్న అలర్జీలు తగ్గుతాయి.

చమోమిలే లేదా బబునా పువ్వు

బబునా పువ్వుల రసం లేదా నూనెను పైపూతగా వాడితే చర్మపు వాపు, తామర, దద్దుర్ల నుండి మంచి ఫలితం ఉంటుంది.

సేజ్ ఆయిల్

ఔషధ గుణాలున్న సేజ్ మొక్క నుండి తీసిన నూనెను చేతులు, కాళ్ళకు లేదా దురదగా ఉన్న ప్రాంతాల్లో రాసుకుంటే చర్మానికి సాంత్వన కలుగుతుంది.

మరికొన్ని మూలికలు

చిన్నపాటి వాపులు, చీము కారే దద్దుర్లు, గజ్జిని నివారించడంలో ఓక్ బెరడు(సిందూర చెట్టు బెరడు) అద్భుతంగా పనిచేస్తుంది. ప్రకృతి మనకందించిన ఈ సహజ సిద్ధమైన చిట్కాలు పాటిస్తే చర్మ అలెర్జీల నుంచి సులభంగా బయటపడవచ్చు. అయితే ఒకవేళ సమస్య తీవ్రంగా ఉండి రోజుల తరబడి తగ్గకపోతే మాత్రం డెర్మటాలజిస్ట్ ని సంప్రదించడం బెటర్.

Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.

Story first published: Wednesday, September 9, 2026, 16:57 [IST]
Desktop Bottom Promotion