Latest Updates
-
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్‌లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.!
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.!
మహిళలు గర్భం దాల్చడంలో ఇటీవల చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. అందులో ప్రధానమైనది ఫెలోపియన్ ట్యూబ్‌ల సమస్య. పునరుత్పత్తి వ్యవస్థకు ఫెలోపియన్ ట్యూబ్‌లు ఆరోగ్యకరంగా ఉండటం ముఖ్యం. అయితే పలు కారణాల వల్ల ఈ ట్యూబ్‌లు మూసుకుపోతున్నాయి. దీంతో గర్భధారణ ప్రక్రియ కష్టతరంగా మారుతుంది. ఇందుకు పలు కారణాలు ఉంటున్నాయని గైనకాలజిస్టు నిపుణులు చెబుతున్నారు.

సంతానలేమి సమస్యల్లో భాగంగా మహిళలు ఎక్కువగా ఫెలోపియన్ ట్యూబ్ బ్లాకేజీ, ఇన్‌ఫెక్షన్ సమస్యలు ఎదుర్కొంటున్నారు. స్త్రీ పునరుత్పత్తి వ్యవస్థలో కీలకమైన ఈ ట్యూబ్‌లు.. అండాశయం నుంచి అండాన్ని తీసుకువస్తాయి. భర్త వీర్యకణాలు ఫెలోపియన్ ట్యూబ్‌లోకి అండంతో ఫలదీకరణం చెందుతుంది. తర్వాత అక్కడి నుంచి గర్భాశయంలోకి చేరుతుంది. ఈ మొత్తం ప్రక్రియకు ట్యూబ్‌లు ఆరోగ్యకరంగా తెరిచి ఉండటం, ఇన్‌ఫెక్షన్ లేకుండా ఉండటం ముఖ్యం. అయితే పలు కారణాల ట్యూబ్‌లు మూసుకుపోవడం, ఇన్‌ఫెక్షన్‌కి గురి కావడం జరుగుతుంది. దీంతో సంతానోత్పత్తి ప్రక్రియలో ఆటంకాలు ఏర్పడుతున్నాయి.
ఫెలోపియన్ ట్యూబ్ ఇన్‌ఫెక్షన్‌కి కారణాలు
పెల్విక్ ఇన్ఫెక్షన్లు, ఎండోమెట్రియోసిస్, ఇంకా భార్యాభర్తలు లైంగికంగా సంక్రమించినప్పుడు ఇన్ఫెక్షన్లు తలెత్తితే ఫెలోపియన్ ట్యూబ్‌లు బ్లాక్ అవ్వడం, ఇన్‌ఫెక్షన్‌కి గురి కావడం జరుగుతుందని నిపుణులు అంటున్నారు. కొన్ని సందర్భాల్లో ఇది టీబీ వ్యాధి కారణంగా కూడా సంభవించే అవకాశం ఉంది.
కొందరు మహిళల్లో ట్యూబ్ బ్లాకేజీ సమస్య ఉన్నా బుుతుచక్రంలో ఎలాంటి సమస్యా ఉండదు. రెగ్యులర్‌గానే వారికి పీరియడ్స్ వస్తుంటాయి. దీంతో వారిలో ఈ సమస్య లక్షణాలు మొదట్లో కనిపించవు. కానీ ప్రెగ్నెన్సీ ప్రయత్నాల్లో ఉన్నప్పుడు సంతానం ఆలస్యమైతే ట్యూబ్ బ్లాకేజీ సమస్య కారణం కావచ్చు.
ఈ టెస్టుల ద్వారా నిర్ధారణ
ఫెలోపియన్ ట్యూబ్‌లు సరిగ్గా ఉన్నాయా లేదా అనేది HSG లేదా హిస్టెరోసాల్పింగోగ్రామ్ పరీక్ష ద్వారా నిర్ధారణ అవుతుంది. ఈ టెస్ట్ ఒక రకమైన ఎక్స్- రే. దీని ద్వారా ట్యూబ్‌లు బ్లాక్ ఉన్నాయా, ఇన్‌ఫెక్షన్ సమస్య ఏదైనా ఉందా అనేది తెలుసుకోవచ్చు. కొన్ని కేసుల్లో ఈ ట్యూబ్‌లను ఓపెన్ చేసి సహజ పద్ధతిలో గర్భధారణకి ప్రయత్నించవచ్చని.. మరికొన్ని కేసుల్లో పరిస్థితి తీవ్రంగా ఉంటే ఐవీఎఫ్ వంటి అధునాతన చికిత్సలను ఆశ్రయించవచ్చని గైనకాలజిస్టు నిపుణులు సూచిస్తున్నారు. ఀ

సరైన జీవనశైలి
ఇక, ఫెలోపియన్ ట్యూబ్‌ల సమస్యకు సరైన జీవనశైలి కూడా లేకపోవడం కూడా కారణమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సరైన దినచర్య, కొన్ని యోగాసనాలు పాటించడం ద్వారా మెల్లగా ఈ సమస్య నుంచి బయటపడవచ్చని యోగా నిపుణులు చెబుతున్నారు. సహజంగా గర్భం దాల్చాలనుకునేవారు వైద్యుల సలహా మేరకు లైఫ్‌స్టైల్‌లో మార్పులు చేసుకోవచ్చు.
యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కలిగి ఉండి, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి పుష్కలంగా ఉండే పసుపు, అల్లం, వెల్లుల్లి, నిమ్మజాతి పండ్లను తీసుకోవడం ద్వారా ఫెలోపియన్ ట్యూబ్‌ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండటం మేలు చేస్తుంది. పునరుత్పత్తి వ్యవస్థకు, ఫెలోపియన్ ట్యూబ్ పనితీరుకి ఈ దురలవాట్లు ప్రతికూల ప్రభావం చూపుతాయి.
యోగాసనాలు
హార్మోన్ల అసమతుల్యత, ఒత్తిడి కారణంగా ఫెలోపియన్ ట్యూబ్స్ ఆరోగ్యం దెబ్బతింటుంది. ఇందుకు యోగా మంచి పరిష్కారం. ప్రతిరోజూ 5 నుంచి 10 నిమిషాలు ధ్యానం చేయడం ద్వారా ఒత్తిడిని తగ్గించి హార్మోన్లను బ్యాలెన్స్ చేస్తుంది. కొన్ని యోగాసనాలు కటి ప్రాంతంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. పొట్ట భాగంలో మసాజ్ చేయడం ద్వారా గర్భాశయ ప్రాంతంలో రక్త ప్రసరణ మెరుగై ట్యూబ్‌లు అతుక్కోకుండా కాపాడతాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications