Latest Updates
-
కృష్ణాష్టమి స్పెషల్ అటుకులు నువ్వుల లడ్డూ..10 నిమిషాల్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
కృష్ణాష్టమి స్పెషల్: కన్నయ్య మనసు దోచే అటుకుల పాయసం..ఇంట్లోనే చేయండిలా -
మగవారూ అలర్ట్ : మూత్రం పోశాక కూడా చుక్కలు కారుతున్నాయా? ఈ 3 వ్యాధులకు సంకేతం కావచ్చు! -
ఈ కృష్ణాష్టమికి ఇంట్లోనే.. 100% పవిత్రమైన పంచామృత కేక్ తయారు చేయండిలా! -
రోడ్ సైడ్ స్టైల్ ఎగ్ శార్వా..చపాతీ, దోశ, పరోటాల్లోకి అమృతంలా! -
గ్యాస్, అజీర్తి అని ట్యాబ్లెట్లు వేసుకుంటున్నారా? ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ముప్పు కావచ్చు, జాగ్రత్త! -
ఆడవారైనా, మగవారైనా అస్సలు తాగకూడని డ్రింక్ ఏంటో తెలుసా.. డాక్టర్ సలహా ఇదే.! -
ఇడ్లీ, దోశలతో విసిగిపోయారా? ప్రొటీన్ల నిధి,బలాన్నిచ్చే ఎగ్ పరాఠా ట్రై చేయండి! -
సైలెంట్ కిల్లర్స్: పైకి ముక్కుసూటి.. వెనుక మహా కిలాడీలు!..ఈ 3 రాశులు ఎవరో తెలుసా? -
వినాయక చవితి స్పెషల్..ఇంట్లోనే ఈజీగా నోరూరించే చాక్లెట్ మోదక్ ఎలా చేసుకోవాలంటే..
స్ట్రోక్ ముప్పును తగ్గించే అద్భుతమైన జపనీస్ రహస్యం.. కేవలం 15 నిమిషాలు ఇలా చేస్తే చాలు!
ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో వయసుతో సంబంధం లేకుండా చాలా మందిని భయపెడుతున్న సమస్యలు గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్. మెదడుకు రక్త సరఫరా అకస్మాత్తుగా ఆగిపోవడాన్నే స్ట్రోక్ అంటారు.
గుండె ఆరోగ్యం దెబ్బతినడం వల్లే స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, మధుమేహం, ధూమపానం, ఊబకాయం వంటి సమస్యలు గుండెపోటుకే కాదు, స్ట్రోక్ కు కూడా ప్రధాన కారణాలుగా మారుతున్నాయి.

గుండె లయ తప్పినప్పుడు లేదా రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడం వల్ల మెదడుకు రక్త ప్రవాహం నిలిచిపోయి ఇస్కీమిక్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంది. అయితే స్ట్రోక్ రాకుండా అడ్డుకోవడానికి జపనీయులు ఒక ప్రత్యేకమైన, సంప్రదాయ పద్ధతిని పాటిస్తారట. అదేంటో తెలిస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు.
స్ట్రోక్ నివారణకు జపనీస్ టెక్నిక్
ప్రముఖ పోషకాహార నిపుణురాలు శ్వేతా షా తన ఇన్ స్టాగ్రామ్ ద్వారా ఈ ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. జపనీయులు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రతిరోజూ ఒక చిన్న పని చేస్తారు. అదేంటంటే.. వేడి నీటిలో పాదాలను నానబెట్టడం.
ప్రతిరోజూ 15 నుండి 20 నిమిషాల పాటు వేడి నీటిలో పాదాలను ఉంచడం వల్ల శరీరంలో అద్భుతమైన మార్పులు జరుగుతాయంట. ముఖ్యంగా 50 ఏళ్లు పైబడిన వాళ్లకు ఇలా చేయాలని ఆమె సూచించారు.
-వేడి నీటి వల్ల రక్త నాళాలు తెరుచుకుని, రక్త ప్రసరణ వేగవంతం అవుతుంది. ఇది గుండెపై భారాన్ని తగ్గిస్తుంది.
-ఈ పద్ధతి శారీరక, మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది.
-ఆ వేడి నీటిలో ఒక టీస్పూన్ ఎప్సమ్ సాల్ట్ కలిపితే కండరాలకు ఉపశమనం లభించి,రాత్రిపూట గాఢమైన నిద్ర పడుతుంది. నిద్రలేమి సమస్య ఉన్నవారికి ఇది గొప్ప చిట్కా.
స్ట్రోక్ వస్తుందని చెప్పే హెచ్చరిక సంకేతాలు
స్ట్రోక్ అనేది అనుకోకుండా దాడి చేస్తుంది. కానీ శరీరం మనకు కొన్ని ముందస్తు సంకేతాలను ఇస్తుంది. వాటిని గుర్తించి వెంటనే డాక్టర్ ని సంప్రదించాలి.
-అకస్మాత్తుగా శరీర బ్యాలెన్స్ కోల్పోవడం.
-కంటి చూపు మసకబారడం లేదా దృష్టిలో మార్పులు రావడం.
-నవ్వినప్పుడు మూతి ఒక వైపుకు వంగిపోవడం.
-రెండు చేతులను పైకి లేపినప్పుడు, ఒక చేయి నిలవలేక కిందకు జారిపోవడం.
-మాట్లాడేటప్పుడు తడబడటం లేదా మాట స్పష్టంగా రాకపోవడం.
ఎవరికి ఎక్కువ ప్రమాదం?
కొంతమందిలో స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఇతరులకన్నా ఎక్కువగా ఉంటాయి.
-65 ఏళ్లు పైబడిన వృద్ధులు
-అధికంగా ధూమపానం, మద్యపానం చేసేవారు.
-తరచుగా విపరీతమైన తలనొప్పి లేదా మైగ్రేన్ సమస్య ఉన్నవారు.
-రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉన్నవారు, టైప్-2 డయాబెటిస్ రోగులు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications