Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
బోద్దింక పాలతో బోలెడు ప్రయోజనాలు ఉన్నాయా? గేదె, ఆవు,తల్లి పాల కన్నా 3 రెట్లు ఎక్కువ..
సాధారణంగా మనందరికీ ఆవు పాలు, గేదె పాలు లేదా గాడిద పాలు, ఒంటె పాలు, వాటి ప్రయోజనాల గురించి తెలిసిందే. అయితే మీరెప్పుడైనా బొద్దింక పాల గురించి విన్నారా? కొంతమంది బొద్దింకను చూస్తేనే అసహ్యించుకుంటూ పక్కకు వెళ్లిపోతుంటారు. అయితే ఆ బొద్దింక ఇచ్చే పాలు తాగితే మంచిది అంటే ఛీ.. యాక్ అనకుండా ఉండలేరు. అయితే బొద్దింకల పాల గురించి జరిగిన ఓ పరిశోధనలో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. గేదె, ఆవు పాలకన్నా,తల్లిపాల కన్నా బొద్దింక పాలలో మూడు రెట్లు ఎక్కువ పోషకాలు ఉన్నాయని సైంటిస్టులు కనుగొన్నారు.
2016 నాటి పరిశోధనలో భాగంగా ఆడ పసిఫిక్ బీటిల్ బొద్దింకలు తమ పిల్లలను పోషించడానికి ఉత్పత్తి చేసే పాలు లాంటి పదార్థాన్ని సైంటిస్టులు అధ్యయనం చేశారు. జర్నల్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ క్రిస్టలోగ్రఫీలో ఈ పరిశోధన వివరాలు ప్రచురించబడ్డాయి. బొద్దింకల పాలు భూమిపై అత్యంత పోషక సాంద్రత కలిగిన పదార్థాలలో ఒకటి కావచ్చని వారి పరిశోధన సూచించింది. సాంప్రదాయ పాలలా కాకుండా బొద్దింక పాలు పసుపు రంగు ద్రవంగా ఉంటుంది..ఇది బొద్దింక పిల్లల కడుపులో స్ఫటికీకరిస్తుంది. బొద్దింకల నుంచి పాల రూపంలో వచ్చే ప్రత్యేకమైన స్ఫటిక ప్రోటీన్ శరీరానికి అవసరమైన అన్ని ముఖ్యమైన అమైనో ఆమ్లాలతో నిండి ఉంటుందట..అంతేకాకుండా ఆరోగ్యకరమైన కొవ్వులు, చక్కెరలు కూడా ఇందులో లభిస్తాయి.

బొద్దింక పాలలో ఇవి పుష్కలంగా
సాధారణంగా 100 గ్రాముల ఆవు పాలు కేవలం 66 కేలరీల శక్తినే అందిస్తాయి..అయితే పరిశోధనల ప్రకారం 100 గ్రాముల బొద్దింక పాలు శరీరానికి 232 కేలరీల శక్తిని అందిస్తాయి. బొద్దింక పాలలో 45% ప్రోటీన్, 16-22% వరకు కొవ్వు, 25% కార్బోహైడ్రేట్లు, 5% అమైనో ఆమ్లాలు కూడా ఉంటాయని పరిశోధకులు తెలిపారు. అలాగే బొద్దింక పాలలో ఒలేయిక్ ఆమ్లం, లినోలెయిక్ ఆమ్లం, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయని తెలిపారు. ఇది శరీరానికి అత్యవసరమైన ప్రోటీన్ గా ఉపయోగపడుతుందని పరిశోధకులు తెలిపారు.
సంప్రదాయ పాలను బొద్దింక పాలు రిప్లేస్ చేస్తాయా
చాలా మంది పాలు జీర్ణకాక ఇబ్బంది పడుతుంటారు. లాక్టోస్‌ను జీర్ణం చేసే లాక్టేజ్ ఎంజైమ్ ప్రపంచ జనాభాలో సుమారు 65శాతం మందిలో లేని కారణంగా వారికి పాలు తాగితే ఉబ్బరం, అజీర్ణం, వికారం, విరేచనాలు లాంటి సమస్యలు వస్తాయి. అయితే బొద్దింక పాలలో లాక్టోస్ ఉండదు. అందువల్ల ఇది లాక్టోస్ అసహన సమస్య ఉన్నవారికి ఓ మంచి ప్రత్యామ్నాయంగా మారొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. బొద్దింకల పాలు మార్కెట్లో ఇంకా వినియోగానికి అందుబాటులో లేనప్పటికీ భవిష్యత్తులో బొద్దింక పాలు ఒక ముఖ్యమైన ప్రత్యామ్నాయ ఆహార వనరుగా మారవచ్చని చెబుతున్నారు.
అయితే బొద్దింకల నుంచి పాలు సేకరించడం అంత ఈజీ పని కాదు. ఈ ప్రత్యేకమైన పాల సరఫరా బొద్దింకల పేగుల్లో ఉండే పదార్థాన్ని సేకరించడంపై ఆధారపడి ఉంటుంది. 100 గ్రాముల బొద్దింక పాలను సేకరించేందుకు సుమారు 1000 ఆడ బొద్దింకలను చంపాల్సి వస్తుంది. అయితే బొద్దింక పాలు మానవ వినియోగానికి సురక్షితమైనవని నిరూపించే నిశ్చయాత్మక పరిశోధనలు లేవు. బొద్దింక పాలు తదుపరి సూపర్‌ఫుడ్ ట్రెండ్ గా అనిపించవచ్చు కానీ సాంప్రదాయ పాల ఉత్పత్తులకు ఇది ఆచరణీయమైన ప్రత్యామ్నాయంగా మారడానికి మరిన్ని పరిశోధనలు అవసరం అని నిపుణులు చెబుతున్నారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications