Latest Updates
-
వాతావరణ మార్పులతో మోకాళ్ల నొప్పుల బాధలు.. ఉపశమనం కోసం ఇంట్లోనే ఇలా చేయండి.! -
తిరోగమనం నుంచి బయటపడ్డ బుధ గ్రహం.. ఇక ఈ రాశుల వారి దశ తిరిగినట్లే.! -
సోషల్ మీడియాలో పరిచయాలు నిజమా కాదా.?.. డేటింగ్‌కి వెళ్లేముందు ఈ విషయాలు గమనించండి.! -
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.!
Kidney Stones: కిడ్నీలో రాళ్లకు సంజీవని..మీ పెరట్లోనే దివ్యౌషధం
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మారిన ఆహార అలవాట్లు, సరైన జీవనశైలి లేకపోవడం వల్ల ఎందరినో వేధిస్తున్న తీవ్రమైన సమస్య కిడ్నీలో రాళ్లు. ఒక్కసారి కిడ్నీలో రాళ్లు అనగానే చాలామంది భయాందోళనలకు గురవుతుంటారు. మూత్రపిండాలలో ఏర్పడే గట్టి, ఖనిజ లవణాల స్పటికాలను కిడ్నీలో రాళ్లు అంటారు. ఇవి మూత్రంలో ఉండే రసాయనాలు, ఖనిజాలు అధిక సాంద్రతలో పేరుకుపోయినప్పుడు ఏర్పడతాయి. ఈ రాళ్లు ఇసుక రేణువు అంత చిన్నవిగా ఉండవచ్చు లేదా కొన్నిసార్లు గోల్ఫ్ బంతి అంత పెద్దవిగా కూడా పెరగవచ్చు.
అయితే కిడ్నీలో రాళ్లను తొలగించేందుకు అనేక రకాలు ట్రీట్మెంట్స్ లో అందుబాటులో ఉన్నప్పటికీ.. మన పెరట్లోనే ఓ అద్భుతమైన దివ్యౌషధం ఉందని మీకు తెలుసా? అదే మనందరం పవిత్రంగా పూజించే తులసి. కేవలం మతపరమైన ప్రాముఖ్యతకే పరిమితం కాకుండా తులసి అపారమైన ఔషధ గుణాల గని.

తులసి ఎందుకు అంత ప్రత్యేకం?
తులసి ఆకులలో విటమిన్లు, కాల్షియం, ఐరన్ వంటి పోషకాలతో పాటు మూత్రపిండాల్లో ఏర్పడిన రాళ్లను సహజంగా కరిగించే శక్తివంతమైన సమ్మేళనాలు ఉంటాయి. ఇది కేవలం రాళ్లను కరిగించడమే కాకుండా,వాటిని మూత్రం ద్వారా సులభంగా బయటకు పంపడంలో సహాయపడుతుంది. ఆయుర్వేదం ప్రకారం తులసి జీర్ణవ్యవస్థను మెరుగుపరిచి మూత్రపిండాలపై ఒత్తిడిని తగ్గిస్తుంది. అంతేకాకుండా కిడ
కిడ్నీలను శుభ్రపరిచి వాటి పనితీరును మెరుగుపరిచే డీటాక్స్ ఏజెంట్‌గా కూడా పనిచేస్తుంది.
కిడ్నీ రాళ్లకు తులసి టీ
ఈ అద్భుత ఔషధాన్ని మీ దినచర్యలో భాగం చేసుకోవడం చాలా సులభం. ముందుగా ఒక గిన్నెలో కప్పు నీటిని తీసుకుని, అందులో 8 నుండి 10 తాజా తులసి ఆకులను వేయండి.
దీనిని చిన్న మంటపై 5-7 నిమిషాల పాటు బాగా మరిగించండి.
ఔషధ గుణాలను, రుచిని రెట్టింపు చేయడానికి చిన్న అల్లం ముక్కను కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు.
టీ గోరువెచ్చగా అయ్యాక, వడకట్టి రుచికి తగినంత స్వచ్ఛమైన తేనెను కలుపుకోండి.
ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో ఈ టీని సేవించడం వల్ల కిడ్నీలు శుభ్రపడటమే కాకుండా మీ రోగనిరోధక శక్తి కూడా అద్భుతంగా పెరుగుతుంది. కాబట్టి ఖరీదైన ట్రీట్మెంట్స్ కి వెళ్లేముందు మన పెరట్లోని ఈ సంజీవనితో ఆరోగ్యాన్ని కాపాడుకోండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications