గుండెపోటు వచ్చే ముందు ఈ అయిదు లక్షణాలు కనిపిస్తాయి.. ఎలా గుర్తుపట్టాలంటే?

ఈమధ్య కాలంలో గుండెపోటు కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయిన విషయం తెలిసిందే. మరీ ముఖ్యంగా చెప్పాలంటే కరోనా తరువాత గుండెపోటుతో మరణించే వారి సంఖ్య విపరీతంగా ఎక్కువైపోయింది. ఆడుతూ పాడుతూ గుండెపోటుకు గురై ఎక్కడికక్కడ ప్రాణాలు కోల్పోతున్నారు. వయసుతో సంబంధం లేకుండా గుండెపోటుకు గురై మృతి చెందుతున్నారు. అయితే గుండెపోటు లక్షణాలను ముందుగానే గుర్తిస్తే.. ప్రమాదం నుంచి బయటపడొచ్చని నిపుణులు అంటున్నారు. ఇంతకీ ఆ లక్షణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఆ లక్షణాలు ఏంటంటే?

> గుండెపోటు వచ్చే వారం ముందు భుజం, చేతులు తీవ్రంగా నొప్పిస్తాయి. మరీ ముఖ్యంగా ఎడమ భుజంలో ఉన్నపళంగా తీవ్రమైన నొప్పి వస్తుంది. అలాగే ఎడమ చేయి ఫుల్లుగా గుంజడం మొదలవుతుంది. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించి, తగిన చికిత్స తీసుకుంటే మంచిది.

Symptoms of heart attack before one week Find out them in these steps

> గుండెపోటు వచ్చే వారం ముందు వచ్చే లక్షణాల్లో చాతి నొప్పి ముఖ్యమైనది. గుండెపోటు వచ్చే ముందు ఛాతిలో నొప్పి పుడుతుంది. సాధారణంగా అసిడిటీ, గ్యాస్ వంటి సమస్యలు ఉన్నప్పుడు కూడా ఛాతిలో మంటగా, నొప్పిగా ఉంటుంది. అయితే గుండెపోటు వచ్చే సమయంలో చాతి నొప్పి చాలా తీవ్రంగా ఉంటుందని, దానిని భరించలేమని నిపుణులు చెబుతున్నారు. అలాంటి సమయాల్లో జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు.

> సాధారణంగా పలువురు వైద్య నిపుణులతో, వైద్యులు సహా గుండెపోటుకు వెన్నునొప్పికి సంబంధం ఉంటుందని చెబుతూ ఉంటారు. అయితే గుండెపోటు వచ్చే వారం రోజుల ముందు.. ఉన్నట్టుండి వెన్నునొప్పి మొదలవుతుందట. ఇలా వెన్నునొప్పి మొదలై బాధ పెడుతుంటే తప్పనిసరిగా వైద్యులను సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలని, నిపుణులు సూచిస్తున్నారు.

> కొన్ని కొన్ని సందర్భాల్లో చేతులు గుంజడం, భుజాల్లో నొప్పి కలగడం వంటివి ఏర్పడతాయాని మనం చెప్పుకున్న విషయం తెలిసిందే. అయితే మరి కొన్ని సందర్భాల్లో అరచేతితో పాటు చేతిలోనూ భరించలేని నొప్పి ఉంటుందట. ఈ నొప్పి వారం రోజులకంటే ఎక్కువగా ఉంటే గుండెపోటుకు సంకేతమని చెబుతున్నారు. ఇలాంటి లక్షణం కనిపిస్తే వెంటనే వైద్యుల వద్దకు వెళ్లాలని తెలుపుతున్నారు.

> గుండెపోటుకు వారం ముందు కనిపించే లక్షణాల్లో దవడ నొప్పి కూడా ఒకటి. గుండెపోటు వచ్చేముందు ఉన్నట్టుండి దవడ నొప్పి మొదలవుతుందని నిపుణులు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా ఎడమ దవడ తీవ్రంగా నొప్పిస్తుందని, అలా నొప్పి ఉంటే తప్పనిసరిగా వైద్యులను సంప్రదించాలని చెబుతున్నారు.

ఏది ఏమైనప్పటికీ.. గుండెపోటు రాకుండా మనమే తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. బద్దకంగా ఒకేచోట ఉండకుండా వ్యాయామం చేయడం, సరైన రీతిలో ఆహరం తీసుకోవడం వంటివి చేయాలి. అలాగే జంక్ ఫుడ్స్, ఆల్కహాల్, సిగరెట్ వంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండి మన గుండెను మనమే కాపాడుకోవాలి.

Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.

Story first published: Sunday, October 20, 2024, 11:38 [IST]
Desktop Bottom Promotion