Latest Updates
-
పడుకునే ముందు నెయ్యితో పాదాలకు మసాజ్ చేస్తే ఏమవుతుందో తెలుసా? -
దాబా స్టైల్ బట్టర్ చికెన్ సీక్రెట్ రెసిపి..రుచి చూస్తే ఒక్కసారితో ఆగరు -
బ్లడ్ ఇన్ఫెక్షన్ అంటే ఏంటి? ఎందుకు వస్తుంది? -
గోంగూర చికెన్ పచ్చడి ఇలా చేశారంటే..దాసోహం అవ్వాల్సిందే -
నాలికకు కిక్కిచ్చే చేప వెల్లుల్లి కారం..ఇలా చేశారంటే స్వర్గానికి బెత్తెడే దూరం! -
సమంత సీక్రెట్ ఇదే..రోజూ ఉదయం అలా చేస్తే లైఫ్ జిల్ జిల్ జిగా జిగా.. -
షుగర్, బీపీకి చెక్ పెట్టే కొర్రల కిచిడీ..వారంలో 2 రోజులు తింటే బరువు తగ్గడమే కాకుండా రోజంతా సూపర్ ఎనర్జీ! -
చికెన్, మటన్ బిర్యానీలను మరిపించే స్పైసీ టమాటా బిర్యానీ..కుక్కర్ లో ఈజీగా చేసేయండిలా.. -
తులసి తీర్థం మహిమ? చనిపోయిన మహిళ బతికింది! -
రెస్టారెంట్ రుచిని మించేలా ఇంట్లోనే బిసిబేలే బాత్.. సులభంగా ఎలా చేయాలంటే?
ఉదయం 5 గంటలకు నిద్రలేస్తేనే సక్సెస్ వస్తుందా?.. ప్రముఖ న్యూరోసైంటిస్ట్ చెబుతున్న సంచలన నిజాలివే!
ఉదయం 5 గంటల క్లబ్ (5 AM Club) గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? ప్రపంచంలో సక్సెస్ అయిన వాళ్లంతా సూర్యోదయానికి ముందే నిద్రలేస్తారని, అలా చేస్తేనే ప్రొడక్టివిటీ పెరుగుతుందని, జీవితంలో అద్భుతాలు సాధించవచ్చని చాలామంది చెబుతుంటారు. ఎందరో మోటివేషనల్ స్పీకర్లు కూడా ఇదే మాటను బలంగా నూరిపోస్తుంటారు. కానీ నిజంగానే ఉదయాన్నే లేస్తే సక్సెస్ గ్యారెంటీనా?

ప్రముఖ న్యూరోసైంటిస్ట్, స్లీప్ రీసెర్చర్ అయిన రాచెల్ బార్ ఈ ప్రసిద్ధ నమ్మకాన్ని సవాలు చేస్తున్నారు. ఆమె ప్రకారం.. ఉదయాన్నే నిద్రలేవడానికి, ప్రొడకటివిటీకి మధ్య మనం అనుకుంటున్నంత సూటి సంబంధం లేదు. అందరికీ ఒకే సైజు చొక్కా ఎలాగైతే సరిపోదో, అందరికీ ఒకే నిద్ర దినచర్య కూడా సరిపోదని ఆమె వివరిస్తున్నారు.
మీ శరీర గడియారమే బాస్
మనిషి యాక్టివ్ గా ఉండటం అనేది సర్కాడియన్ రిథమ్ (Circadian Rhythm) అనే సహజమైన జీవగడియారంపై ఆధారపడి ఉంటుంది. మనకు ఎప్పుడు ఆకలి వేస్తుంది, ఎప్పుడు నిద్ర వస్తుంది, బ్రెయిన్ ఎప్పుడు షార్ప్‌గా పనిచేస్తుంది అనేది ఈ గడియారమే నిర్ణయిస్తుంది. నిపుణుల ప్రకారం.. మనుషుల్లో ప్రధానంగా రెండు రకాల క్రోనోటైప్స్ ఉంటాయి.
ఉదయాన్నే చురుగ్గా ఉండే వాళ్ళను లార్క్స్ (Larks) అని, రాత్రిపూట యాక్టివ్‌గా ఉండే వాళ్ళను నైట్ ఔల్స్(Night owls) అని అంటారు. మీరు ఏ రకానికి చెందిన వారనేది మీ జన్యువులు (జెనెటిక్స్) నిర్ణయిస్తాయి. రాత్రి పూట ఆలస్యంగా నిద్రపోయే అలవాటున్న వ్యక్తులు, వేరొకరిని చూసి బలవంతంగా ఉదయం 5 గంటలకే లేవడానికి ప్రయత్నిస్తే లాభం కంటే నష్టమే ఎక్కువని డాక్టర్ బార్ హెచ్చరిస్తున్నారు.
బలవంతపు నిద్రలేమి వెనుక ఉన్న ప్రమాదం
మీ శరీరానికి ఇష్టం లేకపోయినా అలారం పెట్టుకుని మరీ ఉదయాన్నే నిద్రలేవడం వల్ల నిద్రలో అత్యంత కీలకమైన REM (రాపిడ్ ఐ మూవ్‌మెంట్) నిద్రను కోల్పోతారు. తెల్లవారుజామున ఈ నిద్ర ఎక్కువగా ఉంటుంది. జ్ఞాపకశక్తి పెరగడానికి, భావోద్వేగాల నియంత్రణకు, మెదడు ఆరోగ్యంగా ఉండటానికి ఈ REM నిద్ర చాలా అవసరం. దీన్ని కోల్పోతే కాలక్రమేణా మానసిక ప్రశాంతత లోపించడం, చికాకు, రోజంతా అలసటగా అనిపించడం వంటి సమస్యలు వస్తాయి.
ఆమె స్వయంగా తెలుసుకున్న నిజం
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. రాచెల్ బార్ కూడా తనను తాను ఉదయాన్నే లేచే వ్యక్తిని అనుకునేవారట. కానీ తన జన్యు పరీక్షల (DNA Test) నివేదిక చూశాక, తన శరీరం రాత్రిపూట పనిచేయడానికే ఎక్కువ ఇష్టపడుతుందని ఆమె కనుగొన్నారు. ఆ తర్వాత ఆమె తన దినచర్యను మార్చుకుని, శరీరానికి అనుగుణంగా పనిచేయడం మొదలుపెట్టాక మరింత యాక్టివ్‌గా మారారు.
విజయం ఉదయం 5 గంటలకే రాదు
సక్సెస్ సాధించాలంటే తెల్లవారుజామునే లేవాలనేది కేవలం ఒక అపోహ మాత్రమే. చరిత్ర చూస్తే బ్రిటన్ మాజీ ప్రధాని విన్‌స్టన్ చర్చిల్, అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, ప్రముఖ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ వంటి ఎందరో గొప్ప వ్యక్తులు రాత్రిపూట ఆలస్యంగా పనిచేసే అలవాటు ఉన్నవారే. వీరి విజయాలు చూస్తే సక్సెస్ కి ఒకే ఫార్ములా ఉండదని అర్థమవుతుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
