Latest Updates
-
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.?
షుగర్ పేషెంట్లకు శుభవార్త..ఇన్సులిన్ మొక్క ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే
మనదేశాన్ని వరల్డ్ డయాబెటిస్ కాపిటల్ అని కూడా పిలుస్తారు. దాదాపు ఇంటికొక డయాబెటిస్ పేషెంట్ మనదేశంలో ఉన్నారంటే ఆశ్చర్యం అక్కర్లేదు. మారిన జీవనశైలి, ఒత్తిడితో కూడిన జీవితం, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల కారణంగా డయాబెటిస్ పేషెంట్ల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది.
షుగర్ వ్యాధి, మధుమేహంగా కూడా పిలువబడే డయాబెటిస్.. కేవలం రక్తంలో చక్కెర స్థాయిలను పెంచడమే కాకుండా గుండె, మూత్రపిండాలు, కళ్ళు వంటి కీలక అవయవాలపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. అయితే,ప్రకృతి మనకు ఎన్నో అద్భుతమైన పరిష్కారాలను అందిస్తుంది. అలాంటి ఒక అద్భుత వరమే ఇన్సులిన్ మొక్క (Costus Igneus).

ఇన్సులిన్ మొక్క అంటే ఏంటి? అది ఎలా పనిచేస్తుంది?
ఈ మొక్క పేరులోనే దాని గుణం దాగి ఉంది. ఇది నేచురల్ ఇన్సులిన్ లా పనిచేసి, డయాబెటిస్ ని కంట్రోల్ చేయడంలో అద్భుతంగా సహాయపడుతుంది. దీని ఆకులలో ఉండే శక్తివంతమైన సహజ రసాయనాలు, మన శరీరంలో పేరుకుపోయిన అదనపు చక్కెరను గ్లైకోజెన్ గా మార్చి, దానిని శక్తిగా మార్చడానికి దోహదపడతాయి.
అంతేకాకుండా ఇది క్లోమ గ్రంథి (ప్యాంక్రియాస్)లోని బీటా కణాలను పునరుత్తేజపరిచి వాటిని బలోపేతం చేస్తుంది. ఫలితంగా శరీరంలో సహజంగా ఇన్సులిన్ ఉత్పత్తి మెరుగుపడుతుంది. ఇది ఉపవాసం ఉన్నప్పుడు, భోజనం చేసిన తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలు అదుపుతప్పకుండా చూస్తుంది.
ఎలా ఉపయోగించాలి?
ఈ మొక్కను పెంచడం చాలా సులభం. మీ ఇంటి పెరట్లో లేదా ఓ చిన్న కుండీలోనైనా దీనిని నాటుకోవచ్చు. ఇది సుమారు 2 అడుగుల ఎత్తు వరకు పెరిగే అందమైన ఆకుపచ్చని, మురి ఆకారపు ఆకులతో ఉంటుంది. దీనిని వాడటం కూడా చాలా తేలిక.
ప్రతిరోజూ ఉదయాన్నే ఒక తాజా ఆకును కోసి శుభ్రంగా కడిగి నమిలితే చాలు. దీని రుచి కొద్దిగా పుల్లగా, వగరుగా ఉంటుంది. అలా నమలడం ఇష్టం లేనివారు దీనిని చట్నీగా చేసుకొని లేదా ఇతర ఆకుకూరలతో కలిపి వంటలలో కూడా ఉపయోగించవచ్చు. సలాడ్స్ లో కూడా కలిపి తీసుకోవచ్చు లేదా స్మూతీలలో కూడా తీసుకోవచ్చు.
ఇతర ఆరోగ్య ప్రయోజనాలు
ఇన్సులిన్ మొక్క కేవలం మధుమేహానికే కాదు సంపూర్ణ ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. ఇది ఒక శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్. శరీరంలోని హానికరమైన ఫ్రీ రాడికల్స్ తో పోరాడి, రోగనిరోధక శక్తిని పెంచుతుంది. మూత్రవిసర్జనను ప్రోత్సహించడం ద్వారా శరీరం నుండి విష పదార్థాలను బయటకు పంపడంలో సహాయపడుతుంది.
మీ షుగర్ లెవల్స్ కంట్రోల్ లో లేకపోతే మందులతో పాటు ఈ సహజ సిద్ధమైన మార్గాన్ని ప్రయత్నించండి. కొన్ని నెలల పాటు క్రమం తప్పకుండా ఈ ఆకులను తీసుకోవడం వల్ల మీ మధుమేహం నియంత్రణలోకి వచ్చి, మంచి ఫలితాలు కనిపిస్తాయి. అయితే ఏదైనా కొత్త ట్రీట్మెంట్ ను ప్రారంభించే ముందు మీ డాక్టర్ ని సంప్రదించడం మంచిది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
