Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
సమ్మర్ లో నిమ్మరసం..చల్లగా ఉందని తాగేస్తున్నారా? అర్జెంట్ గా ఇలా చేయకపోతే పెద్ద డేంజర్!
సమ్మర్ వచ్చిందంటే చాలు నిమ్మకాయలకు ఫుల్ డిమాండ్ పెరిగిపోతుంది. ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం చాలామంది చల్లటి నిమ్మరసం తాగుటుంటారు. నిమ్మకాయ నీరు తాగడం ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు కూడా చెబుతున్నారు. వేసవిలో నిమ్మకాయ ఒక దివ్యౌషధంగా పనిచేస్తుంది. ఇది శరీరంలో హైడ్రేషన్ లోపాన్ని తొలగించడంలో సహాయపడుతుంది. శరీరానికి చల్లదనాన్ని అందించడంతో పాటు మీ ఆరోగ్యానికి అనేక విధాలుగా ప్రయోజనం చేకూరుస్తుంది. నిమ్మకాయలలో విటమిన్ సి, విటమిన్ ఈ, విటమిన్ బి-6 వంటి అనేక పోషకాలు ఉంటాయి. విటమిన్ సి అధికంగా ఉండటం వల్ల, ఇది శరీర రోగనిరోధక శక్తిని పెంచుతుంది, జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. అయితే అధికంగా తీసుకుంటే అనేక ఇబ్బందులు కూడా తలెత్తడం గ్యారెంటీ.
నిమ్మరసంతో కలిగే కొన్ని ప్రయోజనాలు
శరీరాన్ని హైడ్రేటెడ్ గా
వేసవి కాలంలో శరీరంలో నీటి లోపం ఉండవచ్చు. నిమ్మకాయ నీరు తాగడం వల్ల శరీరంలో నీటి శాతం అదుపులో ఉండి, శరీరం హైడ్రేట్ అవుతుంది. ఇది శరీర నీటి అవసరాన్ని తీర్చే ఎలక్ట్రోలైట్లను కలిగి ఉంటుంది. వేసవిలో శరీరంలో నీటి లోపం వచ్చే ప్రమాదం చాలా ఉంది, ఈ సమయంలో నిమ్మకాయ నీరు తాగడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

బరువు తగ్గడంలో సహాయం
బరువు తగ్గే ప్రక్రియలో ఉన్నవారు నిమ్మరసం తాగవచ్చు. నిమ్మరసం తీసుకోవడం వల్ల శరీర జీవక్రియ పెరుగుతుంది, ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. నిమ్మకాయ నీరు శరీరంలో నిల్వ ఉన్న అదనపు కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది. ఇది కొవ్వును కరిగించే ప్రక్రియను వేగవంతం చేస్తుంది.
చర్మానికి కాంతి
నిమ్మకాయలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి, ఇవి చర్మానికి చాలా మేలు చేస్తాయి. ఇది చర్మ కాంతిని పెంచుతుంది, మొటిమలను తగ్గిస్తుంది,చర్మాన్ని తాజాగా ఉంచుతుంది. నిమ్మరసం రాసుకోవడం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది, దానిని తాగడం కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది చర్మ అలెర్జీలు వంటి అనేక చర్మ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
జీర్ణక్రియ
నిమ్మకాయ నీరు తాగడం వల్ల జీర్ణవ్యవస్థ యాక్టివ్ గా ఉంటుంది. వ్యాధుల నుండి బయటపడటానికి ఉత్తమ మార్గం జీర్ణక్రియను మెరుగుపరచడం. నిమ్మకాయలో ఉండే సిట్రిక్ ఆమ్లం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇది కడుపులో ఆమ్ల సమతుల్యతను కాపాడుతుంది. ఇది అజీర్ణం, గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది.
నిమ్మరసం ఎక్కువగా తీసుకుంటే జరిగేది ఇదే
సమ్మర్ లో నిమ్మకాయ నీళ్లు ఆరోగ్యానికి మేలు చేసినప్పటికీ..అధిక మొత్తంలో తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం అని నిపుణులు చెబుతున్నారు. నిమ్మకాయ నీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఏమవుతుందో ఇక్కడ చూడండి.
-అవసరానికి మించి నిమ్మకాయ నీరు తాగడం వల్ల తరచుగా మూత్ర విసర్జన జరుగుతుంది. దీనివల్ల శరీరంలో హైడ్రేషన్ లోపం కూడా ఏర్పడుతుంది.
-నిమ్మరసాన్ని ఎక్కువగా తీసుకుంటే దంతాలలో జలదరింపు అనుభూతి కలుగుతుంది. ఇది దంతాలపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని, ఇది వేగంగా దంతక్షయానికి దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
-ఖాళీ కడుపుతో నిమ్మకాయ నీళ్ళు తేనెతో కలిపి తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుందని మనం చాలాసార్లు విని ఉంటాం. కానీ దీన్ని అధికంగా తీసుకోవడం వల్ల కడుపుకు సంబంధించిన అనేక సమస్యలు వస్తాయి. దీనివల్ల కడుపు నొప్పి వచ్చే అవకాశం ఉంటుందని నిపుణులు తెలిపారు.
-నిమ్మకాయ నీటిని క్రమం తప్పకుండా ఎక్కువ మొత్తంలో తీసుకోవడం వల్ల చర్మం పొడిబారుతుంది. దీనితో పాటు చర్మం కాంతి పోతుంది.
-నిమ్మరసాన్ని మీ జుట్టుకు నేరుగా రాయకండి. దీనివల్ల జుట్టు పొడిబారిపోతుంది, తెల్ల జుట్టు కూడా వస్తుంది. తరచుగా చుండ్రు సమస్యలను నివారించడానికి ప్రజలు నిమ్మరసాన్ని నేరుగా జుట్టుకు రాసుకుంటారు. కానీ మీరు దానిని నేరుగా నూనెతో తక్కువ మొత్తంలో కలపడం ద్వారా ఉపయోగించవచ్చు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications