Latest Updates
-
దాబా స్టైల్ బట్టర్ చికెన్ సీక్రెట్ రెసిపి..రుచి చూస్తే ఒక్కసారితో ఆగరు -
బ్లడ్ ఇన్ఫెక్షన్ అంటే ఏంటి? ఎందుకు వస్తుంది? -
గోంగూర చికెన్ పచ్చడి ఇలా చేశారంటే..దాసోహం అవ్వాల్సిందే -
నాలికకు కిక్కిచ్చే చేప వెల్లుల్లి కారం..ఇలా చేశారంటే స్వర్గానికి బెత్తెడే దూరం! -
సమంత సీక్రెట్ ఇదే..రోజూ ఉదయం అలా చేస్తే లైఫ్ జిల్ జిల్ జిగా జిగా.. -
షుగర్, బీపీకి చెక్ పెట్టే కొర్రల కిచిడీ..వారంలో 2 రోజులు తింటే బరువు తగ్గడమే కాకుండా రోజంతా సూపర్ ఎనర్జీ! -
చికెన్, మటన్ బిర్యానీలను మరిపించే స్పైసీ టమాటా బిర్యానీ..కుక్కర్ లో ఈజీగా చేసేయండిలా.. -
తులసి తీర్థం మహిమ? చనిపోయిన మహిళ బతికింది! -
రెస్టారెంట్ రుచిని మించేలా ఇంట్లోనే బిసిబేలే బాత్.. సులభంగా ఎలా చేయాలంటే? -
కరివేపాకు vs వేప ఆకు..పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాల్లో ఏది బెస్ట్ అంటే..!
పడుకునే ముందు నెయ్యితో పాదాలకు మసాజ్ చేస్తే ఏమవుతుందో తెలుసా?
భారతీయ వంటగదుల్లో తినే ఆహారం దగ్గర నుంచి ఆయుర్వేదం దాకా నెయ్యి స్థానం ప్రత్యేకమే. వంటకాల రుచిని పెంచుతుంది, రోగాలను నయం చేసే శక్తి కూడా నెయ్యికి ఉంటది,చర్మ సౌందర్యానికి కూడా దీని వల్ల అనేక లాభాలు ఉన్నాయి. అయితే నెయ్యి వల్ల కలిగే ఒక పెద్ద ప్రయోజనం చాలామందికి తెలియదు.
నైట్ నిద్రపోయే ముందు నెయ్యితో పాదాలకు మసాజ్ చేస్తే ఏం జరుగుతుందో తెలుసా? వాస్తవానికి ఇది ఆయుర్వేదంలో చెప్పబడిన ఎంతో పురాతనమైన పద్థతి. దీనివల్ల పొడి చర్మం మృదువుగా మారడంతో పాటు ఎన్నో ఇతర బెనిఫిట్స్ ఉన్నాయి. అవేంటో ఇక్కడ చూడండి.

చర్మానికి ప్రాణం పోసే నేచురల్ మాయిశ్చరైజర్
స్కిన్ పొడి బారటం, పాదాల పగుళ్ల సమస్యతో బాధపడేవాళ్లు నెయ్యి ఒక వరం లాంటిది. నెయ్యిలో ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి, ఇవి స్కిన్ మీద ఒక రక్షణ కవచంలా ఏర్పడి చర్మంలోని తేమను బయటకు పోకుండా కాపాడతాయి. నైట్ పడుకునే ముందు మీ పాదాలను గురువెచ్చని లేదా నార్మల్ వాటర్ తో శుభ్రంగా కడిగి గుడ్డతో తుడవండి. తర్వాత మంచి క్వాలిటీ నెయ్యితో మడిమలు, పగుళ్లు ఉన్న చోట్ల మసాజ్ చేసినట్లు చేయండి. ఇలా రెగ్యులర్ గా చేశారంటే గరుకుగా మారిన మీ పాదాలు మళ్లీ స్మూత్ గా మారతాయి.
అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయం ఏంటంటే..ఒకవేళ మీ మడిమల పగుళ్లు మాత్రం మరీ ఎక్కువగా ఉంటుంటే డాక్టర్ ని కలిసి వాళ్లు సూచించే మాయిశ్చరైజర్ వాడటం బెటర్.

ఒత్తిడి, అసలటకి చెక్
పొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే దాకా ఇంటి బాధ్యతలు లేదా ఆఫీస్ టార్గెట్లతో తెగ ఆలోచించడం, కష్టపడి చేసే శారీరక శ్రమ వల్ల శరీరం అనేది అలసిపోతుంది. పగలంతా కష్టపడ్డాక రాత్రికి ఒళ్లంతా అలసిపోతుంది. దీంతో ఇక ఏ పని చేయాలనిపించదు. తినకూడానికి ఏం తింటాంలే ఓపిక లేదు అని మంచంపై పడిపోయేవాళ్లు చాలామందే ఉంటారు.
ఇట్లాంటి టైంలో కనుక కొంచెం నెయ్యిని పాదాలకు మసాజ్ చేస్తున్నట్లుగా చేయండి. దెబ్బకి మీ రోజంతటి అలసట ఇట్టే మాయమైపోతుంది. దీంతో మనసుకు ప్రశాంతత, ఒత్తిడి పోయి మంచిగా నిద్ర పడుతుంది.
పాదాల మంట నుంచి రిలీఫ్
నైట్ నిద్రపోయే ముందు పాదాల నుంచి మంటలు వచ్చినట్లు అనిపిస్తుందని చాలామంది కంప్లెయింట్ చేస్తుంటారు. మన ఇళ్లల్లోని అమ్మ, నానమ్మ, అమ్మమ్మ, తాతయ్య లేదా నాన్న ఇలా చెబుతుంటడం మనం చూస్తుంటాం. పగలంతా కష్టపడి పనిచేసిన తర్వాత పాదాలు మండుతున్నట్లు అనిపిస్తే కనుక నెయ్యి ఈ సమస్యకు బెస్ట్ మెడిసిన్.
ఎందుకంటే నెయ్యికి చల్లబర్చే గుణం ఉంటది, కాబట్టి పాదాలకు నెయ్యి పూసి మసాజ్ చుస్తే మంటలు తగ్గిపోయి రిలాక్స్ అనిపిస్తుంది. అయితే నెయ్యి రాశాక మీ పాదాలుపై దుద్దుర్లు, జిల పుట్టం లేదా ఎర్రబడటం లాంటివి జరిగితే మాత్రం వెంటనే ఆపేయడం ఉత్తమం.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
