Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
Myths and Facts: చుండ్రు అంటువ్యాధా? తలపై మాత్రమే వస్తుందా?
చుండ్రు.. చాలా మంది వేధించే సమస్య. ఆడ, మగ అని తేడా లేకుండా చాలా మంది చుండ్రుతో ఇబ్బంది పడుతుంటారు. చుండ్రు ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేసే సమస్య కాదు. కానీ, ఈ సమస్యతో ఇబ్బంది పడుతుంటారు. జుట్టు ముట్టుకున్నా భుజాలపై చుండ్రు పడి అవస్థ పడతారు.
చుండ్రు గురించి చాలా మంది తప్పుగా అనుకుంటారు. సరైన శుభ్రత లేకపోవడం, చుండ్రు ఒకరి నుంచి ఒకరికి వస్తుందని, చుండ్రు వల్ల జుట్టు రాలుతుందని చాలా మంది అనుకుంటారు. మరి అవి అపోహలా, నిజాలా అనేది ఇప్పుడు చూద్దాం.

1. పరిశుభ్రత సరిగ్గా లేకపోతే చుండ్రు వస్తుంది!
క్రమం తప్పకుండా జుట్టుకు షాంపూ పెట్టుకోవడం వల్ల చుండ్రును అదుపులో ఉంచుకోవచ్చు. క్రమం తప్పకుండా జుట్టు కడుక్కోవడం వల్ల జుట్టుకు మంచి పరిశుభ్రత లభిస్తుంది. అయితే చుండ్రు రావడానికి చాలా కారణాలు ఉంటాయి. చుండ్రు రావడానికి జుట్టుకు వాడే నూనె కూడా ఓ కారణం అవుతుంది.
2. చుండ్రు తలపై మాత్రమే వస్తుంది!
తలపై చుండ్రు రావడానికి చాలా అవకాశం ఉంటుంది. అయితే తలపై ఒక్క చోట మాత్రమే చుండ్రు వస్తుంది అనుకోవడం పొరపాటే. చాలా మందికి తలపై చుండ్రు విపరీతంగా వస్తుంది. కొంత మంది వ్యక్తుల్లో కనుబొమ్మలు, చెవులు, ముక్కు చుట్టు కూడా చర్మం నుంచి పొలుసుగా రావడం జరుగుతుంది. ఇది కూడా చుండ్రు అని చాలా మందికి తెలియదు.
3. చుండ్రు అంటువ్యాధి!
చండ్రు అనేది ఒకరి నుంచి ఒకరికి వస్తుందని, ఇద్దరు వ్యక్తుల జుట్లు తగిలినప్పుడు చుండ్రు వ్యాపిస్తందని చాలా మంది అనుకుంటారు. చుండ్రుకు దారితీసే ఫంగల్ బ్యాక్టీరియా ప్రతి ఒక్కరి తలపై ఉంటుంది. అయితే అది వివిధ కారణాల వల్ల ఎక్కువై చుండ్రుగా మారి బయటకు కనిపిస్తుంటుంది.
4. చుండ్రు వల్ల జుట్టు రాలుతుంది!
జుట్టు రాలడానికి చుండ్రు దారి తీస్తుందని అనుకుంటారు చాలా మంది. నెత్తిపై చుండ్రు చికాకు తెప్పిస్తుంది. దీని వల్ల గోకడం లాంటివి చేసినప్పుడు జుట్టు కుదుళ్లు బలహీనపడతాయి. అలా జుట్టు ఊడిపోతుంది తప్పా చుండ్రు వల్ల జుట్టు రాలడం జరగదు. జుట్టు రాలడానికి ప్రధాన కారణం ఆందోళన, పోషకాలు అందకపోవడం, అనారోగ్య సమస్యలు, కొన్ని రకాల మందుల వల్ల జుట్టు రాలుతుంది.
5. చుండ్రు, పొడి స్కాల్ప్ రెండూ ఒకటే!
చుండ్రు, పొడి స్కాల్ప్ రెండూ చూడటానికి ఒకేలా ఉంటాయి. కానీ చుండ్రు సాధారణంగా లేత పసుపు, తెలుపు రంగులో ఉండే పెద్ద జిడ్డుగల ఫ్లేక్స్ లా ఉంటాయి. చుండ్రు వల్ల దురద, జిడ్డు, పొలుసులు వస్తుంటాయి. పొడి స్కాల్ప్ వల్ల వచ్చే ఫ్లేక్స్ చాలా చిన్నగా ఉంటాయి. పొడి చర్మం ఇతర శరీరభాగాలపైనా కనిపిస్తుంటుంది. దీని వల్ల నెత్తిపై కూడా పొడిగా ఉందని అనుకోవచ్చు. అయితే దీనిని గుర్తించడం కొద్దిగా కష్టం. వైద్యులు మాత్రం పరీక్షించి గుర్తించగలుగుతారు.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications