Latest Updates
-
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా?
థైరాయిడ్ సమస్యలకు సంజీవని.. డాక్టర్ సుజిత్ చెప్పిన అద్భుత పరిష్కారం
థైరాయిడ్ అనేది మన మెడలో సీతాకోకచిలుక ఆకారంలో ఉండే ఒక ముఖ్యమైన గ్రంధి. ఇది థైరాక్సిన్ (T-4,ట్రైయోడోథైరోనిన్ (T-3) వంటి హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. ఈ హార్మోన్లు మన శరీర జీవక్రియ, అభివృద్ధి,ఇతర కీలకమైన విధులను నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. థైరాయిడ్ గ్రంధి సరిగా పనిచేయకపోతే అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. థైరాయిడ్ సమస్యలు ప్రధానంగా రెండు రకాలుగా ఉంటాయి. అవి హైపోథైరాయిడిజం.. థైరాయిడ్ గ్రంధి తగినంత హార్మోన్లను ఉత్పత్తి చేయనప్పుడు ఈ పరిస్థితి ఏర్పడుతుంది. దీనివల్ల శరీర జీవక్రియ మందగిస్తుంది. రెండోది..హైపర్ థైరాయిడిజం.. థైరాయిడ్ గ్రంధి అవసరానికి మించి ఎక్కువ హార్మోన్లను ఉత్పత్తి చేసినప్పుడు ఈ పరిస్థితి వస్తుంది. దీనివల్ల శరీర జీవక్రియ వేగవంతం అవుతుంది.
ప్రస్తుతం మారిన జీవనశైలి కారణంగా అనేకమంది థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారు. థైరాయిడ్ సమస్యలున్నప్పుడు, ఆహారం చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. సరైన ఆహారం థైరాయిడ్ పనితీరుకు మద్దతు ఇస్తుంది, లక్షణాలను తగ్గిస్తుంది, మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అయితే ఒకే ఒక్క ఫుడ్ తో థైరాయిడ్ సమస్యకు చెక్ పెట్టవచ్చని హోమియోపథిక్ ఫిజిషియన్ డాక్టర్ సుజిత్ తెలగంశెట్టి తెలిపారు.

డాక్టర్ సుజిత్ తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఓ వీడియోలో..మయో ఐనాసిటాల్(Myo-inositol), సెలీనియం(Selenium)ఈ రెండూ కలిపి తీసుకుంటే థైరాయిడ్ సమస్యకు చెక్ పెట్టవచ్చని డాక్టర్ సుజిత్ చెప్పారు. థైరాయిడ్ లోపల ఉండే సెల్స్ సిగ్నలింగ్ పాథ్ వేస్ ని మెరుగుపరుస్తుంది..ఇవి మెరుగుపడితే TSH బెటరవుతుంది..టీఎస్హెచ్ మెరుగుపడితే T3,T4 లాంటి థైరాయిడ్ హార్మోన్ ప్రొడక్టన్ బెటరవుతుంది..దీని వల్ల ప్రతి రోజూ తీసుకునే సింథటికల్ ప్రిపేర్డ్ హార్మోన్ ట్యాబ్లెడ్ ఢిపెండెన్సీ తగ్గిపోతుందని తీంతో థైరాయిడ్ హెల్త్ చాలా బెటర్ అవుతుందని చెప్పారు. ఒక్క ముక్కలో చెప్పాలో చెప్పాలంటే ట్యాబ్లెట్లు వేసుకునే బాధ క్రమంగా తగ్గిపోతుందని చెప్పారు.
అంతేకాకుండా దీంతో బరువు కంట్రోలో లో ఉంటుందని, జుట్టు రాలడం కంట్రోల్ అవుతుందని, మల్లబద్దకం సమస్య కంట్రోల్ అవుతుందని, చాలా యాక్టివ్ గా అనిపిస్తుందని డాక్టర్ సుజిత్ చెప్పారు. అయితే ఈ మయో ఐనొసిటాల్..బార్లీ, బ్రౌన్ రైస్, ఓట్స్ లో ఉంటదని డాక్టర్ సుజీత్ చెప్పారు. పండ్లలో..ఆరెంజ్, బీన్స్, శెనగల్లో ఉంటదని తెలిపారు. థైరాయిడ్ కి ఇది సంజీవని లాంటిదని చెప్పారు.
సెలీనియం
థైరాయిడ్ హార్మోన్లను T4 నుండి T3 గా మార్చడానికి, థైరాయిడ్ గ్రంధిని ఆక్సీకరణ నష్టం నుండి రక్షించడానికి సెలీనియం అవసరమని డాక్టర్ సుజీత్ చెప్పారు. బ్రెజిల్ నట్స్ సెలీనియానికి అత్యంత ధనిక వనరు. ఇవి రోజుకు 1-2 గింజలు సరిపోతాయి, అంతకు మించి వద్దు. సార్డినెస్, ట్యూనా వంటి చేపలు, గుడ్లు కూడా మంచి సెలీనియం వనరు. మాంసంలో,పుట్టగొడుగుల్లో కూడా సెలీనియం ఉంటుంది.
థైరాయిడ్ సమస్య ఉన్నవారు దూరంగా ఉండాల్సిన ఆహారాలు
గోయిట్రోజెన్స్: ఇవి థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తికి అంతరాయం కలిగించవచ్చని డాక్టర్లు చెబుతున్నారు. క్యాబేజీ, కాలీఫ్లవర్, బ్రోకలీ, బ్రస్సెల్స్ మొలకలు, కాలే వంటి క్రూసిఫెరస్ కూరగాయలు ఈ కోవలోకి వస్తాయి. అయితే వీటిని వండినప్పుడు గోయిట్రోజెనిక్ ప్రభావం తగ్గుతుంది. థైరాయిడ్ సమస్య ఉన్నవారు వీటిని పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు కానీ పచ్చిగా కాకుండా వండుకుని మితంగా తీసుకోవాలని చెబుతున్నారు.
సోయా ఉత్పత్తులు: సోయాలో ఉండే ఐసోఫ్లేవోన్స్ థైరాయిడ్ మందుల శోషణకు ఆటంకం కలిగించవచ్చు. సోయా పాలు, టోఫు, సోయాబీన్స్‌కు దూరంగా ఉండాలి లేదా థైరాయిడ్ మందులు తీసుకున్న సమయానికి చాలా గ్యాప్ ఇవ్వాలి.
గ్లూటెన్: కొంతమంది థైరాయిడ్ రోగులకు, ముఖ్యంగా హాషిమోటోస్ థైరాయిడిటిస్ ఉన్నవారికి గ్లూటెన్ సెన్సిటివిటీ ఉంటుంది. వీరు గోధుమ, బార్లీ, రై వంటి గ్లూటెన్ ఉన్న ఆహారాలకు దూరంగా ఉండటం మంచిది.
ప్రాసెస్ చేసిన ఆహారాలు: వీటిలో అనవసరమైన చక్కెర, ఉప్పు, అనారోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇవి బరువు పెరగడానికి, వాపుకు దారితీసి థైరాయిడ్ లక్షణాలను తీవ్రతరం చేస్తాయి.
అధిక చక్కెర ఆహారాలు: మిఠాయిలు, సోడాలు, తీపి పదార్థాలు బరువు పెరగడానికి కారణమవుతాయి, ఇది హైపోథైరాయిడిజం ఉన్నవారికి అదనపు సమస్య.

కాఫీ: థైరాయిడ్ మందులతో కాఫీ సంకర్షణ చెంది మందుల శోషణను తగ్గించవచ్చు. ట్యాబ్లెట్స్ వేసుకున్న తర్వాత కనీసం అరగంట లేదా ఒక గంట వరకు కాఫీ తాగకూడదు.
మిల్లెట్స్: కొన్ని రకాల మిల్లెట్స్ (ముఖ్యంగా పచ్చివి) థైరాయిడ్ పనితీరుపై ప్రతికూల ప్రభావం చూపగలవని కొన్ని పరిశోధనలు సూచిస్తున్నాయి.
థైరాయిడ్ సమస్యలకు కారణాలు ఇవే
థైరాయిడ్ సమస్యలకు అనేక కారణాలు ఉండవచ్చు,అందులో కొన్ని ప్రధానమైనవి ఇక్కడ చూడండి.
హషిమోటోస్ థైరాయిడిటిస్: ఇది హైపోథైరాయిడిజంకు అత్యంత సాధారణ కారణం. శరీర రోగనిరోధక వ్యవస్థ పొరపాటున థైరాయిడ్ గ్రంధిపై దాడి చేసి దానిని దెబ్బతీస్తుంది.
గ్రేవ్స్ వ్యాధి: ఇది హైపర్ థైరాయిడిజంకు అత్యంత సాధారణ కారణం. శరీర రోగనిరోధక వ్యవస్థ థైరాయిడ్ గ్రంధిని అధిక హార్మోన్లను ఉత్పత్తి చేయమని ప్రేరేపిస్తుంది.
అయోడిన్ లోపం లేదా అధికం: థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తికి అయోడిన్ అవసరం. అయోడిన్ లోపం గాయిటర్,హైపోథైరాయిడిజంకు దారితీస్తుంది. అయోడిన్ అధికంగా తీసుకోవడం కూడా సమస్యలను సృష్టించవచ్చు.

జన్యుపరమైన అంశాలు: కుటుంబంలో థైరాయిడ్ సమస్యల చరిత్ర ఉంటే, మీకు కూడా వచ్చే అవకాశం ఉంది.
హార్మోన్ల మార్పులు: ర్భధారణ సమయంలో, ప్రసవం తర్వాత లేదా రుతువిరతి సమయంలో హార్మోన్ల స్థాయిలలో మార్పులు థైరాయిడ్ సమస్యలకు దారితీయవచ్చు.
కొన్ని మందులు: లిథియం, అమియోడారోన్ వంటి కొన్ని మందులు థైరాయిడ్ పనితీరును ప్రభావితం చేయవచ్చు.
రేడియేషన్: మెడ లేదా తల భాగంలో రేడియేషన్ థెరపీ తీసుకున్నవారికి థైరాయిడ్ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.
వైరల్ ఇన్ఫెక్షన్లు: కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్లు థైరాయిడిటిస్ (థైరాయిడ్ గ్రంధి వాపు) కు దారితీయవచ్చు.
థైరాయిడ్ సమస్యల లక్షణాలు
థైరాయిడ్ రకాన్ని బట్టి లక్షణాలు మారుతూ ఉంటాయి
హైపోథైరాయిడిజం లక్షణాలు
బరువు పెరగడం
తీవ్రమైన అలసట, నీరసం, నిద్రమత్తు
చలిని తట్టుకోలేకపోవడం
పొడి చర్మం, పెళుసైన గోర్లు, జుట్టు రాలడం
మలబద్ధకం
డిప్రెషన్, ఆందోళన, ఏకాగ్రత లోపించడం
కండరాల నొప్పి, బలహీనత, తిమ్మిర్లు
గుండె కొట్టుకునే వేగం తగ్గడం
స్త్రీలలో రుతుక్రమ సమస్యలు
గొంతు పైన వాపు
హైపర్ థైరాయిడిజం లక్షణాలు
బరువు తగ్గడం
వేడిని తట్టుకోలేకపోవడం, అధిక చెమట పట్టడం
గుండె దడ, వేగవంతమైన హృదయ స్పందన
ఆందోళన, చిరాకు, మానసిక కల్లోలం, నరాల బలహీనత
చేతులు వణుకు
నిద్రలేమి
తరచుగా ప్రేగు కదలికలు, కొన్నిసార్లు అతిసారం
కళ్ళ చుట్టూ వాపు లేదా కళ్ళు ముందుకు చొచ్చుకు రావడం
కండరాల బలహీనత
స్త్రీలలో రుతుక్రమ సమస్యలు
మెడలో వాపు
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications