Latest Updates
-
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.?
ఓ మై గాడ్: బంగాళాదుంప ఎవరు తినకూడదో తెలుసా
మన వంటగదుల్లో తప్పకుండా ఉండే కాయగూరల్లో బంగాళదుంప ప్రధానమైనది. ముఖ్యంగా నార్త్ ఇండియాలో అయితే బంగాళదుంప వినియోగం విపరీతంగా ఉంటది. ఆలూపరాఠా నుంచి మొదలుపెడితే కరకరలాడే ఫ్రెంచ్ ఫ్రైస్, ఘుమఘుమలాడే ఆలు కుర్మా ఇలా బోలెడు వెరైటీలు బంగాళదుంపతో తయారుచేస్తుంటారు. ప్రతి వంటకం రుచిని రెట్టింపు చేసే ఈ ఆలుగడ్డ కొందరి పాలిట మాత్రం ఆరోగ్యానికి అతిపెద్ద శత్రువుగా మారుతుందని మీకు తెలుసా?
అందరికీ అమృతంలా అనిపించే బంగాళాదుంప.. కొందరి ఆరోగ్యానికి మాత్రం విషంతో సమానం. మీరు కూడా బంగాళాదుంపలను ఇష్టంగా తింటున్నారా? అయితే ఒక్క నిమిషం ఆగండి. కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్లు ఆలుగడ్డకు వీలైనంత దూరంగా ఉండటం శ్రేయస్కరం. లేదంటే తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎవరెవరు బంగాళాదుంపలను తినకూడదో ఇక్కడ చూడండి.

షుగర్ తో బాధపడేటోళ్లు
బంగాళాదుంపలో పిండి పదార్థాలు, కార్బోహైడ్రేట్లు అత్యధిక స్థాయిలో ఉంటాయి. దీని గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా చాలా ఎక్కువ. అంటే తిన్న వెంటనే ఇది రక్తంలో చక్కెర స్థాయిలను అమాంతం పెంచేస్తుంది. మధుమేహంతో బాధపడేవారికి ఇది అత్యంత ప్రమాదకరం. తరచుగా బంగాళాదుంపలను తినడం వల్ల వారి షుగర్ లెవెల్స్ అదుపు తప్పే ప్రమాదం ఉంది. ఒకవేళ తినాలనిపిస్తే డాక్టర్ సలహా మేరకు చాలా పరిమితంగా, ఉడికించి మాత్రమే తీసుకోవాలి.
గుండె జబ్బులు ఉన్నవారు
గుండె ఆరోగ్యానికి, బంగాళాదుంపలకు మధ్య ఒక వైరం ఉంది. ముఖ్యంగా నూనెలో బాగా వేయించిన బంగాళాదుంప వంటకాలైన ఫ్రెంచ్ ఫ్రైస్, చిప్స్, ఆలూ బోండా వంటివి సంతృప్త కొవ్వులతో నిండి ఉంటాయి. ఇవి రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచి, రక్త నాళాల్లో అడ్డంకులు ఏర్పడేలా చేస్తాయి. ఇది గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది. అధిక కొలెస్ట్రాల్, గుండె సమస్యలు ఉన్నవారు వేయించిన బంగాళాదుంపలకు పూర్తిగా దూరంగా ఉండాలి.
ఊబకాయంతో సతమతమయ్యేవారు
బరువు తగ్గాలనుకునే వారికి బంగాళాదుంప ఒక పెద్ద అడ్డంకి. ఇందులో కేలరీలు అధికంగా ఉండటం వల్ల దీనిని తరచుగా తినడం వల్ల బరువు వేగంగా పెరుగుతారు. ముఖ్యంగా నెయ్యి లేదా నూనెతో చేసిన ఆలూ పరాఠాలు, చిప్స్ వంటివి ఊబకాయానికి నేరుగా కారణమవుతాయి. మీరు బరువు తగ్గే ప్రయాణంలో ఉంటే మీ డైట్ చార్ట్ నుండి బంగాళాదుంపను తొలగించడం ఉత్తమమైన నిర్ణయం.
కిడ్నీ సమస్యలు ఉన్నవారు
బంగాళాదుంపలో పొటాషియం చాలా సమృద్ధిగా లభిస్తుంది. ఆరోగ్యవంతులకు ఇది మేలు చేసినా.. కిడ్నీ సమస్యలతో బాధపడేవారికి మాత్రం ఇది హానికరం. బలహీనంగా ఉన్న కిడ్నీలు శరీరం నుండి అదనపు పొటాషియంను బయటకు పంపలేవు. దీనివల్ల రక్తంలో పొటాషియం లెవల్స్ పెరిగి, తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. కాబట్టి మూత్రపిండాల వ్యాధిగ్రస్తులు బంగాళాదుంపలకు వీడ్కోలు పలకడమే మంచిది.
హై బీపీ ఉన్నవారు
బంగాళాదుంప వంటకాలను మనం సాధారణంగా ఉప్పు, కారం, నూనెతో కలిపి చేస్తాం. ఈ కలయిక అధిక రక్తపోటు ఉన్నవారికి చాలా ప్రమాదకరం. బంగాళాదుంపలోని సోడియం, స్టార్చ్ రక్తపోటును పెంచే గుణాలను కలిగి ఉంటాయి. ముఖ్యంగా ప్యాక్ చేసిన చిప్స్, ఫ్రోజెన్ ఫ్రైస్ లో ఉప్పు అధికంగా ఉంటుంది, ఇది బీపీ రోగులకు ఏమాత్రం మంచిది కాదు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
