Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
Winter health tips: కాఫీ,టీ..చలికాలంలో ఆరోగ్యానికి ఏది మంచిది?
మనదేశంలో పొద్దున్నే నిద్రలేవగానే ఓ కప్పు ఛాయ్ లేదా కాఫీ తాగనిదే కొంతమందికి మోషన్ కూడా రాదు. అసలు బెడ్ దిగాలంటే ఓ కప్పు ఛాయ్ లేదా కాఫీ కడుపులో పడాల్సిందే కొందరికి. ఇక చలికాలం అయితే ప్రత్యేకంగా చెప్పేదేముంది. నిద్రలేచిన వెంటనే ఓ కప్పు ఛాయ్ లేదా కాఫీ గొంతులో పోసుకొని రిలాక్స్ అవుతుంటారు.
అయితే కాఫీ,టీ రెండింటిలో ఏది ఆరోగ్యానికి మంచిది? చలికాలంలో ఈ రెండింటిలో ఏది ఆరోగ్యానికి మంచి చేస్తుంది? వీటిని తాగడం వల్ల అసలు ప్రయోజనం ఏదైనా ఉంటుందా అనే ఇంట్రెస్టింగ్ విషయాలను ఇక్కడ చూడండి.

చలికాలంలో టీ తాగడం వల్ల ప్రయోజనాలివే
-చలికాలంలో టీ తాగడం వల్ల మన శరీరం లోపలి నుంచి వెచ్చగా ఉంటుంది. అయితే ఈ సీజన్‌లో అల్లం,తులసి,మిరియాలు,లవంగాలు కలిపిన టీ తాగవచ్చు. ఇది మన శరీరంలో రోగనిరోధక శక్తిని కూడా బలపరుస్తుంది.
-టీలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ నుండి శరీరాన్ని రక్షిస్తాయి.
-ఇది జలుబు వ్యాధులతో పోరాడే సామర్థ్యాన్ని పెంచుతుంది. చలికాలంలో మసాలా టీ లేదా అల్లం టీ తాగితే జలుబు, దగ్గు, గొంతు నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.
- మూలికలు, గ్రీన్ టీ జీర్ణక్రియను మెరుగుపరిచేటప్ శరీరాన్ని డీటాక్సిఫికేషన్(శరీరంలో విష పదార్థాలను తొలగించడం) చేయడంలో సహాయపడతాయి.
చలి కాలంలో కాఫీ తాగడం వల్ల ప్రయోజనాలివే
-కాఫీలో కెఫీన్ ఉంటుంది. ఇది మిమ్మల్ని రిఫ్రెష్‌గా,ఎనర్జిటిక్‌గా ఫీల్ అయ్యేలా చేస్తుంది. శీతాకాలపు నీరసాన్ని తగ్గించడంలో ఇది సహాయపడుతుందని నమ్ముతారు.
-చలికాలంలో కాఫీ తాగడం వల్ల శరీరంలోని మెటబాలిజం పెరుగుతుంది. ఇది చల్లని వాతావరణంలో శరీర ఉష్ణోగ్రతను అదుపులో ఉంచుతుంది. ఏకాగ్రతను పెంచడంలో కాఫీ కూడా సహాయపడుతుంది.
-యాంటీఆక్సిడెంట్లకు కాఫీ కూడా మంచి మూలం. కాబట్టి చలికాలంలో కాఫీ తాగడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది.
ఈ రెండింటిలో ఏది మంచిది?
మీ రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయాలనుకుంటే, శీతాకాలపు సాధారణ వ్యాధులను నివారించాలనుకుంటే టీ బెస్ట్ ఆప్షన్. చల్లని రోజుల్లో మాత్రమే హెర్బల్ టీ త్రాగడానికి ప్రయత్నించండి. మరోవైపు మీకు శక్తి అవసరమైతే, పనిలో అప్రమత్తంగా ఉండాలనుకుంటే అప్పుడు కాఫీ తాగడం వల్ల ప్రయోజనం ఉంటుంది.
Note: ఇంటర్నెట్ లో లభించిన సమాచారం ఆధారంగా ఈ కథనం ఇవ్వబడింది. దీనిని పాటించే ముందు నిపుణుల సూచనలు తీసుకోండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications