Latest Updates
-
చికెన్, మటన్ బిర్యానీలను మరిపించే స్పైసీ టమాటా బిర్యానీ..కుక్కర్ లో ఈజీగా చేసేయండిలా.. -
తులసి తీర్థం మహిమ? చనిపోయిన మహిళ బతికింది! -
రెస్టారెంట్ రుచిని మించేలా ఇంట్లోనే బిసిబేలే బాత్.. సులభంగా ఎలా చేయాలంటే? -
కరివేపాకు vs వేప ఆకు..పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాల్లో ఏది బెస్ట్ అంటే..! -
నవరాత్రి స్పెషల్: రుచితో పాటు ఆరోగ్యం.. జీర్ణశక్తిని పెంచే అద్భుతమైన తమలపాకు కేసరి ప్రసాదం -
నోరూరించే ఆమ్లెట్ పులుసు.. పుల్లపుల్లగా, కారంకారంగా రుచి అదరహో! -
దీపావళికి ముందే ధ్వజ యోగం.. ఈ 4 రాశుల జాతకులు కోటీశ్వరులు కావడం ఖాయమా? -
నల్ల పాలు తాగుతున్న తెలుగు హీరోయిన్..ప్రయోజనాలేంటో,ఎలా చేసుకోవాలో తెలుసా? -
మటన్ సాంబార్ వండేటప్పుడు ఈ మసాలా పడితే ఆ రుచే వేరు..రాగి సంగటి, చపాతీ,అన్నంలోకి కేక -
రోగనిరోధక శక్తిని పెంచే జామకాయ పచ్చడి.. ఊరనివ్వాల్సిన పనే లేకుండా అప్పటికప్పుడే రెడీ!
ఎండాకాలం కొబ్బరి నీళ్లు తాగితే మంచిదా, చెరుకు రసం తాగితే మంచిదో తెలుసా?
తెలుగు రాష్ట్రాల్లో వేసవి తాపం మొదలైంది. ఎండలు దంచికొడుతుండడంతో చాలా మంది బయటికి రావాలంటేనే జంకుతున్నారు. ఒకవేళ బయటికి వస్తే చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే ఈ ఎండాకాలంలో ఎక్కువగా తాగేది ఏదైనా ఉందంటే అది చెరుకు రసం, అలాగే కొబ్బరి నీళ్లు. ఇవి రోడ్డు పక్కనే దొరుకుతుండడంతో పాటు తక్కువ ధరకు లభిస్తుడడంతో అందరూ వీటిని తాగడానికి ఆసక్తి చూపిస్తుంటారు. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అలాగే రుచి పరంగా కూడా అద్భుతంగా ఉంటాయి.
కొబ్బరి నీళ్లు సహజమైన హైడ్రేటర్‌గా పనిచేస్తూ, ఖనిజాలు, పొటాషియం, సోడియం, మెగ్నీషియం వంటి ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. ఇలాంటి పానీయాలు ముఖ్యంగా ఎక్కువగా చెమటపెట్టే వ్యక్తులకు ఎంతో ఉపయోగకరమైనవి. కొబ్బరి నీళ్లలో పొటాషియం ఉన్నందున ఇది సోడియంను తటస్థం చేస్తుంది. తద్వారా రక్తపోటును తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఇది తక్కువ కేలరీలతో కూడిన పానీయం కాబట్టి ఆకలిని తగ్గించడానికి ఇది చాలా బాగా పని చేస్తాయి. అలాగే షుగర్ జ్యూస్‌తో అనేక లాభాలు ఉన్నాయి. అందుకే ఈ స్టోరీలో ఎండాకాలం కొబ్బరి నీళ్లు తాగితే మంచిదా? చెరుకు రసం తాగితే మంచిదా అనేది తెలుసుకుందాం.

కొబ్బరి నీళ్ల వల్ల లాభాలు
కొబ్బరి నీళ్లలో ఉండే బయోయాక్టివ్ ఎంజైమ్స్ ఆమ్లత సమతుల్యాన్ని కాపాడటంలో సహాయపడతాయి. వీటిలో లారిక్ ఆమ్లం ఉండడం వలన ఇది యాంటీ మైక్రోబయల్గా పనిచేస్తుంది. దాంతో జీర్ణక్రియ మెరుగుపడుతుంది. వీటిలో ఉండే విటమిన్ C రోగనిరోధక శక్తిని పెంచేందుకు సహాయపడుతుంది. ఇది తెల్ల రక్త కణాల ఉత్పత్తిని పెంచి శరీరాన్ని వివిధ వ్యాధుల నుండి రక్షిస్తుంది. మధుమేహం ఉన్నవారికి కొబ్బరి నీళ్లు చాలా ఉపయోగకరమైనవి. ఎందుకంటే ఇవి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. ఈ నీళ్లలోని విటమిన్లు చర్మాన్ని కాలుష్యం నుండి రక్షించడంతో పాటు, ఎండ కారణంగా జరిగే నష్టం తగ్గించడంలో సహాయపడతాయి. ఇవి చర్మాన్ని మృదువుగా ఉంచడానికి కూడా సహాయపడతాయి.
చెరకు రసం వల్ల ఆరోగ్యానికి ప్రయోజనాలు
చెరకు రసంలో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది మలబద్ధకం, ఉబ్బరం వంటి సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది. ఈ రసంలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్ గుణాలు బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లను నివారించడంలో సహాయపడతాయి. ఇది తెల్ల రక్త కణాలను బలపరిచేలా చేస్తుంది. చెరకు రసం ఎముకల ఆరోగ్యాన్ని బలోపేతం చేస్తుంది, ఎముకల వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. కీమోథెరపీ చికిత్సలో, ఈ రసం శరీరంలో ద్రవాలు, ఎలక్ట్రోలైట్లు తిరిగి నింపడానికి సహాయపడుతుంది. అదేవిధంగా, ఇది నిర్జలీకరణను నివారించడానికి, శక్తి స్థాయిలను నిలబెట్టుకోవడంలో కూడా కీలక పాత్ర పోషిస్తుంది. చెరకు రసం మెగ్నీషియం కూడా అందిస్తుంది, ఇది రక్త నాళాలను సడలించడంలో సహాయపడుతుంది.
డయాబెటీస్ ఉన్న వ్యక్తులు
చెరకు రసంలో చక్కెర ఎక్కువగా ఉండటం వలన, ఇది రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది. కాబట్టి, మధుమేహం ఉన్నవారికి ఇది ప్రమాదకరంగా మారే అవకాశాలు ఉన్నాయి. అలాంటి వారికి ఈ రసం తాగించకపోవడం మంచిది. బదులుగా, కొబ్బరి నీళ్లు ఒక సురక్షితమైన ఎంపికగా చెప్పుకోవచ్చు. అలాగే, మూత్రపిండ సమస్యలు లేదా రాళ్లు ఉన్నవారూ కొబ్బరి నీళ్లను తాగే ముందు వైద్యులను సంప్రదించి వారి సలహాలు తీసుకోవడం చాలా మంచిది.
ముగింపు
కొబ్బరి నీళ్లు మరియు చెరకు రసం ఆరోగ్యానికి ఎంతో లాభకరమైనవి. అయితే, వీటిని తాగేటప్పుడు ఆరోగ్య పరిస్థితులను పరిగణలోకి తీసుకోవడం అవసరం. మీ ఆరోగ్య స్థితిని బట్టి వీటిని ఎదో ఒక వాటిని మీరు ఎంచుకోవాల్సి ఉంటుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
