Latest Updates
-
గోళ్లు బలంగా, అందంగా ఉండాలంటే.. ఈ తప్పులు అస్సలు చేయకండి.! -
లక్ష్మణ రేఖ వద్దు, కెమికల్ స్ప్రేలు వద్దు..వంటగదిలో చీమలను తరిమికొట్టే చిట్కా! -
ఈ ఫ్రూట్స్ తింటున్నారా.. కిడ్నీలో రాళ్లు ఉన్నవారు ఒక్కసారి వీటి రేటింగ్స్ తెలుసుకుంటే బెటర్.! -
శుక్రవారం ఈ పూజలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందట.. ఇంట్లో ధనం, శుభం పెరుగుతాయా? -
Viral Video: నైట్ మార్కెట్ లో టవల్ కట్టి డాన్స్ చేసిన మహిళ..ఊడిపోతున్నా కూడా.. -
బ్యూటీ పార్లర్‌కి వెళ్లే పనిలేదు.. పాతకాలం టిప్స్‌తో మృదువైన జుట్టు, మెరిసే ముఖం మీ సొంతం.! -
భాగస్వామితో తరచూ గొడవలు.. విడాకులకు దారితీసే హెచ్చరిక సంకేతాలు ఇవే. -
పప్పు, సాంబార్ లోకి కేక..కరకరలాడే సగ్గుబియ్యం పాప్ కార్న్ వడియాలు ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పెళ్లయినా, కాకపోయినా తప్పని టాక్సిక్ రిలేషన్షిప్.. ఎలా హ్యాండిల్ చేయాలి.? -
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు!
పచ్చి వెల్లుల్లిని ఇలా తిన్నారంటే జన్మలో ఏ రోగం రాదు!..బీపీ,కొలెస్ట్రాల్,హార్ట్ ప్రాబమ్స్ అన్నీ మాయం
ఈ రోజుల్లో ఆరోగ్యంగా ఉంటే చాలు డబ్బు లేకున్నా పర్లేదు అని అనుకునేటోళ్లు చాలామందే ఉన్నారు. అయితే ఎక్కువ ఖర్చు లేకుండా మన వంటగదిలో లభించే చిన్న చిన్న పదార్థాలతోనే మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఒక రకంగా మన వంటిల్లే ఒక చిన్నపాటి ఔషధాల గని. సాధారణంగా మనం వెల్లుల్లిని వంటల్లో ఎక్కువగా ఉపయోగిస్తుంటాం. ఆహారానికి అద్భుతమైన రుచిని అందించడమే కాదు, మన ఆరోగ్యాన్ని కాపాడే శక్తివంతమైన ఔషధంగా కూడా వెల్లుల్లి పనిచేస్తుంది. ముఖ్యంగా ప్రతిరోజూ ఉదయాన్నే పరగడుపున ఒక్క పచ్చి వెల్లుల్లి రెబ్బను తినడం వల్ల కలిగే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు.
ఎముకలకు బలం
మీ ఎముకలను ఉక్కులా బలంగా, దృఢంగా ఉంచుకోవాలనుకుంటే పచ్చి వెల్లుల్లిని మీ దైనందిన ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాలి. వయసు పెరిగే కొద్దీ వచ్చే కీళ్ల నొప్పులు, ఎముకల బలహీనత వంటి సమస్యలకు పచ్చి వెల్లుల్లి చక్కటి పరిష్కారం. ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో ఒక పచ్చి వెల్లుల్లి రెబ్బను తొక్క తీసి, చిన్న ముక్కలుగా కోసి లేదా దంచి నమిలి ఒక గ్లాసు గోరువెచ్చని నీటిని తాగండి. కొద్ది రోజుల్లోనే మీ ఎముకల పటుత్వంలో మార్పును గమనిస్తారు. ఇలా రోజూ చేయడం వల్ల మీ ఎముకలు దృఢంగా తయారవుతాయి. వెల్లుల్లిలో ఉండే సల్ఫర్ సమ్మేళనాలు మరియు యాంటీఆక్సిడెంట్లు ఎముకల సాంద్రతను మెరుగుపరచడానికి సహాయపడతాయి..దీంతో ఆస్టియోపొరోసిస్ వంటి సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

గుండె ఆరోగ్యం
ఈ రోజుల్లో చాలామంది గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. హార్ట్ ఎటాక్,హార్ట్ స్ట్రోక్ కారణంగా ఏటా వేలమంది చనిపోతున్నారు. అప్పటిదాకా హాయిగా నవ్వుతూ ఉండే మనిషి కూడా ఒక్క సెకనులో కుప్పకూలి సడెన్ గా గుండెపోటుతో మరణిస్తున్నారు. ఇటీవల కాలంలో ఇలాంటి మరణాలు చాలా నమోదయ్యాయి. అయితే గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో పచ్చి వెల్లుల్లి అద్భుతంగా పనిచేస్తుంది. ఇది రక్తపోటును(BP) నియంత్రించడంలో ఎంతగానో సహాయపడుతుంది. అంతేకాకుండా పచ్చి వెల్లుల్లిలో ఉండే పోషకాలు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ (LDL) లెవల్స్ తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ (HDL) లెవల్స్ పెంచుతాయి. దీనివల్ల రక్తనాళాలు శుభ్రపడి రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. నిరంతరం పచ్చి వెల్లుల్లిని తీసుకోవడం ద్వారా గుండెపోటు, స్ట్రోక్ వంటి తీవ్రమైన గుండె సంబంధిత సమస్యల బారిన పడకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు. మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి పచ్చి వెల్లుల్లి ఒక సహజసిద్ధమైన ఔషధం లాంటిది. మీ గుండె పదికాలాల పాటు పదిలంగా ఉండాలంటే వెల్లుల్లిని వెంటనే పరగడుపున తీసుకోవడం మెదలుపెట్టండి.
జీర్ణశక్తిని పెంచి, రోగనిరోధక శక్తికి రక్షణ
ఆరోగ్యకరమైన పేగులే సంపూర్ణ ఆరోగ్యానికి పునాది. పచ్చి వెల్లుల్లి కేవలం గుండెకు మాత్రమే కాదు మీ పేగు ఆరోగ్యానికి కూడా చాలా ప్రయోజనకరం. పచ్చి వెల్లుల్లి పేగులలోని హానికరమైన బ్యాక్టీరియాను నాశనం చేసి, మంచి బ్యాక్టీరియాను ప్రోత్సహిస్తుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.. మలబద్ధకం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలను తగ్గిస్తుంది. అంతేకాకుండా పచ్చి వెల్లుల్లి మీ రోగనిరోధక శక్తిని గణనీయంగా పెంచుతుంది. ఇందులో ఉండే అల్లిసిన్ వంటి సమ్మేళనాలు శరీరంలో రోగనిరోధక కణాల ఉత్పత్తిని ప్రేరేపించి, ఇన్ఫెక్షన్లతో పోరాడే శక్తిని పెంచుతాయి. దీంతో మీరు తరచుగా అనారోగ్యానికి గురికాకుండా ఉంటారు. సీజనల్ వ్యాధులు జలుబు, దగ్గు వంటి అనారోగ్యాల బారిన పడకుండా ఉంటారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications