Latest Updates
-
అద్భుత శక్తులున్న 4 రామాలయాలు ఇవే! -
చుక్క పాలు లేకుండానే గడ్డ పెరుగు.. ఇలా సులభంగా తయారు చేయండి! -
కర్ణాటక స్టైల్ గ్రీన్ చికెన్ బిర్యానీ.. ఇలా చేస్తే ఫిదా అవ్వాల్సిందే! -
దరిద్రం పోయి అదృష్టం..జూలై 20 నుంచి ఈ 3 రాశులకు తిరుగుండదు! -
పల్లెటూరి స్టైల్ లో మట్టికుండలో చేపల కుర్మా..అన్నం, ఇడ్లీ, దోసె దేనిలోకైనా అదుర్స్! -
కళ్లు ఎర్రబడి, నీరు కారుతోందా? కండ్లకలక లక్షణాలు, నివారణ మార్గాలివే! -
వైజాగ్ లో కథ మాములుగా లేదుగా..దానికోసం ఏఐ తెగ వాడేస్తున్నారంట! -
నానబెట్టే పనిలేదు,పిండి రుబ్బే పనిలేదు.15 నిమిషాల్లో అటుకుల ఇడ్లీ..డయాబెటిస్ ఉన్నవారికీ బెస్ట్ -
శని తిరోగమనం..ఈ 5 రాశుల వాళ్లు ఆ పని చేయకుంటే అగమాగం ఐపోతరు! -
రొటీన్ బజ్జీలు, పకోడీలు బోర్ కొట్టాయా? అయితే ఈసారి పొటాటో లాలిపాప్ ట్రై చేయండి
సమ్మర్ వచ్చేస్తుంది.. ఇప్పుడే ఈ పనులు చేసేయండి, తరువాత చాల కాస్ట్‌లీ అయిపోతాయి!
ఎండాకాలం ప్రారంభమవుతుంది. ఇప్పటి నుంచే ఎండల ప్రభావం మొదలైంది. ఓవైపు చలి, మరోవైపు ఎండ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈసారి కూడా ఎండలు భారీగా ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రజలు ఇప్పటి నుంచే పలు జాగ్రత్తలు తీసుకోకపోతే ఎండ ముదిరే కొద్దీ తీవ్రమైన పరిణామాలను ఎదుర్కునే అవకాశం ఉంటుంది. వడదెబ్బ తగలడం, అనారోగ్యం పాలవడం వంటి సమస్యలకు కారణమవొచ్చు. అసలు సమ్మర్ ప్రారంభానికి ముందే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఆ జాగ్రత్తలు ఏంటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
కూలర్లు, ఏసీలు రిపేర్ చేసుకోండి..
ఈసారి ఎండలు చాలా తీవ్రంగా ఉండే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇంట్లో చల్లని వాతావరణాన్ని సృష్టించుకోవడం చాలా ముఖ్యం. అందుకే ఇప్పుడే మీ ఇంట్లో పాడైపోయిన కూలర్లు, ఏసీలు ఉంటే వెంటనే వాటిని బాగు చేయించుకోండి. ఒకవేళ కొత్తగా కొనాలని అనుకుంటే ఇదే బెస్ట్ టైం. ఎందుకంటే ఒక్కసారి ఎండలు పెరిగిపోయాక వీటికి డిమాండ్ భారీగా ఉంటుంది.

కూల్ పెయింట్స్, పరదాలు
ఇంట్లో ఎంత ఏసీలు ఉన్నా.. రూఫ్ కూల్‌గా ఉండడం చాలా ముఖ్యం. అందుకే ఇంటి రూప్‌పై ఇప్పుడే కూల్ పెయింట్స్ వేసుకోండి. అలాగే గ్రీన్ పరదాలు కప్పుకోండి. దీనివలన సూర్యుడి వేడి నేరుగా స్లాబ్‌ను తాకకుండా హీట్ డైల్యూట్ అవుతుంది. తద్వారా ఎండనుంచి కొంచెం ఉపశమనం పొందవచ్చు.
వెంటిలేషన్ సరిగ్గా ఉంచుకోండి..
ఎండాకాలం ఇంటికి వెంటిలేషన్ అనేది చాలా ముఖ్యం. వెంటిలేషన్ సరిగ్గా లేకపోతే ఇంట్లో హీట్ చాలా పెరిగిపోతుంది. అలాగే ఇంట్లోని ఎయిర్ బయటికి వెళ్లకుండా కూలర్ కూడా పని చేయడం ఆగిపోతుంది. అందుకే ఇంట్లో వెంటిలేషన్ సరిగ్గా ఉండే విధంగా చూసుకోండి. అప్పుడే వడదెబ్బ తగలకుండా ఉంటుంది.
దుస్తులు సిద్ధం
చలికాలం, వర్షాకాలం ఎలాంటి బట్టలు వేసుకున్నా సెట్ అయిపోతాయి. కానీ ఎండాకాలం మాత్రం కొన్ని ప్రత్యేకమైన దుస్తులను వేసుకోవాలి. సన్నటి, కాటన్ దుస్తులను మాత్రమే ధరించాలి. అలాంటప్పుడే వడదెబ్బ బారిన పడకుండా, చెమటకాయలు రాకుండా ఉంటాయి. అలాగే తెల్లటి దుస్తులను ధరించడం వలన ఎండ వేడిమి నుంచి కొంచెం ఉపశమనం పొందవచ్చు. అందుకే మీ దగ్గర ఈ రకమైన దుస్తులు లేకపోతే వాటిని సిద్ధం చేసుకోండి.
దీంతో పాటు ఎండాకాలం నీరు అధికంగా తీసుకోవడం, ఆరోగ్యకరమైన ఆహరం తీసుకోవడం చాలా ముఖ్యం. నీరును ఎంత వీలైతే అంత అధికంగా తీసుకోవడం వలన డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటారు. వడదెబ్బ కూడా తగలదు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications