Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
Charcoal For Teeth: బొగ్గుతో పళ్లు తోముతున్నారా? తెల్లగా అవడం పక్కానా..
బొగ్గుతో పళ్లు తోమడం.. కొంత మందికి వింతగా అనిపించవచ్చు, కొంత మందికి చిన్న నాటి జ్ఞాపకాలు గుర్తుకు రావొచ్చు. కొన్ని ప్రాంతాల్లో ప్రజలు పళ్లను శుభ్రం చేసుకోవడానికి బొగ్గును వాడతారు. చిన్న సైజు బొగ్గులను నీటితో శుభ్రంగా కడిగి వాటిని నోట్లో వేసుకుని నములుతారు. తర్వాత వేలితో లేదా టూత్ బ్రష్‌తో పళ్లను శుభ్రం చేసుకుంటారు. ఇది చాలా ఏళ్ల క్రితం నుంచి వస్తున్న ఓ పద్ధతి. కొందరు వయసు పైబడిన వారు ఇప్పటికీ ఈ పద్ధతిని పాటిస్తున్నారు.
ఈ పురాతన పద్ధతి ప్రకారం బొగ్గుతో పళ్లు తోమితే నిజంగానే పళ్లు తెల్లబడతాయా.. నోటి దుర్వాసన దూరం అవుతుందా.. వైద్యులు ఏం చెబుతున్నారు.. బొగ్గుతో పళ్లు తోమడాన్ని వైద్యులు సిఫార్సు చేస్తారో లేదో ఇప్పుడు తెలుసుకుందాం.

బొగ్గుతో పళ్లు తోమడం వల్ల కలిగే ప్రయోజనాలు:
బొగ్గులను నీటితో శుభ్రం చేసిన నోట్లో వేసుకుని నమిలిన తర్వాత ఈ బొగ్గు మరీ పిండిలా మెత్తగా, సాఫ్ట్‌గా కాకుండా కొద్దిగా గరుకుండా చిన్న చిన్న రాళ్ల మాదిరిగా చాలా చిన్న సైజులోకి మారతాయి. అవి పళ్లపై ఉన్నప్పుడు వేలితో పళ్లు రుద్దినప్పుడు అవి కాస్త మెత్తగా మారిపోతాయి. అంతకు ముందే దాని రాపిడి వల్ల పళ్లపై పేరుకుపోయిన పాచి తొలగిపోతుంది.
బొగ్గు వాడటం వల్ల కొంత వరకు పళ్లపై ఉన్న పాచి పోతుంది. పళ్లు తెల్లగా మారతాయి. అలాగే బొగ్గుకు సహజంగానే వాసనను పీల్చుకునే గుణం ఉంటుంది. దీని వల్ల నోట్లో వేసిన బొగ్గు నోటి దుర్వాసనను పీల్చుకుంటుంది. అలా తాజా శ్వాస వస్తుంది.

బొగ్గుతో పళ్లు తోమడం వల్ల కలిగే ప్రమాదాలు:
బొగ్గుతో పళ్లు తోమడం వల్ల లాభాలతో పాటు నష్టాలు కూడా ఉన్నాయి. బొగ్గును నోట్లో వేసుకుని నమిలినప్పుడు అది చిన్న చిన్న రేణువుల రూపంలోకి వస్తుంది. ఈ రేణువులతో పళ్లపై ఉన్న పాచితోపాటు ఎనామెల్ పొర కూడా దెబ్బతింటుందని వైద్యులు భావిస్తున్నారు. పళ్లపై సహజంగా ఉండే ఈ ఎనామెల్ పొర తొలగిపోవడం వల్ల దంతాలు సున్నితంగా మారతాయి. కావిటీస్ ను అభివృద్ధి చేసే అవకాశాలు పెరుగుతాయి.
అలాగే బొగ్గు వాడటం వల్ల దంతాలపై మరక పడవచ్చు. బొగ్గు ఒక పోరస్ పదార్థం. ఇది రంగును గ్రహించగలగు. దంతాలపై ఏవైనా పూరకాలు, క్రౌన్స్ ఉన్నట్లయితే బొగ్గు వాటిని కూడా మరక చేయగలదు.
దంతాలు శుభ్రం చేసుకోవడానికి బొగ్గు సురక్షితమేనా?
బొగ్గుతో దంతాలు శుభ్రం చేసుకోవడం సురక్షితమేనా కాదా అనే ప్రశ్నకు జవాబు చెప్పడానికి తగిన శాస్త్రీయ ఆధారాలు ప్రస్తుతానికి లేవు. అయితే దంతాల ఆరోగ్యం బాగుండటానికి ఎలాంటి చిట్కాలు వాడాలో దంత వైద్యుడిని సంప్రదించడం మంచిది.
డెంటల్ అసోసియేషన్ ఏం చెబుతోంది?
అమెరికన్ డెంటల్ అసోసియేషన్ మాత్రం దంతాలు శుభ్రం చేసుకోవడానికి బొగ్గును సిఫార్సు చేయడం లేదు. దంతాలను తెల్లగా మార్చడానికి, నోటి దుర్వాసను తొలగించడానికి బొగ్గు చక్కగా పని చేస్తుందని చెప్పడానికి తమ వద్ద ఎలాంటి సమాచారం లేదని అమెరికన్ డెంటల్ అసోసియేషన్ చెబుతోంది.
దంతాలు శుభ్రం చేసుకోవడానికి అన్ని రకాల అనుమతులు పొందిన ఉత్పత్తులు వాడాలని అమెరికన్ డెంటల్ అసోసియేషన్ సూచిస్తోంది. అనుమతులు పొందిన ఉత్పత్తులతో ఎలాంటి ప్రమాదాలు ఉండవని చెబుతోంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications