Latest Updates
-
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.!
జిమ్ వద్దు, కఠిన ఆహారం వద్దు..డుబ్రో డైట్‌తో కొద్ది రోజుల్లోనే బరువు తగ్గండి!
ప్రస్తుతం చాలామందిని వేధిస్తున్న పెద్ద సమస్య అధిక బరువు. దీంతో బరువు తగ్గేందుకు చాలామంది రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఫుడ్ తినడం తగ్గించడం, జిమ్ లో గంటల సేపు గడపడం, వాకింగ్ ఇలాంటి అనేక రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే ఎన్ని ప్రయత్నాలు చేసినా కొందరికి బరువు తగ్గడం కలగానే మిగిలిపోతుంది. అయితే మీకు కూడా ఇలాంటి అనుభమే ఎదురవుతుందా? జిమ్‌లో గంటల తరబడి కష్టపడినా, యోగా చేసినా, ప్రత్యేకమైన ఆహారాలు తీసుకున్నా ఆశించిన ఫలితం కనిపించలేదా? అయితే డుబ్రో డైట్ ఫాలో అవ్వండి. కొద్ది రోజుల్లోనే బరువు తగ్గిపోవడం గ్యారెంటీ.
డుబ్రో డైట్ అంటే ఏంటీ
అమెరికన్ నటి హీథర్ డుబ్రో, ఆమె భర్త ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ టెర్రీ డుబ్రో 'డుబ్రో డైట్'అనే ప్రత్యేకమైన ఆహారాన్ని తీసుకొచ్చారు.ఈ డైట్ తో బరువు తగ్గొచ్చని వాళ్లు చెబున్నారు. ఈ డైట్ ముఖ్య సూత్రం ఇంటర్మిటెంట్ పాస్టింగ్(Intermittent Fasting).. అంటే ఒక నిర్దిష్ట టైం దాకా ఫుడ్ తినకుండా ఉండాలి. వారు చెప్పేదాని ప్రకారం ఈ డైట్ కేవలం బరువు తగ్గించడమే కాకుండా చర్మానికి సహజమైన మెరుపును అందిస్తుంది.

డుబ్రో డైట్ మూడు విభిన్న దశల్లో
ఫస్ట్ స్టేజ్ - జంప్ స్టార్ట్
బరువు తగ్గించే ప్రయాణానికి ఇది తొలి అడుగు. ఈ దశలో ఆహార నియమాలు చాలా కఠినంగా ఉంటాయి. మీరు రోజుకు కేవలం రెండుసార్లు మాత్రమే భోజనం చేయాలి. మొదటిది 16 గంటల ఉపవాసం తర్వాత.. రెండవది మొదటి భోజనం తర్వాత 8 గంటలకు. ఈ సమయంలో మీ శరీరం ఎనర్జీ కోసం నిల్వ ఉంచిన కొవ్వును వినియోగించడం ప్రారంభిస్తుంది..తద్వారా మీరు చాలా త్వరగా బరువు తగ్గుతారు. అయితే ఈ దశలో చాలా మందికి తీవ్రమైన ఆకలి, నీరసం, చిరాకు వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి మీ శరీరాన్ని దీనికి మానసికంగా సిద్ధం చేసుకోవడం ముఖ్యం.
రెండవ దశ
ఈ దశలో ఉపవాసం,ఆహారం తీసుకునే సమయాల్లో కాస్త వెసులుబాటు లభిస్తుంది. మొదటి దశతో పోలిస్తే ఈ దశను ఎక్కువ కాలం పాటు కొనసాగించడం సులభం అవుతుంది. ఈ దశ ప్రధాన లక్ష్యం బరువు తగ్గడాన్ని కొనసాగిస్తూనే శరీరాన్ని ఒక క్రమమైన, సమతుల్య ఆహారపు దినచర్యకు అలవాటు చేయడం. ఈ సమయంలో ఆరోగ్యకరమైన కొవ్వులు (ఆలివ్ నూనె, అవకాడో వంటివి), ప్రోటీన్లు (గుడ్లు, చికెన్, చేపలు వంటివి) తక్కువ కార్బోహైడ్రేట్లు కలిగిన కూరగాయలకు (ఆకు కూరలు, బ్రకోలీ వంటివి) ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ ఆహారాలు ఆకలిని నియంత్రిస్తాయి,జీవక్రియను చురుగ్గా ఉంచడంలో సహాయపడతాయి.
మూడవ దశ
ఇది తుది, అతి ముఖ్యమైన దశ. ఇది మీ జీవనశైలిలో ఒక భాగంగా మారిపోతుంది. ఈ దశలో మీరు వారంలో కొన్ని రోజులు మాత్రమే ఉపవాసం ఉంటారు.. మిగిలిన రోజుల్లో సాధారణంగా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవచ్చు. ఈ దశ ముఖ్య ఉద్దేశ్యం మీరు ఇంతకు ముందు కోల్పోయిన బరువును తిరిగి పొందకుండా స్థిరంగా ఉంచుకోవడం. ఈ దశను అనుసరించడం చాలా సులభం. అంతేకాకుండా ఈ దశలో ఒక Cheat Day కూడా ఉంటుంది.. అంటే వారంలో ఒకరోజు మీకు నచ్చిన ఆహారాన్ని కొద్ది మొత్తంలో ఆస్వాదించవచ్చు. ఇది మానసికంగా కూడా మిమ్మల్ని రిలాక్స్ గా ఉంచుతుంది.
ఈ డైట్ బరువు తగ్గడానికి ఎలా సహాయపడుతుంది?
డుబ్రో డైట్ చాలా మందికి బరువు తగ్గడానికి ఒక ప్రభావవంతమైన మార్గంగా నిరూపించబడింది. ముఖ్యంగా ఎవరైతే అప్పుడప్పుడు ఉపవాసం ఉండటానికి సిద్ధంగా ఉన్నారో వారికి ఇది బాగా పనిచేస్తుంది. ఈ ఆహార విధానం మీ శరీరంలోని ఇన్సులిన్ లెవల్స్ ను బ్యాలెన్స్ చేస్తుంది, తద్వారా శరీరం నిల్వ ఉన్న అదనపు కొవ్వును శక్తిగా మార్చి కరిగించడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా ఈ డైట్ లో చక్కెర, ప్రాసెస్ చేసిన ఆహారాలకు పూర్తిగా దూరంగా ఉండటం వల్ల బరువు తగ్గడం మరింత సులభం అవుతుంది. అయితే ఏదైనా కొత్త ఆహార విధానాన్ని ప్రారంభించే ముందు తప్పకుండా మీ వైద్య నిపుణుడిని సంప్రదించడం చాలా ముఖ్యం.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications