Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
ఎన్ని బీర్లు తాగినా కిక్ ఎక్కట్లేదా?.. అయితే మీకు ఈ సమస్య ఉన్నట్లే.. వెంటనే తెలుసుకోకపోతే చనిపోతారు కూడా!
ఎలాంటి కారణాలు లేకపోయినా శుభవార్త విన్నా, చెడు వార్తా విన్నా మందు తాగుతుంటారు. కిక్ కోసం మందు తాగే వారిలో రెండు రకాలు ఉంటారు. ఒకరికి ఎంత తాగినా కిక్ ఎక్కట్లేదు అని అంటే, ఇంకొందరు నేను ఎంత తాగినా స్టడీగా ఉండగలను అని అంటుంటారు. ఈ రెండిటిలో కామన్ విషయం ఏమిటంటే.. కిక్ ఎక్కట్లేదని, స్టడీగా ఉంటానని ఎక్కువగా మందు తాగేస్తుంటారు. దీని వల్ల ఆనారోగ్య సమస్యలు వస్తాయి. అయితే ఈ స్టోరీలో కిక్ ఎక్కితే మంచిదా? ఎక్కకపోతే మంచిదా? నిపుణులు దీని గురించి ఏమంటున్నారు అనేది తెలుసుకుందాం.
హాబీగా తాగే సమయంలో..
మందు ఎంత తాగినా కిక్ ఎక్కకపోవడం అనేది మంచిది కాదని అంటున్నారు నిపుణులు. ఇది ప్రమాద సూచికలు అని చెప్పొచ్చు. ఆల్కహాల్ అనేది ఒక హానికర పానీయం. ఇందులో టాక్సిక్ ఎక్కువగా ఉంటుంది. మొదట్లో ఎవరు మందు తాగినా వారికి కచ్చితంగా కిక్ ఎక్కుతుంది. కొందరు సరదాకు అప్పుడప్పుడు తాగుతుంటారు వారికి కూడా కిక్ ఎక్కుతుంది. దాని వల్ల మత్తు ఎక్కుతుంది. మందులో టాక్సిన్ శరీరంలో ఎక్కువవుతుంది అని చెప్పడానికి బ్రెయిన్ రియాక్ట్ అయ్యి కొత్తవారికి వాంతులు కూడా అవుతుంటాయి. వాంతులు అవుతుంటే అవి హాబీగా తాగుతున్న రోజులు అని చెప్పుకోవచ్చు.

అలవాటుగా మారితే ప్రమాదమే..
రెగ్యులర్‌గా మందు తాగితే అది బ్రెయిన్‌కు అలవాటుగా మారిపోతుంది. దీని వల్ల ఎంత తాగినా కిక్ ఎక్కట్లేదని ఎక్కువగా, లిమిట్ లేకుండా తాగేస్తుంటారు. అయితే ఇది అలవాటుగా మారిపోవడంతో మెదడు కూడా రియాక్ట్ అవ్వడం మానేస్తుంది. మెదడు రియాక్ట్ అవ్వకపోయిన అధికంగా మద్యం సేవించేయడం వల్ల శరీరంలోని ఇతర అవయవాలు దెబ్బతింటాయి. మందు ఎక్కువగా తాగడం వల్ల అది అలవాటుగా మారిపోయి బ్రెయిన్‌లో ఉండే న్యూరాన్లు చనిపోతాయట.
న్యూరాన్లు చనిపోతే ఏం జరుగుతుందంటే?
మందు ఎక్కువగా తాగడం వల్ల మెదడులోని న్యూరాన్లు చనిపోతాయి. ఇలా న్యూరాన్లు చనిపోవడం వల్ల మనం ఏ పని చేసినా మెదడు రియాక్ట్ అవ్వడం మానేస్తుంది. మన శరీరానికి సిగ్నల్స్ ఇవ్వడం ఆపేస్తుంది. దీని వల్ల అనేక సమస్యలు వస్తాయి. సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం, ఆలోచన శక్తిని కోల్పోవడం, ఏ పనిని సరిగ్గా చేయకపోవడం, అల్జీమర్స్ వంటి సమస్యలు తలెత్తుతాయి. భవిష్యత్తులో ఇవి ప్రమాదకరంగా మారి మన పని మనం కూడా చేసుకునే విధంగా తయారైపోతాము.
పిచ్చి పడుతుంది..
మనం ఏ పని చేయాలన్నా న్యూరాన్లు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఆ న్యూరాన్లు చనిపోవడం వల్ల మన పనిపై మనకు అవగాహన ఉండదు. పిచ్చి పట్టే అవకాశం కూడా ఉంటుంది. అలాగే మెదడులో ఓ అబద్దతు ప్రపంచం నడుస్తుంది. ఇది మిగిలిన శరీర భాగాలను కూడా నాశనం చేస్తుంది. కాబట్టి అర్ధం చేసుకోవలసిన విషయం ఏంటంటే.. ఎన్ని బీర్లు తాగిన కిక్ ఎక్కట్లేదంటే అది ప్రమాదకరమని అర్ధం చేసుకోవాలి. మీ మెదడు మీకు సంకేతాలు ఇవ్వడం మానేసిందని, మీకు ప్రమాదం పొంచి ఉందని అర్ధం చేసుకోవాలి.
గమనిక: ఈ కథనంలో మేము పొందుపరిచిన అంశాలు పలు అధ్యయనాలు, ఇంటర్నెట్‌లో మాకు దొరికిన సమాచారం ఆధారంగా అందించబడింది. వీటి శాస్త్రీయతను మేము నిర్ధారించడం లేదు. వీటిని పాటించే ముందు తప్పనిసరిగా నిపుణుల సలహాలు తీసుకోవాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications